డిసెంబరు ఒకటిన చెర్రీ-ఉపాసన నిశ్చితార్థం?
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ తేజ్ అలియాస్ చెర్రీ, ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ ఒకటో తేదీన జరుగనునట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని మెగాస్టార్, కాంగ్రెసు నేత చిరంజీవి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులకు స్వయంగా చెప్పారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తన నిశ్చితార్థానికి రావాలని గవర్నర్ దంపతులను చెర్రీ స్వయంగా ఆహ్వానించినట్టు సమాచారం. అందుకు గవర్నర్ దంపతులు ఆనందంగా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, వీరి నిశ్చితార్థం నిజామాబాద్ జిల్లా దోమకొండలోని పురాతన కోటలో జరుగనుంది. ఇందుకోసం ఈ కోటను సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ గడీలోనే నిశ్చితార్థం, వివాహం జరగాలని ఉపాసన కుటుంబ సభ్యులు భావించడంతో ఇందుకు చెర్రీ కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది.