ఆ ‘ముద్దు’ నిజం కాదు
సన్నివేశానికి అనుగుణంగా హాట్ హాట్‌గా కనిపించడానికి నేను రెడీ. అలా కాకుండా, ‘లిప్‌లాక్’ సీన్స్‌లో నటించమంటే మాత్రం నేను ఒప్పుకోను’’ అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ‘ఏక్‌నిరంజన్’ తార కంగనా రనౌత్. ఇటీవల ‘ముద్దు’ గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘అది మంచి పద్ధతికాదు. ఇలా పెదవులు కలిపి ముద్దాడడం వల్ల ఒకరి నోట్లో క్రిములు మరొకరి నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని మూలంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే లిప్ టు లిప్ ముద్దులకు నేను దూరం’’ అని చెప్పారు. అయితే ఇటీవలే ఆమె ‘తను వెడ్స్ మను’ చిత్రంలో మాధవన్‌తో దాదాపు రెండు నిమిషాల పాటు సాగే పెదవి ముద్దు సన్నివేశంలో నటించారట. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎలా స్పందించాలో తెలీక కాస్తంత ఇరకాటంలో పడ్డారు ఈ అందాల భామ. దాంతో ఆమె పెదవి విప్పుతూ- ‘‘అవును... ముద్దు సన్నివేశంలో చేశాను. అదేం నిజం ముద్దు కాదే. దాన్ని వివాదాస్పదం చేయాల్సిన పనేముంది. నేను అన్న మాటలు నేటికీ కట్టుబడి ఉంటాను’’అని రుసరుసలాడుతూ చెప్పారు కంగనా.
No comments:
Post a Comment