Thursday, January 6, 2011

దటీజ్‌ పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌!

దటీజ్‌ పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌! 


అసలే ఇండస్ట్రీ బంద్‌లో ఉంది. ఎప్పుడు షూటింగ్‌లు జరుగుతాయో తెలియని పరిస్థితి. హీరోల రెమ్యునరేషన్‌ తగ్గించుకునేలా నిర్మాతలు వారికి ఎలా చెప్పాలని కిందామీద పడుతున్నారు. హీరోలకు ఎడాపెడా రెమ్యునరేషన్‌ పెంచేసింది నిర్మాతలే అనేది నగ్నసత్యం. ఇటువంటి స్థితిలో హీరోలు కూడా ఓ మెట్టు దిగి వచ్చే స్థితిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరికొంతమంది హీరోలు డిమాండ్‌ సప్లయి మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇటీవలే ఓ ఉదంతం జరిగింది. ఓ నిర్మాత పవన్‌కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి తాను 7కోట్లు ఇస్తానని డేట్స్‌ కావాలని అడిగాడట. దీంతో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ అయి... ఇంత బంద్‌ జరుగుతున్నా నా దగ్గరకువచ్చి మీరిలా అడగడం భావ్యంకాదని కాస్త సున్నితంగా మందలించారట. దీంతో మరొకరితో ఫోన్‌చేయించినా ఫలితం లేకపోయింది. 

Wednesday, January 5, 2011

నేను ఏంజెలీనా కాను

నేను ఏంజెలీనా కాను


లానా తరహా పాత్రలైతే చేస్తాను.. అనే షరతులు పెట్టడం నాకు ఇష్టం లేదు' అని చెబుతోంది సమంత. 'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ 'దూకుడు'గానే ఉంది. ఎన్టీఆర్‌తో 'బృందావనం'లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు మహేష్‌తో 'దూకుడు'లో నటిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ'తో పాటు.. గౌతమ్‌ మీనన్‌ 'ఎర్రగులాబీలు'లో కూడా మెరవబోతోది. సమంత మాట్లాడుతూ ''అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది. అలాగని మరీ ఏంజెలీనా జోలీ 'టాంబ్‌ రైడర్‌'లో పోషించిన పాత్ర అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అందులో యాక్షన్‌ సన్నివేశాలు మామూలుగా ఉండవు. వావ్‌ఁ అనిపిస్తాయి. నేనేమీ ఏంజెలీనా జోలీని కాను కదా. ప్రయత్న లోపం లేకుండా కష్టపడే మనస్తత్వం నాది. విభిన్నమైన పాత్రల్ని పోషించి మరింత పేరు సంపాదించాలి'' అని మనసులోని కోరికను బయటపెట్టింది.

టెక్కులు తెలియవు!

టెక్కులు తెలియవు!


నాయికలు తెరపైనే అందంగా కనిపిస్తారు. బయట అంత బాగుండరట. మేకప్‌ లేకుంటే వాళ్లూ మనలాగే ఉంటారు. సినిమా తారలు జనంలోకి వచ్చినప్పుడు టెక్కు చూపిస్తారట - మన కథానాయికల గురించి జనసామాన్యం ఇలాగే మాట్లాడుకొంటూ ఉంటారు. ''అందరి విషయంలోనూ ఆ మాటలు నిజం కాకపోవచ్చు. నా వరకూ నేను చాలా సాదాసీదాగా ఉంటాను'' అంటోంది జెనీలియా. ''కెమెరా ముందు ఉన్నంతసేపే నటిని అనే భావన ఎప్పుడూ నాలో ఉంటుంది. నేనేదో పెద్ద స్టార్‌నని టెక్కుగా ఉండటం, లేనీపోని అహంభావాన్ని ప్రదర్శించడం నాకు చేతకావు. చాలా చిత్రాల్లో నావి అల్లరిపిల్ల పాత్రలే. నిజ జీవితంలోనూ నేను అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ, సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ పద్ధతి నాకు క్రీడారంగం వల్లే అలవడింది. నేను చదువుకొనే రోజుల్లో పలు ఆటలపోటీలకు వెళ్లాను. అప్పుడు అందరం కలిసిమెలసి ఉండటం, సర్దుకుపోవడం జరిగేది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. ఎప్పటికీ పోదు'' అని చెప్పుకొచ్చింది. 

Tuesday, January 4, 2011

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే


నాకు ఇష్టమైన అంకె ‘ఒకటి’. ఏ రంగంలో ఉన్నా... నంబర్‌వన్‌గా ఉండటానికే ఇష్టపడతా. ఆ స్థానం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో నాకు ఎదురైన పరిస్థితులను తెలియజేయాలంటే... ఓ పుస్తకాన్ని రాయొచ్చు’’ అంటున్నారు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్. తన మనోగతాన్ని వ్యక్తపరుస్తూ ఇటీవల ఐష్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘మా స్కూల్ పేరు ‘ఆర్య విద్యాభవన్’. టెన్త్ క్లాస్ దాకా అక్కడే చదివాను. నైన్త్ క్లాస్ వరకూ మా స్కూల్లో నేనే ఫస్ట్. అందుకే టీచర్లందరూ నన్నెంతో ప్రేమగా చూసేవారు. అప్పట్నుంచే ‘నంబర్‌వన్’ అంటే నాకిష్టం. కానీ టెన్త్ క్లాస్‌లో మాత్రం నాకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే నేను... టెన్త్‌లో మాత్రం ఏడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో మానసికంగా కృంగిపోయాను. నా లైఫ్‌లో కన్నీరు పెట్టుకున్న తొలి సందర్భమది. తర్వాత ఇంటర్‌లో ‘రెండవ’ స్థానానికి పరిమితమయ్యా. అప్పుడు కూడా చాలా బాధ కలిగింది. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. అందరూ కిరీటం తప్పకుండా నాదే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సుస్మితాసేన్ మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఇలా వరుసగా తగిలిన దెబ్బలు నాలో కసిని పెంచాయి. అలాగే నంబర్‌వన్ అనే స్థానంపై ఇష్టాన్ని కూడా పెంచాయి. అదే కసితో మిస్‌వరల్డ్‌లో పోటీల్లో పాల్గొన్నాను. అందరినీ అధిగమించి, నంబర్‌వన్‌గా నిలబడగలిగాను. ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అని ఎవరయినా అంటే... నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య.

గోవాలో నిశ్చితార్థం!

గోవాలో నిశ్చితార్థం!


పస్తుతం బాలీవుడ్ వార్తల్లో నిలుస్తున్న జంటల్లో షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంట ఒకటి. ఈ ప్రేమికులు కొత్త సంవత్సరాన్ని గోవాలో జరుపుకున్నారట. నూతన సంవత్సరం తొలి రోజుని ఎప్పటికీ గుర్తుంచుకునేలా గడపాలనుకున్న ఈ జంట ‘ఉంగరాలు’ మార్చుకున్నారని వినికిడి. ఈ ఉంగరాల మార్పిడి వ్యవహారాన్ని ఈ జంట రహస్యంగా ఉంచాలనుకున్నారు. కానీ గోవా తీరం దాటి ముంబయ్‌కి చేరిపోయింది. ఇంకేముంది? ఇది కచ్చితంగా వివాహ నిశ్చితార్థమే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షాహిద్, ప్రియాంకలు ఖండించడంలేదు. దాంతో మౌనం అర్ధాంగీకారం అని చెప్పుకుంటున్నారు. 

Monday, January 3, 2011

మగాళ్లు నా ఎద సౌందర్యం గురించే మాట్లాడుతారు

మగాళ్లు నా ఎద సౌందర్యం గురించే మాట్లాడుతారు


బాలీవుడ్ సెక్సీ సైరన్ మల్లికా శరావత్ బోల్డ్‌గా మాట్లాడటం మామూలే. తాజాగా మరో వ్యాఖ్య చేసి వార్తలకెక్కింది. మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సందర్భాల్లో గమనించానని చెపుతోంది. వారలా మాట్లాడుకోవడంపై తను ఏమీ అనుకోననీ, అందంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని ఆ మగాళ్లను వెనకేసుకొస్తోంది. హిస్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లాపడటంతో విచారంగా ఉన్న సెక్సిణి మల్లికను తాజాగా మరో బిగ్ ఆఫర్ వరించిందిట. ఆ చిత్రంలో అందాలను బాగా ప్రదర్శించగలిగే పాత్ర దొరికిందట. అందువల్లనో ఏమో గానీ ఇప్పటి నుంచే మగాళ్లు - తన ఎద సౌందర్యపు అందాలు... అంశంపై బాకా ఊదటం మొదలెట్టింది.

పంచుకొంటే తప్పేంటి?

పంచుకొంటే తప్పేంటి?


థానాయికలకి ప్రాంతీయ భాషల్లో ఎన్ని అవకాశాలొచ్చినా... చూపు ఎప్పుడూ బాలీవుడ్‌ వైపే ఉంటుంది. ఇక్కడ స్టార్‌గా వెలిగిపోతున్నా... అక్కడ ద్వితీయ నాయిక అన్నా ఆనందపడతారు. ఇప్పుడు ఇలియానా కూడా హిందీ కలలే కంటోంది. 'బర్ఫీ' సినిమాలో రణబీర్‌ కపూర్‌తో ఆడిపాడబోతోంది. అయితే అక్కడ దక్కింది రెండో నాయిక పాత్రే. 'అయితే ఏంటి? రెండో నాయిక అయినా... నాదీ మంచి పాత్రే. ప్రియాంకా చోప్రాతో కలసి నటించే అవకాశం రావడం అంటే మాటలా..?' అంటూ సంతోషంగా చెబుతోంది. 'ఇద్దరు నాయికల సినిమాలు బాలీవుడ్‌లో సాధారణమే. అయినా నాయిక స్థానాన్ని మరొకరితో పంచుకోవడం నామోషీగా భావించను. ఈ సినిమాలో రెండు పాత్రలూ ప్రత్యేకమైనవే. ప్రియాంక అనుభవం నాక్కూడా పనికొస్తుంది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకు ఈ సినిమా ఓ అవకాశంలా భావిస్తాను' అని సర్దిచెప్పుకొంటోంది.