Monday, February 7, 2011

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే


శ్రీరామదాసు"లో నటించిన స్నేహకు మళ్ళీ అటువంటి పాత్రలు లభించలేదు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తను ఎలాంటి రూల్స్‌ పెట్టుకున్నదో అలాంటివే ఇప్పటికీ కంటెన్యూ చేస్తున్నట్లు చెప్పింది. మంచి పాత్ర లభిస్తే ఎటువంటి సినిమాలైనా చేస్తానని మరీ చెబుతుంది. ఆ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనని కొన్ని చిత్రాల్లో చేసినా ఫలించలేదు. అందుకే ఆమెకు ఓ విషయం అర్థమయిందట. ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర వహిస్తుందన్నదే తను నమ్మిన సిద్ధాంతం అంటోంది. ప్రతిభ ఉన్నా అది కలిసిరాకపోతే ఓడిపోతామని తెలుసుకున్నానని అంటోంది పూర్ స్నేహ. తాజాగా తమిళ, తెలుగులో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో పోలీసు అధికారిణిగా చేస్తుంది. పాపం చిత్రం విడుదల మాత్రం రోజులను నెట్టుకుంటూ వెళుతూ బాగా ఆలస్యం అవుతోంది. 

No comments:

Post a Comment