Saturday, February 5, 2011

ప్రేమించేందుకు తీరిక లేదు

ప్రేమించేందుకు తీరిక లేదు


ప్రేమించని వాళ్లను వేస్ట్ లిస్ట్‌లో వేసేస్తారని, అయితే ప్రేమించేందుకు తనకు తీరిక లేదని నటి కాజల్ అగర్వాల్ అంటోంది. ప్రేమ గురించి చాలా అనుభవం గడించినట్లు పెద్ద ఉపోద్ఘాతమే చెబుతోంది ఈ ఉత్తరాది భామ. తొలుత కోలీవుడ్‌లో ప్రవేశించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రకాశిస్తున్న కాజల్ మాట్లాడుతూ పాఠశాల దశలో చదువు గురించి విచారిస్తారని, యవ్వన దశలో ఎవరిని ప్రేమిస్తున్నావ్ అని అడుగుతారని అంటోంది.ముఖ్యంగా యువకులు ప్రేమించాలని తాపత్రయపడతారని చెబుతోంది. అయితే ప్రేమకు తాను చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని అంటోంది. అలాగని దానికోసం తొందరపడనని చెబుతోంది. ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటి స్తూ బిజీగా ఉన్నానని చెబుతున్న కాజల్ ప్రేమకు వయసుతో పని లేదని తెలిపింది. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించిందని, కొందరు మోహాన్ని ప్రేమగా భావించి తప్పుదారి పడుతున్నారని ప్రేమతత్వాన్ని వళ్లిస్తోంది.

No comments:

Post a Comment