Monday, January 31, 2011

ఆ వదంతులు బాధ పెట్టాయి

ఆ వదంతులు బాధ పెట్టాయి


అందాల సుందరి ఐశ్వర్య రాయ్‌పై ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య సింగపూర్‌లో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ఐష్ ప్రవర్తనకు నిర్వాహకులు అవాక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలో ఐశ్వర్య నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికోసం రిహార్సల్స్ జరిగినప్పుడు ఆమె చెప్పిన సమయానికి రాకుండా తనకు నచ్చిన టైమ్‌కు వచ్చేవారట. ఇది ఇతర తారలను ఇబ్బందులకు గురి చేసిందని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారం అవుతోంది. అందాల సుందరి.. క్రేజీ హీరోయిన్.. బచ్చన్ ఇంటి కోడలు..కావడంవల్లే ఐష్ ఇలా ప్రవర్తిస్తున్నారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఐశ్వర్య వరకు వెళ్లాయట. మౌనం వహిస్తే.. ఈ మాటలు నిజమవుతాయని భావించిన ఆమె మాట్లాడుతూ - ‘‘యాక్చువల్‌గా నేను వైరల్ ఫీవర్‌తో అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొనలేని స్థితిలో ఉన్నప్పటికీ నిర్వాహకులను నిరుత్సాహపరచడం ఇష్టంలేక సింగపూర్ వెళ్లాను. ఈ అవార్డ్ ఫంక్షన్ జరిగే వారం రోజుల ముందు నుంచే నాకు ఆరోగ్యం బాగాలేదు. ఈ కారణంగా రిహార్సల్స్‌కు సరిగ్గా వెళ్లలేకపోయేదాన్ని. నాకు ఉపశమనంగా అనిపించిన సమయంలో వెళ్లేదాన్ని. ఆ సమయానికి ఇతర తారల ప్రాక్టీస్ ముగిసేది. దాంతో ఎవరూ ఇబ్బందిపడలేదు. కానీ ఈ విషయాన్ని చిలవలు పలవలు చేశారు. అసలు విషయం తెలియక చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను డాన్స్ ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వెళ్లిన రోజున అసిస్టెంట్ డాన్సర్లను వెళ్లమనేదాన్ని. కొరియోగ్రాఫర్ నుంచి స్టెప్స్ అడిగి తెలుసుకుని మరీ చేసేదాన్ని. చివరికి అవార్డ్ ఫంక్షన్ రోజున నిర్వాహకులు రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేయమని కోరితే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చేశాను. అయినా నా గురించి లేనిపోని వదంతులు సృష్టించడం బాధగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యరాయ్. ఇదిలా ఉంటే అవార్డ్ ఫంక్షన్ నిర్వాహకులు కూడా ఐష్ తమని ఇబ్బందులపాలు చేయలేదని, ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె సహకరించారని, ఆమె పక్కా ప్రొఫెషనల్ అని కితాబులిచ్చేస్తున్నారు. ఐష్ అంటే పడనివాళ్లే ఇలా కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని ఆమె శ్రేయోభిలాషులు అంటున్నారు.

బికినీలో బాగున్నాను

బికినీలో బాగున్నాను


చిత్ర పరిశ్రమలో నాయికగా నిలబడిన వాళ్లందరినీ ఓసారి గమనించండి. వాళ్లంతా అందం, అభినయం రెండిటినీ నమ్ముకొన్నవాళ్లే. ఆ రెంటినీ సమన్వయం చేసుకొంటే ఇక తిరుగులేనట్టే. ప్రియమణి కూడా ఇదే సూత్రం అనుసరిస్తోందట. 'ఇక్కడ మన స్థానాన్ని నిర్ణయించేవి మనకొచ్చే పాత్రలే. ఏ సినిమా ఫలితాన్ని ముందే అంచనా వేయలేం. అలాగే ఏ పాత్రకు మంచి పేరొస్తుందో ముందే వూహించి చెప్పడం కష్టమే. 'పెళ్త్లెన కొత్తలో' సినిమాతో గాడిలో పడతాను అని నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు అనుకోలేదు' అని చెబుతోంది ప్రియమణి. 'నువ్వు చీర కడితే బాగుంటావ్‌... అని కొంతమంది చెప్పారు. ఆధునిక వస్త్రాలు కూడా నీకు నప్పుతాయ్‌ అని మరికొంతమంది చెప్పారు. థియేటర్‌కి వచ్చేవాళ్లలో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఉంటారు. వస్త్రధారణ విషయంలో వాళ్లందరి అభిరుచినీ దృష్టిలో పెట్టుకోవల్సిందే' అని కొత్త సూత్రం చెప్పింది. 'ద్రోణ' సినిమా కోసం బికినీ వేసినందుకు తనని తాను సమర్థించుకొంది. 'స్విమ్మింగ్‌ పూల్‌లో పాట తీస్తాం అన్నారు. అక్కడ జీన్స్‌, సల్వార్‌ వేసుకొంటే కుదర్దు కదా. అందుకే బికినీ వేయాల్సివచ్చింది. ఆ పాట కూడా బాగా చిత్రీకరించారు. నాకైతే నచ్చింది' అంది. 

Saturday, January 29, 2011

2 నిమిషాలపాటు లిప్ టు లిప్ కిస్సా...

2 నిమిషాలపాటు లిప్ టు లిప్ కిస్సా...
 
 
బాలీవుడ్‌లో కత్తిలాంటి ఆకృతితో సెక్సీ నాభీ నృత్యాలను చేయడంలో ఆరితేరిపోయిన కత్రినాకైఫ్ ఇపుడు మరో హాటెస్ట్ ఫీట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందట. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జిందగి న మిలేగి దుబారా" చిత్రంలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు కత్రినా హీరో హృతిక్ రోషన్ పెదవులను రెండు నిమిషాల పాటు వదలకుండా చుంబించాలట. ఈ విషయాన్ని దర్శకుడు కత్రినాతో చెప్పేసరికి.. "హృతిక్‌తోనే కదా.. ఐతే ఓకే" అనేసిందట. హృతిక్ రోషన్ మాత్రం తేనెలొలికే ఆ రెండు పెదవులను చుంబించడానికి అడ్డు చెపుతాడా ఏంటి...? కత్రినా ఓకే అయితే నేను డబుల్ ఓకే అనేశాడట. అన్నట్లు ఈ సీన్ కోసం కత్రినా తన రెండు పెదవులు మరింత సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటోందట. ముద్దంటే మాటలా మరి... హీటెక్కించొద్దూ. 

అలా ఇమిటేట్ చేస్తే చంపేస్తా

అలా ఇమిటేట్ చేస్తే చంపేస్తా


నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా...’’ అంటున్నారు త్రిష. ఇంత ఘాటుగా త్రిష వార్నింగ్ ఇచ్చింది ఎవరికోకాదు. జెస్సీగా కురక్రారు హృదయాల్లో అనతికాలంలోనే స్థానం సంపాదించిన అందాల సమంతకు. ఇది సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ కాదులెండి! అభిమానం, వాత్సల్యం కలగలుపు చేసుకొని ముద్దు ముద్దు మాటలతో ఇచ్చిన మందలింపు మాత్రమే. త్రిష, సమంత మధ్య తొలినుంచి మంచి అనుబంధం ఉంది. హీరోయిన్ కాకముందు నుంచి సమంత... త్రిష అభిమాని. అనుకోకుండా తమిళ్‌లో త్రిష చేసిన ‘జెస్సీ’ పాత్రతోనే సమంత తెలుగులో స్టార్‌డమ్ సాధించారు. సమంత తన అభిమాని అని తెలిసినప్పట్నుంచీ త్రిష కూడా సమంత విషయంలో ఇష్టం కనబరుస్తూ వచ్చారు. ఇటీవల సమంత గురించి త్రిష మాట్లాడుతూ- ‘‘తను మంచి నటి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె నటన చూస్తుంటే...నన్ను నేనే చూసుకుంటున్నట్టుంటుంది. ముఖ్యంగా తన న డక. నా వాకింగ్ స్టైల్‌ని బాగా ఇమిటేట్ చేస్తుంది తను. ‘నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా’ అని ఓ సారి నవ్వుతూ చెప్పాను. ఏదిఏమైనా... కొత్తగా వచ్చిన హీరోయిన్‌లలో సమంత అంటే నాకు ఇష్టం. తాను నా అభిమాని అన్న విషయం పక్కన పెడితే... ‘ఏ మాయ చేసావె’ చూశాక నేను ఆమె అభిమానిని అయిపోయాను’’ అంటూ సమంతను పొగడ్తలతో ముంచెత్తారు త్రిష.

Friday, January 28, 2011

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది


తెలుగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా, ఇటీవల అక్కినేని నాగార్జునతో ‘రగడ’ చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ‘అష్టలక్ష్మీ’ పాత్ర తనకెంతో పేరు తెచ్చిపెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘ నాగ్‌తో ఫుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ‘రగడ’ తో తీరింది. ఆయనతో నటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ‘రగడ’ చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ‘రాజ్’ చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలతో నటించాను. ఇక బ్యాలెన్స్‌గా వున్న నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది’’ అంటూ ముసి ముసిగా నవ్వుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరు ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు, అప్పుడు మీ మధ్య కాంపిటీషన్ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ‘‘ ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది. ఇక వృత్తి ధర్మ ప్రకారం పోటీ అనేది కామనే. అయితే ఈ కాంపిటిషన్ అనేది హెల్తీ వేలో వుంటుంది’’ అని చెప్పారు ప్రియమణి.
 

హద్దుల్లోనే ఉంటాను

హద్దుల్లోనే ఉంటాను


వారసత్వం ఓ గుర్తింపు మాత్రమే. నాన్న పేరునో, అమ్మ పేరునో తగిలించుకొని బండి లాగించేద్దాం అంటే కుదర్దు... జీవితం చివరి మజిలీలో 'నువ్వేంటి?' అని ప్రశ్నించుకొంటే సంతృప్తికరమైన జవాబు దొరకాలి. అది దొరక్కపోతే నువ్వేమీ సాధించలేనట్టే లెక్క... అంటోంది శ్రుతిహాసన్‌. 'అనగనగా ఓ ధీరుడు'లో ప్రియగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందం, అభినయం రెండూ కలబోసి మెప్పించింది. 'కమల్‌ కుమార్తెగా గర్వపడతారా?' అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. ''మా నాన్న గొప్ప నటుడు. ఆయనకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే చిన్నపాటి భయం కూడా ఉంది.. ఆయన పేరుకు మచ్చ తీసుకురాకూడదని! అందుకే చిన్న చిన్న హద్దులు నిర్ణయించుకొన్నాను. సినిమా సూత్రాలకు లోబడి గ్లామర్‌ కురిపించాలన్నా... వాటిని ఓసారి గుర్తుచేసుకొంటాను'' అంది. ''ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. 'దిల్‌ తో బచ్చా హై జీ'లో పాత్ర నాకు అన్నివిధాల సరిపడింది.. సంతృప్తినిచ్చింది. నా పుట్టిన రోజునే ఆ చిత్రం విడుదలవుతోంది. తమిళంలో మురుగన్‌దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అభిమానం అంటే ఏమిటో ఇక్కడివారిని చూసి నేర్చుకోవాలి. డాడీ సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే... పచ్చజెండా వూపేస్తాను'' అంది. శుక్రవారం శ్రుతి హాసన్‌ జన్మదినం.

Thursday, January 27, 2011

ఆ పద్ధతి మంచిది కాదు

ఆ పద్ధతి మంచిది కాదు


మరో అయిదారేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా’’ అంటున్నారు బొద్దు గుమ్మ నమిత. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే సమయం తనకు లేదని ఇటీవల ఓ సందర్భంలో అన్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘కెరీర్ పరంగా చాలా సంతృప్తికరంగా ఉన్నాను. కానీ అందరిలాగా స్లిమ్ అవ్వలేకపోతున్నాననే బాధ మాత్రం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది’’ అన్నారామె. మీరు కూడా సర్జరీని ఆశ్రయించవచ్చుకదా...? అనడిగితే- ‘‘అలాంటి పద్దతిలో తగ్గడం అంటే నాకు ఇష్టం ఉండదు. సహజసిద్ధంగా తగ్గితేనే ఆరోగ్యానికి మంచిది. సర్జరీల ద్వారా ఒళ్లు తగ్గించుకుంటే... భవిష్యత్తులో శారీరకంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది’’ అన్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కథానాయికగా కెరీర్ మొదలై అప్పుడే తొమ్మిదేళ్లు అవుతోంది. పన్నెండేళ్ల క్రితం మిస్ సూరత్‌గా ఎంపికయ్యాను. పదేళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ దాకా వచ్చాను. అవన్నీ నా జీవితంలో స్వీట్ మెమరీస్. ఇప్పటికీ కలర్‌ఫుల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానంటే.. అందంతా గాడ్ గిఫ్ట్. మరో ఆరు నెలల్లో కొత్త నమితను చూస్తారు. కఠోరమైన శ్రమ చేసైనా సరే... నాటి అందమైన రూపాన్ని మళ్లీ దక్కించు కుంటాను’’ అని నమ్మకంగా చెబుతున్నారు నమిత.