Thursday, February 24, 2011

మరోసారి అలా జరిగితే చెంప ఛెళ్ళ్‌మంటుంది

మరోసారి అలా జరిగితే చెంప ఛెళ్ళ్‌మంటుంది


అభిమానులు, ఆర్క్‌లైట్ల కాంతులు... ఇదంతా మా జీవితంలో భాగం మాత్రమే. మాకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికి భంగం వాటిల్లజేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు’’ అంటున్నారు. పెళ్ళయిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి. ఇటీవల ముంబైలో ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌కి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైందట.
కొందరు ఆకతాయిలు శిల్ప పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె మనస్థాపానికి లోనయ్యారట. ఈ సందర్భంలోనే ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘గతంలో కూడా ఇలాంటివి కొన్ని ఎదురయ్యాయి. కానీ వాటిని లైట్‌గా తీసుకున్నాను. ఈ సారి మాత్రం అలా తీసుకోలేకపోతున్నాను. అక్కడ కొందరి ప్రవర్తన నాకు అసహ్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే... చెంప ఛెళ్ళ్ మనిపిస్తా’’ అని ఘాటుగా స్పందించారు శిల్ప. ఇంతకీ ఆ ఆకతాయిలు మిమ్మల్ని ఏమన్నారు? అని అడిగితే- ‘నో కామెంట్’ అంటూ నిష్ర్కమించారు శిల్ప.

No comments:

Post a Comment