షారుక్ మాటలకు ‘షాక్’ తిన్న ప్రియాంక
పాంచాలికి ఐదుగురు భర్తలైతే.. ఆమెకన్నా ప్రియాంక చోప్రా ఓ రెండు మెట్లు పైనే ఉన్నారు. ఈ హాట్ గాళ్‌కి ఏకంగా ఏడుగురు భర్తలున్నారు. ఇది ‘రీల్’ లైఫ్‌లో అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం ఆమె ‘7 ఖూన్ మాఫ్’ అనే చిత్రంలో నటించారు. ఈ నెల 18న చిత్రం విడుదల కానుంది. ఇందులో ప్రియాంక మంచి వయసులో ఉన్న అమ్మాయిగా, మధ్యవయస్కురాలిగా, వృద్ధురాలిగా.. ఇలా పలు గెటప్స్‌లో కనిపిస్తారు. సినిమాలో ఏడుగురు భర్తలను చంపి పారేస్తారట. భవిష్యత్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ చిత్రంలో తను చేసిన పాత్ర చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందని భావిస్తున్నారామె. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటున్నారు. అందులో భాగంగా షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘జోర్ కా ఝఠ్కా’లో పాల్గొన్నారు ఈ బ్యూటీ. ఈ కార్యక్రమంలో ప్రియాంక, షారుక్ ఒకరినొకరు పొగుడుకున్నారు. ఆ ఆనందంలో ‘మేమిద్దరం కలిసి చాలా రాత్రులు గడిపాం’ అనేశారు షారుక్. దాంతో ప్రియాంక పెదవులపై చిరునవ్వు మాయమయ్యింది. షారుక్ మాటలకు ‘షాక్’ తిని పిచ్చి చూపులు చూస్తూ ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశారామె. దాంతో తను మాట్లాడిన మాటేంటో కింగ్ ఖాన్‌కి అర్థమైంది. వెంటనే సర్దుకుంటూ... ‘ఐమీన్.. ఈ చిత్రదర్శకుడు విశాల్ భరద్వాజ్ ప్రమోషన్ కోసం బెర్లిన్‌లో ఉన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు మేం రాత్రిపూట తీరికగా సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. ఆ విషయాన్నే చెప్పా’ అనడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీన్‌ని వీక్షించిన వాళ్ళంతా ఆమె తాజా ప్రియుడు షాహిద్ కపూర్ కూడా ఊపిరి పీల్చుకుని వుంటాడులే అని జోకేసుకుంటున్నారు.
No comments:
Post a Comment