అతనితో పెళ్లి జరిగేనా?
ప్రేమ గురించి ఏకధాటిగా ఉపన్యాసాలిచ్చే స్థాయిలో అమీషా పటేల్‌కు అనుభవం ఉంది. విక్రమ్ భట్‌తో దాదాపు ఐదేళ్లు, కనావ్ పురితో మూడు, నాలుగేళ్లు ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ ఆ ప్రేమలను పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయారు. కనావ్ నుంచి విడిపోయిన తర్వాత అమీషా దాదాపు ఒంటరి అయ్యారు. పార్టీలకు సోలోగా ప్రత్యక్షమై.. అందరితో కబుర్లాడి వెనుదిరిగేవారు. అయితే ఇప్పుడు అమీషా స్టయిల్ మారింది. తోడు లేకుండా ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదని సమాచారం. పార్టీల్లో, సినిమా థియేటర్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఓ యువకుడితో కనిపిస్తున్నారట అమీషా. ఆ కుర్రాడు ఎవరో తెలుసుకోవాలని ఔత్సాహికులు ఆరాటపడిపోయి.. ఆరా తీసి, సదురు కుర్రాడి పేరు కునాల్ అని, పెద్ద వ్యాపారవేత్త అని తెలుసుకున్నారు. అమీషా మాజీ ప్రియుడు కనావ్‌కీ, కునాల్‌కీ పోలికలు కలుస్తాయట. బహుశా మాజీ ప్రియుడ్ని మర్చిపోలేక అతని పోలికలతో ఉన్న కునాల్‌తో అమీషా నేస్తం కట్టి ఉంటారని భావించేవారు కూడా ఉన్నారు. ఈ జంట కొత్త సంవత్సరాన్ని దుబాయ్‌లో జరుపుకున్నారట. అలాగే ఇమ్రాన్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఇద్దరూ హాజరయ్యారట. అమీషా కోసం కునాల్ సినిమా కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గమనించదగ్గ విషయం ఏంటంటే... కునాల్ వివాహితుడు. సో.. అమీషా సాగిస్తున్న ఈ మూడో ప్రేమ కూడా పెళ్లి పీటల వరకు వెళ్లదని ఊహించవచ్చు. ఒకవేళ వెళ్లినా.. పలు వివాదాలు, విమర్శలు ఎదుర్కోవడం ఖాయం అని కూడా చెప్పొచ్చు.
No comments:
Post a Comment