మసాలా ఉండక పోతే జనాలకెక్కదు
నిజ జీవిత కథలతో నిర్మించే చిత్రాల్లో మసాలా ఉండకపోతే.. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి లేదా జనాలకెక్కదని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. అందువల్ల శృంగార దేవత సిల్క్‌స్మిత జీవితగాథతో నిర్మితమవుతున్న డర్టీ పిక్చర్స్ చిత్రంలో పాత్రకు, కథ డిమాండ్‌కు అనుగుణంగానే తన ఎక్స్‌పోజింగ్ ఉంటుందని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో మోతాదుకు మించి విద్యాబాలన్ తన అందచందాలను ఆరబోసినట్టు విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. దీనిపై విద్యాబాలన్ కాస్త ఘాటుగానే స్పందించింది. తానూ ఒక నటిననే విషయాన్ని గుర్తు పెట్టుకోంది. పాత్ర డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చెప్పింది చేయడమే నా విధిగా భావిస్తాను. డర్టీపిక్చర్‌లో దక్షిణాదిలో పాపులర్ అయినటువంటి సిల్క్‌స్మిత పాత్రలో, ఆ పాత్ర డిమాండ్ మేరకే నటించాను కానీ ఎక్కడా పరిధిదాటలేదని స్పష్టం చేసింది.
No comments:
Post a Comment