Saturday, November 5, 2011

షైనీ బుద్ధి మారలేదు.. నన్ను కూడా లైంగికంగా వేధించాడు: సయాలీ భగత్

షైనీ బుద్ధి మారలేదు.. నన్ను కూడా లైంగికంగా వేధించాడు: సయాలీ భగత్

పని మనిషిపై అత్యాచారం చేసి కొన్నాళ్లపాటు జైలు ఊచలు లెక్కపెట్టిన షైనీ అహుజా బుద్ధి మారలేదని బాలీవుడ్ హాట్ స్టార్ సయాలీ భగత్ వాపోయింది. అతడితో ఘోష్ట్ అనే సినిమాలో నటించే సమయంలో తనను ఎన్నోసార్లు లైంగికంగా వేధించాడని ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. అతడి లైంగిక వేధింపులకు తాళలేక పోలీసు కేసు పెట్టేందుకు తాను సిద్ధమైతే షైనీ భార్య తనను బతిమాలిందని చెప్పుకొచ్చింది. ఆమె ముఖం చూసి కేసు పెట్టకుండా వదిలానని అంటోంది. ఏదేమైనా తనను వేధించిన తీరును ఉగ్గబట్టుకోలేకపోతున్నాననీ, ఎప్పుడో ఒకప్పుడు అతడిపై కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటోంది. షైనీకి లైంగికంగా వేధించడం ఓ అలవాటుగా మారిపోయిందేమో..?!! 

No comments:

Post a Comment