Friday, February 4, 2011

నసీరుద్దీన్‌షాతో విద్యాబాలన్ రొమాన్స్

నసీరుద్దీన్‌షాతో విద్యాబాలన్ రొమాన్స్ 


బాలీవుడ్ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ ఉన్నట్లుండి హాట్ సీన్లలో నటించడం మొదలుపెట్టింది. హోమ్లీ పాత్రలు వేస్తే ఆట్టే సినిమాల్లో కొనసాగలేమని అనుకుందో ఏమోగానీ ఎడాపెడా లిప్ లాక్ కిస్సులు ఇచ్చేస్తోంది. అదీ కుర్రహీరోలతోనైతే ఫర్లేదు. నడివయసున్న నసీరుద్దీన్‌షాకు ఇవ్వడమే ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఇష్కియా చిత్రంలో ఈ ప్రౌఢసుందరి తన పెదవులతో బిగించి వేడి వేడి ముద్దులు ఇచ్చే సన్నివేశంలో నటించింది. ఈ ముద్దువల్లనో లేదంటే సినిమా కథలో పట్టువల్లనో ఆ సినిమా హిట్ అయింది. తాజాగా సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ది డర్టీ పిక్చర్"లోనూ నసీరుద్దీన్ పెదవులను చుంబించడానికి రెడీ అయిపోయిందట విద్య. అదేమని అడిగితే... సన్నివేశం డిమాండ్ చేస్తున్నప్పుడు మూతి బిగించి ఎలా కూచుంటాం అని ప్రశ్నిస్తోందట. 

Thursday, February 3, 2011

బికినీలో చూడొచ్చు

బికినీలో చూడొచ్చు


అసిన్ బికినీలో కన్పిస్తే ఎలా వుంటుంది..? అసిన్ బికినీ ధరించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్న హాట్ టాపిక్స్‌ల్లో ఇది ఒకటి. ‘‘ ఛాన్సే లేదు. బికినీ నా శరీరానికి నప్పదు. అది వేసుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. బికినీలో అందాల ప్రదర్శన చేయను’’ అని ఒకప్పుడు చాలా సార్లు బికినీపై అయిష్టాన్ని ప్రదర్శించిన ఈ తార... ఇప్పుడు మాటమార్చారని సమాచారమ్. అసిన్ బికినీలో కనిపించకపోయినా, బికినీలో ఈ ముద్దుగుమ్మ ఎలా వుంటుందనే విషయమై ఇటీవల ఓ మార్ఫింగ్ ఫొటోని ఔత్సాహికులు ఇంటర్నెట్‌లో రూపొందించారు. ఈ విషయంలో కూడా ఆ ఫొటో తనది కాదనీ, తాను బికినీలో కన్పించే ప్రస్తకే లేదని ఈ మధ్యనే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఈ తార. ఇప్పుడేమో ఆల్ట్రా స్టైలిష్‌గా వుండేలా, స్విమ్మింగ్ పూల్‌లో సన్నివేశమంటూ చేయాల్సి వస్తే.. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చారు అసిన్. అప్పటి వరకు బికినీ విషయంలో ఆమె పెట్టుకున్న నిబంధనల్ని కాస్త సడలించి, తాను బికినీకి రెడీ అనే సందేశాన్ని బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు ఈ మాటలతో పంపారు. అసిన్. సో. త్వరలోనే ప్రేక్షకులు అసిన్‌ను బికినీలో చూడబోతున్నారని అనుకోవచ్చు. ఆమెను తొలిసారిగా బికినీలో చూపించే దర్శక, నిర్మాతలు ఎవరో కూడా వేచి చూడాలి.

షాహిద్‌ని నేనే పిలిచాను

షాహిద్‌ని నేనే పిలిచాను


ఔను.. షాహిద్ మా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఏంటట?’’ అని ఒకింత నిర్లక్ష్యంగా, కూల్‌గా అంటున్నారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఐటి అధికారులు ప్రియాంక ఇంటి బజర్ నొక్కినప్పుడు షాహిద్ కపూరే తలుపులు తెరిసాడనే వార్తలు వచ్చాయి. ‘7 ఖూన్ మాఫ్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకొచ్చినప్పుడు ఈ విషయం గురించి విలేకరులు ప్రియాంకను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రియాంక పై విధంగా స్పందించారు. కానీ ఇన్‌కమ్ టాక్స్ అధికారులు వచ్చిన తర్వాతే తను మా ఇంటికొచ్చాడని చెబుతూ - ‘‘ఐటి ఆఫీసర్స్ మా ఇంటికొచ్చినప్పుడు మా అమ్మా నాన్న లేరు. దాంతో షాహిద్‌కు ఫోన్ చేశాను. మా ఇంటి దగ్గర్లోనే తన ఇల్లూ ఉంది. తను 3 నిమిషాల్లో వచ్చాడు’’ అన్నారు ప్రియాంక.

Wednesday, February 2, 2011

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్


మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటా’’ అని ఫ్లయిట్ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ‘కాక్‌పిట్’లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా నడుపుతున్నారో చూడాలన్నదే త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలాగైనా తీర్చుకోవాలని త్రిష పంతం పట్టారు. విమానం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొఫైల్‌ను ఎయిర్ హోస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం సాగుతోంది. కానీ ఒక్క పైలట్ కూడా త్రిష కోరికను మన్నించలేదట. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. అయినా పట్టు వదలకుండా త్రిష ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి, తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొఫైల్ పంపించారట. ఈసారి కూడా ‘నో’ అనే సమాధానమే వస్తుందని ఫిక్స్ అయ్యారట. కానీ పైలట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిలాషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాదు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అట. చెన్నయ్ నుంచి హాంగ్‌కాంగ్‌కి వెళ్లే విమానంలోనే త్రిష తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా ఒకటి. ‘‘పవన్ కళ్యాణ్ సరసన నటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన రాక్ చేస్తున్నారు’’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు త్రిష. ఇంత స్లిమ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని అడిగితే - ‘‘నేను యోగా చేస్తానన్న విషయం తెలిసిందే. అలాగే ఆహార నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తా. షూటింగ్స్ లేనప్పుడు టెన్నిస్ ఆడతాను. ఈ ఆట కేలరీలను సునాయాసంగా కరిగించేస్తుంది. అందుకే వీలు కుదిరినప్పుడట్టా టెన్నిస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా’’ అన్నారు.

అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది: స్నేహా ఉల్లాల్‌

అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది: స్నేహా ఉల్లాల్‌ 


ఒకప్పటి సినిమా హీరోయిన్లు నాభీ కిందికి చీర కట్టి నటించాలంటే తెగ సిగ్గు పడేవారు. అయితే నేటి ట్రెండ్‌లో సిగ్గు అంటే ఏమిటి...? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాలం అలా మారింది. తాజాగా స్నేహా ఉల్లాల్‌ హైదరాబాద్‌ వచ్చింది. తన గురించి ప్రశ్నలు సంధించమని విలేకరుల్ని అడిగింది. కొత్తగా వచ్చిన విలేకరిని అడగమని పక్కవారు ప్రోత్సహించినా అతడు ఏమీలేదని.. కాస్త తలదించుకున్నాడు. దీంతో.. సిగ్గా.. అంటూ అతన్ని ఉత్సాహపర్చింది. అడగడానికి సిగ్గెందుకు... చెప్పడానికి నాకు లేనప్పుడు అని తెలుగులోనే మాట్లాడింది...అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది...హిందీలో 'లక్కీ' చిత్రంలో నటించి టాలీవుడ్‌కు వచ్చిన స్నేహా ఉల్లాల్‌... ప్రస్తుతం తను సినిమాలు చేయడం లేదని చెప్పింది. కన్నడలో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపింది. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం చేశాక బ్యాక్‌ పెయిన్‌ ఎక్కువయిందంది. దాంతో డాక్టర్లు ఏడాదిపాటు రెస్ట్‌ తీసుకోమన్నారు. అది తగ్గింది అనుకుంటుండగా... బాలకృష్ణ 'సింహా'లో నటించా. ఆ తర్వాత మళ్ళీ పెయిన్‌ ఎక్కువయింది. డాక్టర్లు మళ్లీ చేయవద్దన్నారు. కొంతకాలం రెస్ట్‌ తీసుకుని ఆ తర్వాత అవకాశాలు వస్తే చేస్తానని అంది. 

Tuesday, February 1, 2011

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా 


ఈ వారం రోజుల్లో ఇలియానా రెండు సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత పని ఎందుకు జరిగింది అనుకుంటున్నారా?... ఆ విషయానికే వస్తున్నాం.. వారం రోజుల క్రితం ఈ గోవా బ్యూటీ ‘మై సిస్టర్స్ కీపర్’ అనే ఇంగ్లిష్ సినిమా చూశారట. ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఇలియానా కళ్లు చెమర్చేలా చేశాయి. నటీనటుల నటన, కథ ఈ గోవా బ్యూటీని అంతగా కదిలించాయట. ఇది జరిగిన నాలుగు రోజులకు మళ్లీ ఇలియానా కళ్లు వర్షించాయి. ఈసారి వేరే సినిమా వలన కాదు.. తను చేసిన ‘నేను నా రాక్షసి’ కోసం ఇలియానా ఏడ్చారు. ఈ ఏడుపుకి కారణం సదరు సినిమా షూటింగ్ పూర్తవ్వడమే. రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి సీన్ తీయడం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ ‘పేకప్’ చెప్పగానే... ఇలియానా చాలా బాధపడ్డారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘పోకిరి తర్వాత మళ్లీ పూరీతో చేసిన చిత్రం ఇది. ఆయనతో రెండో సినిమా చేయడం అనేది నా కల. ఈ చిత్రంలో పూరి నాకు మంచి పాత్ర ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక, రానా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను సెట్లో ఉంటే చాలా సందడిగా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడే పూర్తయ్యిందా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ యూనిట్‌తో నా ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా సాగింది. అందుకే ఈ చిత్రం నాకు చాలా చాలా ప్రత్యేకం. ‘నేను నా రాక్షసి’ విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. పూరి, నా కాంబినేషన్‌లో రూపొందిన ‘పోకిరి’ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ మా కాంబినేషనలో మరో సక్సెస్ చవి చూడబోతున్నాం’’ అన్నారు.

నవనీత్‌ కౌర్‌ పెళ్లి

నవనీత్‌ కౌర్‌ పెళ్లి



'శీను వాసంతి లక్ష్మి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ నవనీత్‌ కౌర్‌. ఈమె బుధవారం పెళ్లి చేసుకోబోతోంది. మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గ శాసనసభ్యుడు రవి రాణా ఆమె కాబోయే భర్త. అమరావతి పట్టణంలో జరిగే సామూహిక వివాహాల్లో నవనీత్‌ - రాణా దంపతులవుతారు. అక్కడ 2834 జంటలు ఒకేచోట పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ భారీ వేడుక ప్రపంచ రికార్డుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదవుతుందని తెలిసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, సంజయ్‌దత్‌లతోపాటు యోగా గురు బాబా రామ్‌దేవ్‌ కూడా హాజరవుతారు. నవనీత్‌ కౌర్‌ తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. పెళ్లయిన తరవాత నవనీత్‌ సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని కాబోయే భర్త రవి రాణా తెలిపారు.