Monday, February 21, 2011

అది కేవలం మార్ఫింగ్

అది కేవలం మార్ఫింగ్


ఎంతమందితో ఎఫైర్లు అంటగడతారు. మొన్నటిదాకా సల్మాన్‌తో నాకు ఎఫైర్ నడుస్తున్నట్లు రాశారు. ఇప్పుడేమో రణ బీర్‌తో కలిపి రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’’ అని మీడియాపై చిరుబురులాడారు అందాల తార కత్రినాకైఫ్. నిప్పు లేకుండా పొగరాదు కదా...? అనంటే... ‘‘నిప్పులేకపోయినా పొగ సృష్టించడం మీడియాకు పెద్ద విషయం కాదు. అందుకు నాపై వస్తున్న గాసిప్సే నిదర్శనం. నిజంగా నేనంటూ ఎవరినైనా ఇష్టపడితే నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పే ధైర్యం నాకుంది. అనవసరంగా ఇలాంటివి రాసి మనసుల్ని గాయపరచొద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కత్రినా. రణబీర్‌ని ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు కొన్ని ఈ మధ్య నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటి గురించి ఆమెను ప్రశ్నించగా, ‘‘అది కేవలం మార్ఫింగ్. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి. ఇలాంటి వాటికి కాదు. అందులో ఉన్న వ్యక్తి నిజంగా నేను కాను. అసలు ఇలాంటివాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయను’’ అని చెప్పారు కత్రినా.

No comments:

Post a Comment