విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక..?!!
రోజాపూలు చిత్రంలో రోజారేకుల్లాంటి సోయగాలతో అలరించి, ఖుషీలో నిమ్మపండు అందాలతో చిత్తు చేసిన సెక్సీ హీరోయిన్ భూమిక తన భర్తతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ ఫిలిమ్ న్యూస్. విశ్వసనీయ సమాచారం ప్రకారం... భూమిక భర్త భరత్ ఠాకూర్ ఆమెను పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయేట్లు చేశాడట. అంతేనా... అంటే.. ఇంకా చాలావుంది అంటున్నారు సినీజనం. ఇటీవల కాలంలో భరత్ ఠాకూర్ ఓ అత్యున్నత కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో అక్రమ సంబంధం నెరపుతున్నాడనీ గుసగుసలు బయలుదేరాయి. ఈ విషయం ఆనాటో ఈనోటా చివరికి భూమిక చెవికి చేరిందట. దాంతో భూమిక తోకతొక్కిన తాచుపాములో బుసలుకొడుతోందట. అవన్నీ వట్టి అబద్ధాలే అని భర్త భరత్ చెపుతున్నప్పటికీ వినే దశలో ఆమె లేదట. పైగా ఇటీవల తనకు పరిచయం లేని సినీ నిర్మాణ రంగంలోకి దింపి తకిట తకిట సినిమా తీసి సుమారు 15 కోట్ల రూపాయల దాకా భారీ నష్టం రావడానికి మూలకారకుడు భరతేనని ఆమె కుటుంబ సభ్యులు నమ్ముతున్నారట. దీంతో అతడికి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment