Monday, February 21, 2011

యూఅండ్‌టీ డైరక్టర్ నుంచి తప్పించుకున్న కలర్స్ స్వాతి!

యూఅండ్‌టీ డైరక్టర్ నుంచి తప్పించుకున్న కలర్స్ స్వాతి! 


యూజ్ అండ్ త్రో డైరక్టర్ సెల్వ రాఘవన్ నుంచి అప్పల్రాజు హీరోయిన్ కలర్స్ స్వాతి తప్పించుకుంది. హీరోయిన్ల వద్ద యూజ్ అండ్ త్రో పాలసీని పాటించే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఆఫర్లను ఈ మధ్య కథానాయికలు వద్దు బాబోయ్ అంటున్నారట. ఇదే తరహాలో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించిన స్వాతికి కూడా సెల్వరాఘవన్‌కి మధ్య ఏదో జరుగుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ సెల్వరాఘవన్‌కు గీతాంజలితో నిశ్చితార్థం అయిపోవడంతో స్వాతి ఆ దర్శకుని ప్రేమాట నుంచి తప్పించుకుందని సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నారట. కాగా, "7జీ బృందావనం కాలనీ" చిత్రంలో నటించిన సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లాడిన సెల్వరాఘవన్ మూడేళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజ్ అండ్ త్రో పాలసీని పాటిస్తున్న సెల్వరాఘవన్‌ను మైండ్‌ను గీతాంజలి అయినా మార్చుతుందో లేదో వేచి చూడాల్సిందే..!! 

No comments:

Post a Comment