Wednesday, February 2, 2011

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్


మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటా’’ అని ఫ్లయిట్ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ‘కాక్‌పిట్’లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా నడుపుతున్నారో చూడాలన్నదే త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలాగైనా తీర్చుకోవాలని త్రిష పంతం పట్టారు. విమానం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొఫైల్‌ను ఎయిర్ హోస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం సాగుతోంది. కానీ ఒక్క పైలట్ కూడా త్రిష కోరికను మన్నించలేదట. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. అయినా పట్టు వదలకుండా త్రిష ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి, తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొఫైల్ పంపించారట. ఈసారి కూడా ‘నో’ అనే సమాధానమే వస్తుందని ఫిక్స్ అయ్యారట. కానీ పైలట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిలాషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాదు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అట. చెన్నయ్ నుంచి హాంగ్‌కాంగ్‌కి వెళ్లే విమానంలోనే త్రిష తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా ఒకటి. ‘‘పవన్ కళ్యాణ్ సరసన నటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన రాక్ చేస్తున్నారు’’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు త్రిష. ఇంత స్లిమ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని అడిగితే - ‘‘నేను యోగా చేస్తానన్న విషయం తెలిసిందే. అలాగే ఆహార నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తా. షూటింగ్స్ లేనప్పుడు టెన్నిస్ ఆడతాను. ఈ ఆట కేలరీలను సునాయాసంగా కరిగించేస్తుంది. అందుకే వీలు కుదిరినప్పుడట్టా టెన్నిస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా’’ అన్నారు.

No comments:

Post a Comment