Thursday, September 29, 2011

రహస్య వివాహం చేసుకున్న కామ్నా జఠ్మలాని..!?


నటి కామ్మా జఠ్మాలాని దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం అవుతుంది. ఈ ఉత్తరాది భామ రణం, సినిమాతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. కాని తరువాత వెలువడిన అమెరికా అల్లుడు, అందమైన అబ్బందం వంటి సినిమాల్లో అంతగా రాణించలేక పోయింది. అలాగే తమిళంలో కూడా మచ్చకారన్, రాజాదిరాజన్ మొదలగు సినిమాలు చేసిన కామ్నా దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు అనే వ్యక్తిని రహస్యంగా వివాహమాడినట్లు సినీ వర్గాల్లో టాక్. కోటేశ్వరరావు ఇటీవల తనకు నచ్చిన వధువు కోసం స్వయంవరం కార్యక్రమాన్ని నిర్వహించారట. ఎంతో మంది సుందరాంగులు పాల్గొన ఈ కార్యక్రమానికి కామ్నా కూడా తన ఫోటోతో పాటు బయోడేటాను పంపించారట. ఈ స్వయంవరంలో ఆయన కామ్నాను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారట. తరువాత వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కామ్నా ప్రస్తుతం కొత్త సినిమాలు లేకపోవడంతో అమెరికాలో నివసిస్తున్న తన భర్త వద్దకు వెళ్లి వారితో కలిసి చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం.

Sunday, September 25, 2011

బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే సెక్స్ సినిమాలు చేయాలి!!

 
టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్ ఇటీవలే బాలీవుడ్ చిత్ర రంగంలో అడుగుపెట్టింది. సింగం చిత్రం ద్వారా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం మంచి సక్సెస్‌నే సాధించి పెట్టింది.
పైపెచ్చు.. ప్రముఖ మ్యాగజైన్లకు టాప్‌‍లెస్ ఫోటోలు ఇచ్చి మరింత పబ్లిసిటీని కొట్టేసింది. దీంతో కాజల్ పేరు ఒక్కసారి బాలీవుడ్‌లోనే కాదు.. దేశ చలన చిత్ర పరిశ్రమల్లో మార్మోగిపోయింది. పబ్లిసిటీ పెంచుకోవడానికి, అవకాశాలు దక్కించుకోవడానికి కాజల్ వేసిన ఈ ప్లాన్ పై ఇప్పడు పలు రకాలు జోక్స్ పేలుస్తున్నారు సినీ జనాలు.
ఇలా బట్టలు విప్పడం ద్వారా బాలీవుడ్ అవకాశాలు రావని, ఇలాంటి చర్యల వల్ల వచ్చేవి మలయాళంలో షకీలా నటించిన తరహా సెక్స్ సినిమా అవకాశాలు మాత్రమేనంటూ సెటైర్లు వేసేవారు లేకపోలేదు.అయితే, వీటిపై పెద్దగా పట్టించుకోని కాజల్.... ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ ఉంటే ఇలాంటివి చేయక తప్పదని అంటున్నారు. పైపెచ్చు.. బాలీవుడ్‌లో ఉన్న వందల మంది భామల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాలంటే కొన్ని సెక్స్ సినిమాలు కూడా చేయక తప్పదనే భావనకు కాజల్ వచ్చిందట.

రామ్ చరణ్ తేజ - ఉపాసనల నిశ్చితార్థానికి రూ.4 కోట్లు..?!!


మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్థం త్వరలో జరుగనుంది. దసరా పండుగ ముగిసిన తర్వాత ఘనంగా రామ్ చరణ్ ఉపాసనల నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అటు రామ్ చరణ్ కుటుంబం, ఇటు ఉపాసన కుటుంబం సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరి నిశ్చితార్థాన్ని హైదరాబాదుకు 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమకొండలో చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్ర, రాయలసీమ నుంచి ప్రత్యేకమైన వంటకాలతోపాటు దొమకొండలో నిశ్చితార్థం జరుగనున్న ప్రాంతాన్ని ఆకర్షణీయమైన అలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లుకే సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు నిశ్చితార్థం రోజున ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ ధరించే దుస్తులు అదరగొడతాయంటున్నారు. ఇక ఉపాసన అలంకరణకు అవసరమైన నగలు, పట్టు చీరలు వగైరా.. వగైరాలపై కామినేని కుటుంబం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందట.