11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!
ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన దగ్గర్నుంచి రకరకాల వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వెలికి వచ్చింది. అదేమంటే ఆమె 11 - 11 - 11న పండంటి బిడ్డకు జన్మనిస్తుందన్న విషయం. ఇందుకోసం ముంబైలోని సెవెన్‌స్టార్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేసేశారట. వైద్యుల రిపోర్టు ప్రకారం ఐశ్వర్యారాయ్ ఈ నెల 10 నుంచి 15 మధ్య ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆమె నవంబరు 11నాడే ప్రసవిస్తుందని ఐష్ కుటుంబసభ్యులు అనుకుంటున్నారు.వందేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన రోజునాడు ఐశ్వర్యారాయ్ బిడ్డకు జన్మనివ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలావుంటే గత నెల 11వ తేదీనాడు అభిషేక్ బచ్చన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.
the total is 8[11-11-2011]so the baby may become a great saint r politician r a great-cheat...yar
ReplyDelete