పవన్‌కళ్యాణ్‌తో ఎవరైనా సఖ్యంగా ఉండాలంటే... కష్టమేనని ఫిలింనగర్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం బాగా ఉండేది. అది ఉత్తుత్తి స్నేహమని జోరుగా వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెపువ్వు' అనే చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు పెట్టిన పేరు వర్కవుట్ కాదేమోనని అప్పుడే కొంతమంది ఊహించారు. ఆ తర్వాత వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల గురించి ప్రకటిస్తూ చెప్పాడు కూడా.. ఆ తర్వాత ఏం జరిగిందో..కానీ.. నేను చేయడంలేదని పవన్‌కళ్యాణ్ చెప్పేశాడట. అసలే.. రిజర్వ్‌గా ఉండే పవన్ బయటకూడా అలా ఉంటే ఫ్యూచర్‌లో హీరోగా నిలబడటం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయ్.
No comments:
Post a Comment