Tuesday, February 8, 2011

గాయని సునీత ఎఫైర్..?

గాయని సునీత ఎఫైర్..?!


గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఈటీవీలో పాటలకు యాంకర్‌గా పలు పాత్రలు పోషించిన సునీత... నిజజీవితంలో విడాకులకోసం అభ్యర్థిస్తోందని తెలిసింది. ఎస్‌.పి. బాలు ప్రోత్సాహంతో సింగర్‌గా ఎదిగిన ఆమెకు గతంలో గాయనిగా నంది అవార్డు కూడా దక్కింది. ఓ టీవీ ఛానల్‌లో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఉండే కిరణ్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని సమాచారం. దీనికి కారణం... గత కొంతకాలం ఆమె వి.ఎన్‌. ఆదిత్య అనే దర్శకునితో సన్నిహితంగా ఉండడమేనని ఫిలిమ్ నగర్ చెవులు కొరుక్కుంటోంది. విషయం బయటపడడంతో బెడిసికొట్టిందని ఫిలింనగర్‌ కథనం. ప్రస్తుతం విడాకులు కోరుకుంటుందని సమాచారం. కానీ.. ఇటువంటి సంబంధాలతో సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆడవారికి బ్యాడ్‌నేమ్‌ వస్తుందనీ, సాధ్యమైనంతవరకు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సినీ విమర్శకులు చెబుతున్నారు.

3 comments:

  1. వాళ్ళిద్దరూ చాల దగ్గర భంధువులు ,ఇల్లు కూడా వొకే చోట
    అంతకు మించి వాళ్ళిద్దరికీ ఏ సంభంధం వుండే అవకాశం యెంత మాత్రం లేదు .
    అదికాక ఆదిత్య ఎక్కడో ఇంటికి దూరం గా రూం తీసుకుని కొత్త సినిమాకి కధ రాసుకోడం లో బిజి
    సాంప్రదాయ బద్దం గా వుండే అమ్మాయి గురించి రాసినప్పుడు నిజా నిజాలు నిర్ధారించుకుని రాస్తే
    క్రెడిబిలిటీ పెరుగుతుంది .

    ReplyDelete
  2. మీ బ్లాగు పేరు గొప్ప ఆంధ్రా రాసే వన్ని పనికి మాలిన రాతలు. మీరే కాదు ఇదే పేరు తో ఇంకొక వెబ్సైట్ ఉంది. ఇలానే మొన్న మధు యాష్కి మళ్ళి పెళ్ళి చేసుకో పోతునందాడని రాశాడు. మధుయాష్కి వారికి కోర్టు నోటీస్ పంపాడు. అది ఎక్కడా సదరు వెబ్ సీట్ వారు రాసుకోలేదు. టి వి పేడితే సినేమా పోగ్రాంల గోల, అదికాక ఎన్నో సినేమా పత్రికలు ఉన్నాయి, ఇంకా బ్లాగు పేట్టుకొని మరీ ఈ సినేమా వాళ్ళా చెత్త విషయాలు రాస్తున్నావంటే మీ స్థాయి అర్థమౌతున్నాది. ఇటువంటి రాతలు రాయటం ఒక వ్యాధిలాగా తయారయింది.

    ReplyDelete
  3. ఇంతకీ ఇవన్నీ సొంత వ్రాతలా - కాపీ కూతలా !?

    ReplyDelete