నా అందం చూసి చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు!!
నా అందానికి చాలా మంది కుర్రాళ్లు డంగై పోయారని టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ చెపుతోంది. తాను కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించమని చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు. నేనూ చాలా స్ట్రిక్ట్. అందుకే ఎవరికీ ఓకే చెప్పలేదు. ఎందుకంటే అపుడు నాది ప్రేమించే వయస్సు కాదని అంటోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా, తాను ఇపుడే పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెపుతోంది. ముందుగా ఆ.. అనుభవం పూర్తయ్యాకే పెళ్లికి సిగ్నల్ చెప్తానని అంటుంది. ఇంతకీ ఆ అనుభవం అంటే.. ప్రేమ అనుభవమట. తనకు నచ్చిన వ్యక్తితో ప్రేమ పాఠాలు పూర్తయ్యాకే పెళ్లి పీటలు ఎక్కుతానంటోంది.
No comments:
Post a Comment