నాకూ ఓ లవరుంది"- కృష్ణుడు
శ్రీ శివపార్వతీ కంబైన్స్ పతాకంపై,మాస్టర్ హేమ చంద్రా రెడ్డి, బేబీ హేమశ్రీ సమర్పణలో, కృష్ణుడు హీరోగా, రితిక హీరోయిన్ గా, కె.రామ్ వెంకీని దర్శకుడిగా పరిచయం చేస్తూ,కె.సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం"నాకూ ఓ లవరుంది".ఈ చిత్ర దర్శకుడు కె.రామ్ వెంకీ గతంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడుగా పనిచేసిన అనుభవం ఉంది.ఈ చిత్రానికి గతంలో "ఆనంద్,గోదావరి, చందమామ" వంటి చక్కని చిత్రాలకు సంగీతం అందించిన కె.యమ్.రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.ప్రముఖ మాటల,పాటల రచయిత లక్ష్మీ భూపాల్ ఈ చిత్రంలో మూడు చక్కని పాటలు వ్రాశారు.ఈ చిత్రాన్ని వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రారంభస్తారు.
No comments:
Post a Comment