Sunday, February 20, 2011

నిశ్చితార్థం అయ్యింది

నిశ్చితార్థం అయ్యింది


దయచేసి నా ప్రేమను అంగీకరించు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోవా’’ అని మోకాళ్ల మీద కూర్చుని రీమ్మాసేన్‌ని అభ్యర్థించారు శివ్ కరణ్ సింగ్. ఇదేదో సినిమాలో సీన్ అనుకుంటున్నారేమో! అదేం కాదు. నిజంగానే రీమ్మా దగ్గర తన ప్రేమను పై విధంగా వ్యక్తపరిచారు శివ్. ఆయన ప్రతిపాదన వినగానే.. రీమ్మా ఓ చిరునవ్వు నవ్వి.. ఆనందంగా ఒప్పుకున్నారట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని శివ్ ముందే ఊహించారేమో.. వెంటనే రీమ్మా వేలికి ఉంగరం కూడా తొడిగేశారు. ఆ రకంగా నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్లి జరగడమే ఆలస్యం. రీమ్మాకి ఆప్తమిత్రుడైన రియాజ్ ద్వారా రెండేళ్ల క్రితం శివ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. కాకపోతే శివ్‌లో ప్రేమ చిగురించింది మాత్రం మూడు నెలల క్రితమే. ఈ విషయం గురించి శివ్ చెబుతూ - ‘‘రీమ్మాని మించిన మంచి జీవిత భాగస్వామి దొరకదనిపించడంతో ప్రపోజ్ చేశాను. నా ప్రేమను రీమ్మా స్వీకరిస్తుందా, లేదా? అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ రీమ్మా ఒప్పుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

No comments:

Post a Comment