Wednesday, November 9, 2011

నేవీ కుర్రాడితో నిషా కొఠారి లవ్ ఎఫైర్?

నేవీ కుర్రాడితో నిషా కొఠారి లవ్ ఎఫైర్?


నిషా కొఠారి పేరు చెబితే ఆమె తండ్రి కోపంతో ఊగిపోతున్నాడట. పళ్లు పటపట కొరుకుతున్నాడట. ఏంటి సంగతి అని అంటే కోపంతో కళ్లెర్రజేసి గుడ్లురిమి చూస్తున్నాడట. దీంతో విషయం ఏంటని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే అసలు సంగతి తెలిసింది.అదేంటయా.. అంటే, నిషా కొఠారి నేవీలో పనిచేసి ఓ కుర్రాడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. అంతేకాదు అతడితో డేటింగ్ చేస్తూ ఇంటికి పొద్దుపోయాక వస్తోందట. విషయం తెలుసుకున్న నిషా తండ్రి అతడితో స్నేహాన్ని మానుకోవాలని గట్టిగా చెప్పాడట. కానీ నిషా మాత్రం అతడ్ని వదల్లేనని చెప్పినట్లు భోగట్టా. సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించే నిషా తండ్రి, నిషా కొఠారి ప్రవర్తనతో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటి వేశాడట. ఇంటి ఆవరణలో ఉన్న ఆమె కారును సైతం బలవంతంగా తీసుకెళ్లి రోడ్డు ప్రక్కన పార్క్ చేసి వదిలేసి వచ్చాడట. నిషా మాత్రం ప్రేమ నిషాలోంచి బయటకు రానంటే రానంటోందట. ప్రేమంటే అంతేమరి.

1 comment:

  1. madras

    informative site. Very informative article. Keep up the good work.

    ReplyDelete