ఇప్పుడిప్పుడే అవన్నీ మెల్లగా అలవాటవుతున్నాయ్
Thursday, November 24, 2011
ఇప్పుడిప్పుడే అవన్నీ మెల్లగా అలవాటవుతున్నాయ్
Wednesday, November 23, 2011
పెళ్లయినా సినిమాలను వదలను
పెళ్లయినా సినిమాలను వదలను
చారిత్రాత్మక దినం 11.11.11న తన చిన్ననాటి స్నేహితుడు ప్రజీత్‌తో
నిశ్చితార్థం చేసుకున్న నటి మమతామోహన్‌దాస్. ఎంతోమంది ప్రేమించినా తాను
మాత్రం తన స్నేహితుడ్నే ప్రేమించానని చెప్పింది. ఆమె పెండ్లికి సన్నాహాలు
జరుగుతున్నాయి. పెండ్లి తర్వాత కూడా నటిస్తారా? అని అడిగితే.. అందులో ఏ
మాత్రం అనుమానం లేదు. నా ప్రజీత్ నటించమని సలహా ఇచ్చాడు. ఇంక నాకేం
భయంలేదు. సినిమాలు మాత్రం వదలనని స్పష్టం చేసింది. ఇలా చాలామంది పెండ్లికాక
ముందు అన్నవారే.. ఆ తర్వాత మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయారు. వెయిట్ అండ్
సీ...
Tuesday, November 15, 2011
నమిత "ఫిట్"గా కనబడటానికి కారణమదేనట
నమిత "ఫిట్"గా కనబడటానికి కారణమదేనట
జెమినీ చిత్రంలో మెరుపుతీగలా కన్పించిన నమిత, ఆ తర్వాత భారీ అందాలను సొంతం చేసుకుంది. అలా భారీగా ఉండటమే తనకు అత్యంత ఇష్టమనీ చెపుతోంది. అంతా ఫిట్‌గా, సెక్సీగా కనబడేందుకు తనకు నప్పే దుస్తులను ఏరికోరి ఎంచుకుంటోందట నమిత.లేటెస్ట్ ఫ్యాషన్‌ను అనుకరించడం నమితకు అలవాటట. అయితే సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూనే ఫిగర్ ఎట్రాక్షన్ కోసం ప్రయత్నిస్తుందట. అందమైన క్యాజువల్స్ వేసుకుంటూనే తరచూ బాగా ఫిట్‌గా ఉండే దుస్తులను వేసుకునేందుకు ఇష్టపడుతుందట. అందుకే ఎక్కువగా తనను ఫిట్‌గా చూస్తుంటారని కిసుక్కున నవ్వుతోందట నమిత. ఇక మేకప్ గురించి అడిగినప్పుడు... కనీస మేకప్ వేసుకుంటానంటుంది. అయితే పడుకునే ముందు మాత్రం మేకప్‌ను పూర్తిగా తుడిపేసి పడుకుంటుందట. ఎందుకలా అని అడిగితే... రోజంతా మేకప్‌తో ఉంటే స్కిన్‌కు సంబంధించి ఛార్మ్‌నెస్ దెబ్బతింటుందని చెపుతోందట నమిత.
Monday, November 14, 2011
నా పారితోషికం నాకు తెలీదు..: కాజల్ అగర్వాల్
నా పారితోషికం నాకు తెలీదు..: కాజల్ అగర్వాల్
టాలీవుడ్ తారామణుల్లో బాగా పేరు, ప్రఖ్యాతులు పొందిన కాజల్‌అగర్వాల్ సినిమారంగంలో కృషి, పట్టుదలలే సక్సెస్‌కు కారణమంటుంది. ఇక్కడ ఎంత బాగా చేశామనే చూస్తారు. ఆతర్వాత ఏదైనా... డబ్బు అనేది దానంతట అదే వస్తుంది. నేను మాత్రం నెంబర్1, 2 అనే దాన్ని నమ్మను. ఆ నెంబర్‌గేమ్‌లో నేను లేను. మనకు ఇచ్చిన పనిని సరిగ్గా చేశామా లేదా అనేది మాత్రం నాకు తెలుసు. నేను ఎంత సంపాదిస్తాను. ఎంత పారితోషికాన్ని తీసుకుంటాను అనేది .. మాత్రం నా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ లెక్కలు నాకు తెలియవు అంటోంది. తాజాగా ఆమె బిజినెస్‌మేన్‌లో నటిస్తోంది. లేటెస్ట్‌గా రామ్‌చరణ్ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లో భారీపారితోషికం ఆమెకు కట్టబెట్టారని తెలిసింది.
Wednesday, November 9, 2011
నేవీ కుర్రాడితో నిషా కొఠారి లవ్ ఎఫైర్?
నేవీ కుర్రాడితో నిషా కొఠారి లవ్ ఎఫైర్?
నిషా కొఠారి పేరు చెబితే ఆమె తండ్రి కోపంతో ఊగిపోతున్నాడట. పళ్లు పటపట కొరుకుతున్నాడట. ఏంటి సంగతి అని అంటే కోపంతో కళ్లెర్రజేసి గుడ్లురిమి చూస్తున్నాడట. దీంతో విషయం ఏంటని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే అసలు సంగతి తెలిసింది.అదేంటయా.. అంటే, నిషా కొఠారి నేవీలో పనిచేసి ఓ కుర్రాడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. అంతేకాదు అతడితో డేటింగ్ చేస్తూ ఇంటికి పొద్దుపోయాక వస్తోందట. విషయం తెలుసుకున్న నిషా తండ్రి అతడితో స్నేహాన్ని మానుకోవాలని గట్టిగా చెప్పాడట. కానీ నిషా మాత్రం అతడ్ని వదల్లేనని చెప్పినట్లు భోగట్టా. సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించే నిషా తండ్రి, నిషా కొఠారి ప్రవర్తనతో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటి వేశాడట. ఇంటి ఆవరణలో ఉన్న ఆమె కారును సైతం బలవంతంగా తీసుకెళ్లి రోడ్డు ప్రక్కన పార్క్ చేసి వదిలేసి వచ్చాడట. నిషా మాత్రం ప్రేమ నిషాలోంచి బయటకు రానంటే రానంటోందట. ప్రేమంటే అంతేమరి.
Monday, November 7, 2011
ఆడియో ఫంక్షన్లో లైవ్‌గా అందాలను ఒలకపోసిన విద్యాబాలన్!
ఆడియో ఫంక్షన్లో లైవ్‌గా అందాలను ఒలకపోసిన విద్యాబాలన్!
"డర్టీ పిక్చర్" ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా హీరోయిన్ విద్యాబాలన్ తన అందచందాలను లైవ్‌గా చూపించేసింది. యావత్తు ప్రపంచం ఆసక్తి ఎదురుచూస్తున్న సెక్సీ ఫిల్మ్ "డర్టీ పిక్చర్" త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత గాథతో రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు ఆ చిత్ర కథానాయిక విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన అందచందాలను ఒలకపోస్తూ.. లైవ్‌గా డర్టీ పిక్చర్ పాటలకు నృత్యం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిల్క్ స్మిత తరహాలో విద్యాబాలన్ తన మేను అందాలను అలా లైవ్‌గా చూపిస్తుంటే.. ప్రేక్షకులు ఆమె వంపుసొంపులను చూసేందుకు ఎగబడ్డారు. తుషార్ కపూర్, ఎమ్రాన్ హష్మీ, శ్రేయ ఘోషల్, బప్పీ లాహీరీ ఈ షోలో డ్యాన్స్ చేసినా విద్యాబాలన్ సిల్క్ స్మిత టైప్‌లో హాట్ హాట్‌గా కనిపించి.. అందరినీ తనపై దృష్టి పడేలా చేసింది.
Saturday, November 5, 2011
షైనీ బుద్ధి మారలేదు.. నన్ను కూడా లైంగికంగా వేధించాడు: సయాలీ భగత్
షైనీ బుద్ధి మారలేదు.. నన్ను కూడా లైంగికంగా వేధించాడు: సయాలీ భగత్
Thursday, November 3, 2011
నా పర్సనల్ విషయాలు మీకెందుకు..?
నా పర్సనల్ విషయాలు మీకెందుకు..?
నా వ్యక్తిగత విషయాలు మీకెందుకూ అంటూ మీడియాను నిలదీస్తోందట అమలాపాల్. దర్శకుడు విజయ్‌తో తానేదో ప్రేమకలాపాలు సాగిస్తున్నట్లు గాలి వార్తలు రాయడంపై అమలా మండిపడింది. సినిమాల గురించి చేతులు నొప్పెట్టేట్టు రాసినా తాను పట్టించుకోననీ, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోందట. ఇకనైనా ఇటువంటి గాలి కబుర్లను సృష్టించడం మానుకోవాలని హితబోధ చేస్తోందట.ఇదిలావుంటే రాత్రికిరాత్రే టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు సంపాదించుకున్న అమలాపాల్ ప్రస్తుతం నాగచైతన్య సరసన బెజవాడ సినిమాలో నటించింది. ఇంకా ఈ ముద్దుగుమ్మ తమిళంలో వేట్టై, ముప్పొళుదుమ్ ఉన్ కర్పణైగళ్, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.
Wednesday, November 2, 2011
11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!
11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!
ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన దగ్గర్నుంచి రకరకాల వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వెలికి వచ్చింది. అదేమంటే ఆమె 11 - 11 - 11న పండంటి బిడ్డకు జన్మనిస్తుందన్న విషయం. ఇందుకోసం ముంబైలోని సెవెన్‌స్టార్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేసేశారట. వైద్యుల రిపోర్టు ప్రకారం ఐశ్వర్యారాయ్ ఈ నెల 10 నుంచి 15 మధ్య ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆమె నవంబరు 11నాడే ప్రసవిస్తుందని ఐష్ కుటుంబసభ్యులు అనుకుంటున్నారు.వందేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన రోజునాడు ఐశ్వర్యారాయ్ బిడ్డకు జన్మనివ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలావుంటే గత నెల 11వ తేదీనాడు అభిషేక్ బచ్చన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.
Tuesday, November 1, 2011
నా అందం చూసి చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు!!
నా అందం చూసి చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు!!
నా అందానికి చాలా మంది కుర్రాళ్లు డంగై పోయారని టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ చెపుతోంది. తాను కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించమని చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు. నేనూ చాలా స్ట్రిక్ట్. అందుకే ఎవరికీ ఓకే చెప్పలేదు. ఎందుకంటే అపుడు నాది ప్రేమించే వయస్సు కాదని అంటోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా, తాను ఇపుడే పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెపుతోంది. ముందుగా ఆ.. అనుభవం పూర్తయ్యాకే పెళ్లికి సిగ్నల్ చెప్తానని అంటుంది. ఇంతకీ ఆ అనుభవం అంటే.. ప్రేమ అనుభవమట. తనకు నచ్చిన వ్యక్తితో ప్రేమ పాఠాలు పూర్తయ్యాకే పెళ్లి పీటలు ఎక్కుతానంటోంది.
Subscribe to:
Posts (Atom)