Thursday, February 17, 2011

త్రిష సునక సేవ

 త్రిష సునక సేవ 

నిషన్నాక కుసింత కలాపోసన ఉండాలి.. అని చెబుతుంటారు. దాంతో పాటు కాస్తో కూస్తో దేశ సేవ కూడా చేయాలి. దేశానికంతటా సేవ చేసే సమయం లేదంటే వీధిలోకి వస్తే చాలు. మన సేవ కోసం చాలా జీవులు ఎదురుచూస్తుంటాయి. త్రిష కూడా అదే చేసింది. 'పేటా'లో సభ్యత్వం పొంది, వీధి కుక్కల సేవకు తన రోజువారీ జీవితంలో కాస్త సమయం కేటాయించింది. ఖరీదైన విదేశీ శునకాల్ని కొనడం ఎందుకు అని ప్రశ్నిస్తోంది. వాటి బదులు వీధి కుక్కల్ని దత్తత చేసుకొని సంరక్షించమని సలహా ఇస్తోంది. త్రిష చేస్తున్న సేవల్ని 'పేటా' ప్రశంసించింది. త్రిషని అభినందిస్తూ ఓ ఉత్తరం పంపింది. అంతే కాదు త్రిష పెంచుకొంటున్న కుక్కపిల్ల జోయాకు ఓ టీ షర్ట్‌ కూడా కానుకగా అందించింది. ఇవి రెండూ చూసుకొని త్రిష మురిసిపోతోంది.

No comments:

Post a Comment