Tuesday, February 15, 2011

కరీనా.. పెళ్లి గురించి మాట్లాడుతావెందుకు: సైఫ్

కరీనా.. పెళ్లి గురించి మాట్లాడుతావెందుకు: సైఫ్ 


పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన బాలీవుడ్ ముదురు ప్రేమజంట సైఫ్ అలీఖాన్- కరీనాకపూర్. ఈ వేలంటైన్ డే నాడు పెళ్లి చేసుకుంటామని ఆమధ్య కరీనా బాలీవుడ్ అంతటా గప్పాలు కొట్టింది. మూడు రోజుల క్రితం కూడా సైఫ్ - తను "పీపీ... డుండుం" అని తన సన్నిహితుల వద్ద చెప్పిందట. అయితే ప్రేమికుల రోజు వచ్చేసరికి చాలామంది సైఫ్‌కు ఫోన్ చేసి పెళ్లెక్కడ చేస్కుంటున్నారు...? అని ఫోన్లు మీద ఫోన్లు చేయడం మొదలెట్టారట. దీంతో చిర్రెత్తిన సైఫ్, తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ఎవరు చెప్పారు అని నిలదీశాడట. దానికి కరీనాయే తమకలా చెప్పిందని అన్నారట. అంతే... సైఫ్ తోక తొక్కిన పాములా చివ్వును లేచి సెల్ అందుకుని... కరీనా.. నీకెన్నిసార్లు చెప్పాలి. మన పెళ్లి గురించి పబ్లిక్‌లో మాట్లాడొద్దని అని అన్నాడట. మరి అవతల వైపు కరీనా ఏమన్నదో ఏమోగానీ... కొద్ది క్షణాలకే "అదికాదు నా బుజ్జి బిబో..." అంటూ కుక్కపిల్ల మాదిరిగా కుంచించుకుపోయాడట. 

No comments:

Post a Comment