Friday, February 25, 2011

లారెన్స్‌కు నా పక్కన నటించేంత సీను లేదు: అనుష్క

లారెన్స్‌కు నా పక్కన నటించేంత సీను లేదు: అనుష్క 


సెక్సీ కళ్లను చిలకరిస్తూ సెక్సీగా పెదవులను సాగదీసి నవ్వులు చిందించే అత్యంత అందగత్తె అనుష్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ భామ తొలుత "సూపర్" చిత్రంలో కాస్త ఫేడవుట్ అయినా ఆ తర్వాత వరుస హిట్లతో తన రేంజ్‌ను హిమాలయాలంత ఎత్తుకు పెంచేసుకుంది. ఇప్పుడీ భామ కాల్షీట్లకోసం తమిళ, తెలుగు చిత్ర దర్శకనిర్మాతలు క్యూకడుతున్నారు. తాజాగా డ్యాన్సర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ రాఘవ స్వీయదర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. తన సరసన అనుష్కను నటింపజేసేందుకు ఆమెను సంప్రదిస్తే అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేసి లారెన్స్‌కు చుక్కలు చూపించిందట. అంత మొత్తాన్ని ఇచ్చేందుకు లారెన్స్ ముందుకొచ్చినా మరో కండిషన్ పెట్టిందట. తెలుగులో లారెన్స్ పక్కన నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదుకానీ, తమిళంలో మాత్రం అతడు తనపక్కన సరిపోడనీ, వేరే హీరోను చూసుకోవాలంటూ నిబంధన విధించిందట. దీంతో లారెన్స్ ముఖం మాడిపోయిందట. అందగత్తెలు ఏం చెప్పినా... ఎటువంటి కండిషన్లు పెట్టినా అంగీకరించాల్సిందే.. మరి లారెన్స్ ఏం చేస్తాడో...? 

1 comment: