అతనే నా డ్రీమ్‌బాయ్
యుక్తవయసు వచ్చిన ప్రతి అమ్మాయి, అబ్బాయికి కొన్ని కోరికలుంటాయి. మంచి జాబ్‌తో పాటు మంచి వ్యక్తితో తన వివాహం జరగాలనేది ఆ కోరికల్లో ప్రధానంగా చోటుచేసుకునే అంశాలు. సినిమా తారలు విషయంలో.. వారుసినిమాల్లో నటిస్తుంటారు కాబట్టి మొదటి అంశానికి తావు వుండదు. ఇక రెండో అంశానికొస్తే- అందరు అమ్మాయిల్లాగే వారికీ ‘లైఫ్ పార్టనర్’ గురించి కలలు వుంటాయి. వేదం, మిరపకాయ్, వాంటెడ్ చిత్రాలతో కురక్రారును బాగా ఆకట్టుకుంటున్న దీక్షాసేథ్‌ని ఆ విషయమై అడిగినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘కాబోయేవాడి గురించి నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే లేవు. బాగా చదువుకుని ఉండి, సింపుల్‌గా బిహేవ్ చేసే వ్యక్తి అయితే చాలు. అతనే నా డ్రీమ్ బాయ్ అని చెబుతాను’’. ఇటీవల హైదరాబాదులోని మాదాపూర్‌లో ఏర్పాటైన ఓ కబాబ్ సెంటర్ ప్రారంభానికి హాజరైన సందర్భంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీక్షా ఆ విషయాన్ని తెలిపారు. కబాబ్స్ అంటే మీకు ఇష్టమా? అని అడిగినప్పుడు... కబాబ్‌ని కొరికితిని మరీ, ‘‘ఆస్ట్రేలియన్స్ కబాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆ టేస్టే వేరు. నాకు ఇష్టమైన అలాంటి ఔట్‌లెట్‌ని నా చేతులమీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారామె. వెజ్, నాన్‌వెజ్‌లలో వెజ్ చాలా ఆరోగ్యకరమని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు . దీక్షాసేథ్ బర్త్‌డే - ఈ నెల 14. అదేరోజు ‘ప్రేమికుల దినం’ కావడం విశేషం. తను హీరోయిన్ అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇదని, ఆ రోజు ముంబైలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మధ్య జరుపుకుంటానని ఆమె చెప్పారు. విక్రమ్, ప్రభాస్, మనోజ్ హీరోలుగా రూపొందే చిత్రాల్లో దీక్షాసేథ్ నటించనున్నట్లు తెలిసింది.
No comments:
Post a Comment