గీత గోవిందం" చిత్రంలో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన
కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ ఒక్క సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో
వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి ముందు తన ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్
శెట్టితో జరిగిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకుంది. ఇపుడు ఆమెకు వరుస
ఆఫర్లు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా రష్మిక
చేరిపోయింది.
ఈ నేపథ్యంలో రష్మిక మీడియా "గీత గోవిందం" సెట్‌లో చిత్ర యూనిట్ తనను
ఆటపట్టించిన తీరును వెల్లడించింది. ఓసారి 'గీత గోవిందం' షూటింగ్ స్పాట్‌కు
వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని చెప్పింది. 'నాతో ఎవరైనా నవ్వుతూ
మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఆరోజు షూటింగ్ స్పాట్‌కు కొంచెం
ఆలస్యంగా వెళ్లడంతో సెట్లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా
ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేను ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే
దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. "నిన్ను
ఆటపట్టించడానికే ఇదంతా చేశాం" అంటూ ఓదార్చారు. అప్పటివరకూ నన్ను ఫాలో
అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని
అప్పటివరకూ నాకు తెలియలేదు అని చెప్పుకొచ్చింది.
అదేసమయంలో తనకు పుస్తకాలు ముట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందనీ, సినిమా పాటలు
మాత్రం బాగా వింటానని రష్మిక తెలిపింది. వంట చేయడం కూడా కొంచెంకొంచెం
వచ్చని వెల్లడించింది. ఇక కేక్ అయితే అద్భుతంగా చేస్తానని రష్మిక తన
సీక్రెట్‌ను వెల్లడించింది.
No comments:
Post a Comment