Thursday, February 24, 2011

అవసరాలకు వాడుకున్నారు

అవసరాలకు వాడుకున్నారు


ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటనతో వార్తల్లో ఉండే హీరోయిన్లలో లక్ష్మీరాయ్ ఒకరు. తాజాగా ఆమె తనను కొంతమంది అవసరాలకు వాడుకుని వదిలేశారని చెప్పడం చర్చనీయాంశంగా మారిం ది. తోటి నటులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారని ఆమె పై పుకార్లు షికార్లు చేస్తుంటాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనితో ప్రేమాయణం సాగిస్తున్నారని కొద్ది రోజులు జోరుగా ప్రచారం సాగింది. తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని ఆమె పలుమార్లు వివరణ ఇచ్చుకున్నారు. అది సమసిపోక ముందే మళ్లీ ఇప్పు డు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో తెలియక చిత్ర పరిశ్రమ తలలు పట్టుకుంటోంది. ఇది లావుండగా లక్ష్మీరాయ్ ఇప్పుడు స్టార్ క్రికెటర్ సచిన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సచిన్‌అంటే చాలా ఇష్టమంటున్నారు. ఆయన ప్రశాంత వదనం, చార్మిం గ్‌నెస్ బాగా నచ్చుతాయని అంటున్నారు. ఆయన బ్యాటింగ్ చేసే తీరు విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment