అది ప్రభు నిర్ణయమే:నయనతార
నేటి తరం కథానాయికలకు పౌరాణిక చిత్రాల్లో నటించే అవకాశం అరుదుగానే లభిస్తుంది. నయనతార ఇప్పుడు సీతాదేవిగా తెర మీదకు రాబోతోంది. బాపు రూపొందించే 'శ్రీరామరాజ్యం'లో నయన్ నటిస్తోంది. కథానాయికగా అదే ఆమె ఆఖరి చిత్రం. అందుకే కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదు. ప్రభుదేవాని నయన్ ఈ యేడాదే వివాహం చేసుకొనే అవకాశాలున్నాయి. పెళ్లయ్యాక నటనకు స్వస్తి చెప్పబోతోంది నయన్. ఈ నిర్ణయం ఎవరిదని అడిగితే ''పెళ్లయ్యాక నటించవద్దని ప్రభు చెప్పారు. ఆయన చెప్పాక నేను ఆలోచించాను. అది సరైన నిర్ణయమే అనిపించింద''ని ఈ కేరళ కుట్టి చెబుతోంది. నయన్ నటించిన 'బాడీగార్డ్' అనే మలయాళ చిత్రం అన్ని భాషల దర్శకనిర్మాతల్నీ ఆకట్టుకొంది. తమిళంలో రీమేక్ చేసేటప్పుడు కూడా ఆమెనే కథానాయికగా నటించమని అడిగారు. అంగీకరించలేదు. వివాహానంతరం సినిమాలోని మరే విభాగంలోకీ ప్రవేశించే ఆలోచన లేదనీ, గృహిణిగానే ఉంటాననీ ఆమె చెబుతోంది
No comments:
Post a Comment