Saturday, February 5, 2011

అందుకే నన్ను అబ్బాయిలా చూస్తారు

అందుకే నన్ను అబ్బాయిలా చూస్తారు


తెలుగు హీరోలు ఇగోయిస్ట్‌లని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువ అని నాతో చాలామంది అన్నారు. ‘కాంచనమాల కేబుల్ టి.వి.’ సినిమా ఒప్పుకున్నప్పటి సంగతి ఇది. కానీ వారు అన్నట్లుగా ఇక్కడి పరిస్థితి లేదు. టాలీవుడ్‌లో అందరూ స్నేహంగా ఉంటారు’’ అన్నారు లక్ష్మీరాయ్. ఈ అందాల తార ‘కాంచనమాల..’లో నటించి దాదాపు ఆరేళ్లయ్యింది. ఈ ఆరేళ్లల్లో అనువాద చిత్రాల ద్వారా లక్ష్మీరాయ్ తెలుగు తెరపై కనిపించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో చాలాకాలం తర్వాత స్ట్రయిట్ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉందని ఈ అందాల తార అంటున్నారు. గ్లామర్ రోల్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ సందర్భంలో లక్ష్మీరాయ్‌ని అడిగితే - ‘‘గ్లామరస్ హీరోయిన్లను చూడ్డానికే యూత్ సినిమాలకు వస్తారన్నది నా అభిప్రాయం. అందుకే గ్లామర్‌గా కనిపించి వాళ్ల మనసులను గెల్చుకోవాలనుకుంటాను. సెక్సీగా కనిపించడానికి ఇష్టపడతాను కానీ వల్గార్టీకి మాత్రం దూరంగా ఉంటాను’’ అన్నారు. మీ పేరంట్స్ మీకెలాంటి సపోర్ట్‌నిస్తున్నారు? అనే ప్రశ్నను లక్ష్మీరాయ్ ముందుంచితే - ‘‘ఫస్టఫాల్ మా అమ్మా నాన్న ప్రోత్సాహం లేకపోయుంటే నేనీ స్థాయికి వచ్చేదాన్ని కాను. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయాను గానీ తమిళ్, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేశాను. మలయాళంలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు చేస్తున్నాను. మా అమ్మా నాన్నకి మేం మొత్తం ముగ్గురు అమ్మాయిలం. నేనే చిన్నదాన్ని. అందుకని నన్ను చాలా గారాబంగా పెంచారు. నా స్టిస్టర్స్‌తో నేనెప్పుడూ గొడవ పడుతుంటాను. మా గొడవతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. మా నాన్నకి మగపిల్లలంటే ఇష్టం. కానీ మేం ముగ్గురం ఆడపిల్లలు కావడంతో.. నన్ను అబ్బాయిలా ట్రీట్ చేస్తారు. నాన్న నన్ను ముద్దుగా ‘కృష్ణా’ అని పిలుస్తారు’’ అని చెప్పారు.

No comments:

Post a Comment