Friday, February 25, 2011

టాప్‌లెస్ ఫోజ్‌లను బాయ్స్ బాత్‌రూమ్‌లో పెట్టుకుంటారు

టాప్‌లెస్ ఫోజ్‌లను బాయ్స్ బాత్‌రూమ్‌లో పెట్టుకుంటారు


నగ్నంగా ఫోజులిచ్చేందుకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని బాలీవుడ్ సెక్సీబాంబ్ కాష్మీరా షా. అందంగా ఉన్నాను కనుకనే ఆ సోయగాలను చూపెడుతున్నాననీ, అలా లేకపోతే చూపెట్టినా ఎవరూ చూడరని నిక్కచ్చిగా ముఖంమీదే చెప్పేస్తోంది షా. ఇంతకీ అసలు సంగతేంటంటే... ఆ మధ్య మందిరాబేడీ, బిపాసలు నడుము పైగాన్ని పూర్తి నగ్నంగా చూపిస్తూ క్యాలెండర్లకు ఎక్కారు. ఇపుడు అదే మాదిరిగా తను కూడా ఎద అందాలను అలవోకగా చూపిస్తూ టాప్‌లెస్ ఫోజులను ఇచ్చిందట కాష్మీరా. అదేమని అడిగినవాళ్లతో... ఎంతోమంది ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు. అయితే వాళ్లందరికంటే భిన్నమైన ఫోజులో నేను కనిపిస్తానని బడాయి కబుర్లు చెపుతోందట. అంతేకాదండోయ్... టాప్‌లెస్ ఫోజులతో కూడిన క్యాలెండర్‌లను అబ్బాయిలు తమతమ బాత్‌రూమ్‌‌లలో పెట్టుకోవడాన్ని గమనించినట్లు కూడా చెపుతోంది. ఇంతకీ ఈ విషయం "షా"కు ఎలా తెలిసిందో...? 

లారెన్స్‌కు నా పక్కన నటించేంత సీను లేదు: అనుష్క

లారెన్స్‌కు నా పక్కన నటించేంత సీను లేదు: అనుష్క 


సెక్సీ కళ్లను చిలకరిస్తూ సెక్సీగా పెదవులను సాగదీసి నవ్వులు చిందించే అత్యంత అందగత్తె అనుష్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ భామ తొలుత "సూపర్" చిత్రంలో కాస్త ఫేడవుట్ అయినా ఆ తర్వాత వరుస హిట్లతో తన రేంజ్‌ను హిమాలయాలంత ఎత్తుకు పెంచేసుకుంది. ఇప్పుడీ భామ కాల్షీట్లకోసం తమిళ, తెలుగు చిత్ర దర్శకనిర్మాతలు క్యూకడుతున్నారు. తాజాగా డ్యాన్సర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ రాఘవ స్వీయదర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. తన సరసన అనుష్కను నటింపజేసేందుకు ఆమెను సంప్రదిస్తే అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేసి లారెన్స్‌కు చుక్కలు చూపించిందట. అంత మొత్తాన్ని ఇచ్చేందుకు లారెన్స్ ముందుకొచ్చినా మరో కండిషన్ పెట్టిందట. తెలుగులో లారెన్స్ పక్కన నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదుకానీ, తమిళంలో మాత్రం అతడు తనపక్కన సరిపోడనీ, వేరే హీరోను చూసుకోవాలంటూ నిబంధన విధించిందట. దీంతో లారెన్స్ ముఖం మాడిపోయిందట. అందగత్తెలు ఏం చెప్పినా... ఎటువంటి కండిషన్లు పెట్టినా అంగీకరించాల్సిందే.. మరి లారెన్స్ ఏం చేస్తాడో...? 

Thursday, February 24, 2011

మరోసారి అలా జరిగితే చెంప ఛెళ్ళ్‌మంటుంది

మరోసారి అలా జరిగితే చెంప ఛెళ్ళ్‌మంటుంది


అభిమానులు, ఆర్క్‌లైట్ల కాంతులు... ఇదంతా మా జీవితంలో భాగం మాత్రమే. మాకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికి భంగం వాటిల్లజేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు’’ అంటున్నారు. పెళ్ళయిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి. ఇటీవల ముంబైలో ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌కి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైందట.
కొందరు ఆకతాయిలు శిల్ప పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె మనస్థాపానికి లోనయ్యారట. ఈ సందర్భంలోనే ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘గతంలో కూడా ఇలాంటివి కొన్ని ఎదురయ్యాయి. కానీ వాటిని లైట్‌గా తీసుకున్నాను. ఈ సారి మాత్రం అలా తీసుకోలేకపోతున్నాను. అక్కడ కొందరి ప్రవర్తన నాకు అసహ్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే... చెంప ఛెళ్ళ్ మనిపిస్తా’’ అని ఘాటుగా స్పందించారు శిల్ప. ఇంతకీ ఆ ఆకతాయిలు మిమ్మల్ని ఏమన్నారు? అని అడిగితే- ‘నో కామెంట్’ అంటూ నిష్ర్కమించారు శిల్ప.

అవసరాలకు వాడుకున్నారు

అవసరాలకు వాడుకున్నారు


ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటనతో వార్తల్లో ఉండే హీరోయిన్లలో లక్ష్మీరాయ్ ఒకరు. తాజాగా ఆమె తనను కొంతమంది అవసరాలకు వాడుకుని వదిలేశారని చెప్పడం చర్చనీయాంశంగా మారిం ది. తోటి నటులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారని ఆమె పై పుకార్లు షికార్లు చేస్తుంటాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనితో ప్రేమాయణం సాగిస్తున్నారని కొద్ది రోజులు జోరుగా ప్రచారం సాగింది. తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని ఆమె పలుమార్లు వివరణ ఇచ్చుకున్నారు. అది సమసిపోక ముందే మళ్లీ ఇప్పు డు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో తెలియక చిత్ర పరిశ్రమ తలలు పట్టుకుంటోంది. ఇది లావుండగా లక్ష్మీరాయ్ ఇప్పుడు స్టార్ క్రికెటర్ సచిన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సచిన్‌అంటే చాలా ఇష్టమంటున్నారు. ఆయన ప్రశాంత వదనం, చార్మిం గ్‌నెస్ బాగా నచ్చుతాయని అంటున్నారు. ఆయన బ్యాటింగ్ చేసే తీరు విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

Monday, February 21, 2011

యూఅండ్‌టీ డైరక్టర్ నుంచి తప్పించుకున్న కలర్స్ స్వాతి!

యూఅండ్‌టీ డైరక్టర్ నుంచి తప్పించుకున్న కలర్స్ స్వాతి! 


యూజ్ అండ్ త్రో డైరక్టర్ సెల్వ రాఘవన్ నుంచి అప్పల్రాజు హీరోయిన్ కలర్స్ స్వాతి తప్పించుకుంది. హీరోయిన్ల వద్ద యూజ్ అండ్ త్రో పాలసీని పాటించే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఆఫర్లను ఈ మధ్య కథానాయికలు వద్దు బాబోయ్ అంటున్నారట. ఇదే తరహాలో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించిన స్వాతికి కూడా సెల్వరాఘవన్‌కి మధ్య ఏదో జరుగుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ సెల్వరాఘవన్‌కు గీతాంజలితో నిశ్చితార్థం అయిపోవడంతో స్వాతి ఆ దర్శకుని ప్రేమాట నుంచి తప్పించుకుందని సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నారట. కాగా, "7జీ బృందావనం కాలనీ" చిత్రంలో నటించిన సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లాడిన సెల్వరాఘవన్ మూడేళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజ్ అండ్ త్రో పాలసీని పాటిస్తున్న సెల్వరాఘవన్‌ను మైండ్‌ను గీతాంజలి అయినా మార్చుతుందో లేదో వేచి చూడాల్సిందే..!! 

అది కేవలం మార్ఫింగ్

అది కేవలం మార్ఫింగ్


ఎంతమందితో ఎఫైర్లు అంటగడతారు. మొన్నటిదాకా సల్మాన్‌తో నాకు ఎఫైర్ నడుస్తున్నట్లు రాశారు. ఇప్పుడేమో రణ బీర్‌తో కలిపి రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’’ అని మీడియాపై చిరుబురులాడారు అందాల తార కత్రినాకైఫ్. నిప్పు లేకుండా పొగరాదు కదా...? అనంటే... ‘‘నిప్పులేకపోయినా పొగ సృష్టించడం మీడియాకు పెద్ద విషయం కాదు. అందుకు నాపై వస్తున్న గాసిప్సే నిదర్శనం. నిజంగా నేనంటూ ఎవరినైనా ఇష్టపడితే నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పే ధైర్యం నాకుంది. అనవసరంగా ఇలాంటివి రాసి మనసుల్ని గాయపరచొద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కత్రినా. రణబీర్‌ని ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు కొన్ని ఈ మధ్య నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటి గురించి ఆమెను ప్రశ్నించగా, ‘‘అది కేవలం మార్ఫింగ్. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి. ఇలాంటి వాటికి కాదు. అందులో ఉన్న వ్యక్తి నిజంగా నేను కాను. అసలు ఇలాంటివాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయను’’ అని చెప్పారు కత్రినా.

Sunday, February 20, 2011

నిశ్చితార్థం అయ్యింది

నిశ్చితార్థం అయ్యింది


దయచేసి నా ప్రేమను అంగీకరించు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోవా’’ అని మోకాళ్ల మీద కూర్చుని రీమ్మాసేన్‌ని అభ్యర్థించారు శివ్ కరణ్ సింగ్. ఇదేదో సినిమాలో సీన్ అనుకుంటున్నారేమో! అదేం కాదు. నిజంగానే రీమ్మా దగ్గర తన ప్రేమను పై విధంగా వ్యక్తపరిచారు శివ్. ఆయన ప్రతిపాదన వినగానే.. రీమ్మా ఓ చిరునవ్వు నవ్వి.. ఆనందంగా ఒప్పుకున్నారట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని శివ్ ముందే ఊహించారేమో.. వెంటనే రీమ్మా వేలికి ఉంగరం కూడా తొడిగేశారు. ఆ రకంగా నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్లి జరగడమే ఆలస్యం. రీమ్మాకి ఆప్తమిత్రుడైన రియాజ్ ద్వారా రెండేళ్ల క్రితం శివ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. కాకపోతే శివ్‌లో ప్రేమ చిగురించింది మాత్రం మూడు నెలల క్రితమే. ఈ విషయం గురించి శివ్ చెబుతూ - ‘‘రీమ్మాని మించిన మంచి జీవిత భాగస్వామి దొరకదనిపించడంతో ప్రపోజ్ చేశాను. నా ప్రేమను రీమ్మా స్వీకరిస్తుందా, లేదా? అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ రీమ్మా ఒప్పుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

Friday, February 18, 2011

ఆ ‘ముద్దు’ నిజం కాదు

ఆ ‘ముద్దు’ నిజం కాదు


సన్నివేశానికి అనుగుణంగా హాట్ హాట్‌గా కనిపించడానికి నేను రెడీ. అలా కాకుండా, ‘లిప్‌లాక్’ సీన్స్‌లో నటించమంటే మాత్రం నేను ఒప్పుకోను’’ అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ‘ఏక్‌నిరంజన్’ తార కంగనా రనౌత్. ఇటీవల ‘ముద్దు’ గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘అది మంచి పద్ధతికాదు. ఇలా పెదవులు కలిపి ముద్దాడడం వల్ల ఒకరి నోట్లో క్రిములు మరొకరి నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని మూలంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే లిప్ టు లిప్ ముద్దులకు నేను దూరం’’ అని చెప్పారు. అయితే ఇటీవలే ఆమె ‘తను వెడ్స్ మను’ చిత్రంలో మాధవన్‌తో దాదాపు రెండు నిమిషాల పాటు సాగే పెదవి ముద్దు సన్నివేశంలో నటించారట. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎలా స్పందించాలో తెలీక కాస్తంత ఇరకాటంలో పడ్డారు ఈ అందాల భామ. దాంతో ఆమె పెదవి విప్పుతూ- ‘‘అవును... ముద్దు సన్నివేశంలో చేశాను. అదేం నిజం ముద్దు కాదే. దాన్ని వివాదాస్పదం చేయాల్సిన పనేముంది. నేను అన్న మాటలు నేటికీ కట్టుబడి ఉంటాను’’అని రుసరుసలాడుతూ చెప్పారు కంగనా.

అతనితో పెళ్లి జరిగేనా?

అతనితో పెళ్లి జరిగేనా?


ప్రేమ  గురించి ఏకధాటిగా ఉపన్యాసాలిచ్చే స్థాయిలో అమీషా పటేల్‌కు అనుభవం ఉంది. విక్రమ్ భట్‌తో దాదాపు ఐదేళ్లు, కనావ్ పురితో మూడు, నాలుగేళ్లు ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ ఆ ప్రేమలను పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయారు. కనావ్ నుంచి విడిపోయిన తర్వాత అమీషా దాదాపు ఒంటరి అయ్యారు. పార్టీలకు సోలోగా ప్రత్యక్షమై.. అందరితో కబుర్లాడి వెనుదిరిగేవారు. అయితే ఇప్పుడు అమీషా స్టయిల్ మారింది. తోడు లేకుండా ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదని సమాచారం. పార్టీల్లో, సినిమా థియేటర్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఓ యువకుడితో కనిపిస్తున్నారట అమీషా. ఆ కుర్రాడు ఎవరో తెలుసుకోవాలని ఔత్సాహికులు ఆరాటపడిపోయి.. ఆరా తీసి, సదురు కుర్రాడి పేరు కునాల్ అని, పెద్ద వ్యాపారవేత్త అని తెలుసుకున్నారు. అమీషా మాజీ ప్రియుడు కనావ్‌కీ, కునాల్‌కీ పోలికలు కలుస్తాయట. బహుశా మాజీ ప్రియుడ్ని మర్చిపోలేక అతని పోలికలతో ఉన్న కునాల్‌తో అమీషా నేస్తం కట్టి ఉంటారని భావించేవారు కూడా ఉన్నారు. ఈ జంట కొత్త సంవత్సరాన్ని దుబాయ్‌లో జరుపుకున్నారట. అలాగే ఇమ్రాన్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఇద్దరూ హాజరయ్యారట. అమీషా కోసం కునాల్ సినిమా కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గమనించదగ్గ విషయం ఏంటంటే... కునాల్ వివాహితుడు. సో.. అమీషా సాగిస్తున్న ఈ మూడో ప్రేమ కూడా పెళ్లి పీటల వరకు వెళ్లదని ఊహించవచ్చు. ఒకవేళ వెళ్లినా.. పలు వివాదాలు, విమర్శలు ఎదుర్కోవడం ఖాయం అని కూడా చెప్పొచ్చు. 

Thursday, February 17, 2011

త్రిష సునక సేవ

 త్రిష సునక సేవ 

నిషన్నాక కుసింత కలాపోసన ఉండాలి.. అని చెబుతుంటారు. దాంతో పాటు కాస్తో కూస్తో దేశ సేవ కూడా చేయాలి. దేశానికంతటా సేవ చేసే సమయం లేదంటే వీధిలోకి వస్తే చాలు. మన సేవ కోసం చాలా జీవులు ఎదురుచూస్తుంటాయి. త్రిష కూడా అదే చేసింది. 'పేటా'లో సభ్యత్వం పొంది, వీధి కుక్కల సేవకు తన రోజువారీ జీవితంలో కాస్త సమయం కేటాయించింది. ఖరీదైన విదేశీ శునకాల్ని కొనడం ఎందుకు అని ప్రశ్నిస్తోంది. వాటి బదులు వీధి కుక్కల్ని దత్తత చేసుకొని సంరక్షించమని సలహా ఇస్తోంది. త్రిష చేస్తున్న సేవల్ని 'పేటా' ప్రశంసించింది. త్రిషని అభినందిస్తూ ఓ ఉత్తరం పంపింది. అంతే కాదు త్రిష పెంచుకొంటున్న కుక్కపిల్ల జోయాకు ఓ టీ షర్ట్‌ కూడా కానుకగా అందించింది. ఇవి రెండూ చూసుకొని త్రిష మురిసిపోతోంది.

Tuesday, February 15, 2011

కరీనా.. పెళ్లి గురించి మాట్లాడుతావెందుకు: సైఫ్

కరీనా.. పెళ్లి గురించి మాట్లాడుతావెందుకు: సైఫ్ 


పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన బాలీవుడ్ ముదురు ప్రేమజంట సైఫ్ అలీఖాన్- కరీనాకపూర్. ఈ వేలంటైన్ డే నాడు పెళ్లి చేసుకుంటామని ఆమధ్య కరీనా బాలీవుడ్ అంతటా గప్పాలు కొట్టింది. మూడు రోజుల క్రితం కూడా సైఫ్ - తను "పీపీ... డుండుం" అని తన సన్నిహితుల వద్ద చెప్పిందట. అయితే ప్రేమికుల రోజు వచ్చేసరికి చాలామంది సైఫ్‌కు ఫోన్ చేసి పెళ్లెక్కడ చేస్కుంటున్నారు...? అని ఫోన్లు మీద ఫోన్లు చేయడం మొదలెట్టారట. దీంతో చిర్రెత్తిన సైఫ్, తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ఎవరు చెప్పారు అని నిలదీశాడట. దానికి కరీనాయే తమకలా చెప్పిందని అన్నారట. అంతే... సైఫ్ తోక తొక్కిన పాములా చివ్వును లేచి సెల్ అందుకుని... కరీనా.. నీకెన్నిసార్లు చెప్పాలి. మన పెళ్లి గురించి పబ్లిక్‌లో మాట్లాడొద్దని అని అన్నాడట. మరి అవతల వైపు కరీనా ఏమన్నదో ఏమోగానీ... కొద్ది క్షణాలకే "అదికాదు నా బుజ్జి బిబో..." అంటూ కుక్కపిల్ల మాదిరిగా కుంచించుకుపోయాడట. 

అతనికి లిప్ టు లిప్ ముద్దివ్వడమా..? నో ఛాన్స్

అతనికి లిప్ టు లిప్ ముద్దివ్వడమా..? నో ఛాన్స్


అర్థనగ్నంగా నటించేందుకు సై అని చెప్పే కంగనా రనౌత్ పెదవులపై ముద్దివ్వాలని డైరెక్టర్ కోరితే నో చెప్పిందట. ఇంతకీ ఆ ముద్దు ఇవ్వాల్సింది ఏ హీరోకో కాదు... ఓ సింగర్‌కి.కంగనా తాజా చిత్రం "తను వెడ్స్ మను" చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఆ చిత్ర దర్శకుడు గాయకుడు మైకా సింగ్, కంగనాలతో ఓ బుల్లి సీన్ షూట్ చేశాడట. షూటింగ్ చివరి భాగంలో కంగనాను మైకా సింగ్ పెదవులపై ముద్దివ్వమని దర్శకుడు అడిగాడట.దాంతో చిర్రెత్తిన కంగనా... నా గురించి ఏవనుకుంటున్నారు.. ఎవరడిగితే వారికి ముద్దులు ఇచ్చేస్తాననుకుంటున్నారా..? అని ఎగిరెగిరి పడిందట. ముప్పావు వంతు శరీరాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రదర్శించే కంగనా ఇంతలా ఎందుకు ఎగిరిపడినట్లూ..? అని దర్శకుడు ఆలోచనలో పడ్డాడట. 

Monday, February 14, 2011

తాప్సీ నాభీ ప్రాంతాన్ని తాకేందుకు యత్నించిన "పోకిరి"

తాప్సీ నాభీ ప్రాంతాన్ని తాకేందుకు యత్నించిన "పోకిరి"


అందమైన అమ్మాయిలు కనబడితే చాలు... పోకిరి కుర్రాళ్లు కొందరు వారిని తాకేందుకు తహతహలాడుతారు. ఇక హీరోయిన్ అయితే ఇక చెప్పేదేముంది. ఎగబడతారు. ఇటీవల సెక్సీ హీరోయిన్ తాప్సీ ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. తెల్లపిల్ల తాప్సీ పలుచటి చీరను నాభీ కిందకు కట్టుకుని కార్యక్రమానికి హాజరైంది. సందట్లో సడేమియా అన్నట్లు తాప్సీ వెనుకే అనుసరించిన ఓ పోకిరి కుర్రాడు ఆమె నాభీ పరిసర ప్రాంతాన్ని అత్యంత చాకచక్యంగా తడిమేశాడట. ఈ హఠత్పారిణామానికి బిత్తరపోయిన తాప్సీ చివ్వున అతడివైపు తిరగబోయేసరికి, కిక్కిరిసిన జనంలో అతను కలిసిపోయాడట. చేసేదిలేక మిన్నకుండిపోయిందట తాప్సీ.ఆ మధ్య సమంతకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తిరుపతిలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన సమంత పట్ల ఓ కుర్రాడు అసభ్యంగా ప్రవర్తించాడు. అతగాడికి సమంత చాలాసేపు క్లాసు పీకి వదిలిపెట్టింది. ఏదేమైనా పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లేటపుడు హీరోయిన్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కుర్రాళ్ల చేతుల్లో "గిల్లుడు" తప్పదు 

షారుక్ మాటలకు ‘షాక్’ తిన్న ప్రియాంక

షారుక్ మాటలకు ‘షాక్’ తిన్న ప్రియాంక


పాంచాలికి ఐదుగురు భర్తలైతే.. ఆమెకన్నా ప్రియాంక చోప్రా ఓ రెండు మెట్లు పైనే ఉన్నారు. ఈ హాట్ గాళ్‌కి ఏకంగా ఏడుగురు భర్తలున్నారు. ఇది ‘రీల్’ లైఫ్‌లో అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం ఆమె ‘7 ఖూన్ మాఫ్’ అనే చిత్రంలో నటించారు. ఈ నెల 18న చిత్రం విడుదల కానుంది. ఇందులో ప్రియాంక మంచి వయసులో ఉన్న అమ్మాయిగా, మధ్యవయస్కురాలిగా, వృద్ధురాలిగా.. ఇలా పలు గెటప్స్‌లో కనిపిస్తారు. సినిమాలో ఏడుగురు భర్తలను చంపి పారేస్తారట. భవిష్యత్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ చిత్రంలో తను చేసిన పాత్ర చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందని భావిస్తున్నారామె. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటున్నారు. అందులో భాగంగా షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘జోర్ కా ఝఠ్కా’లో పాల్గొన్నారు ఈ బ్యూటీ. ఈ కార్యక్రమంలో ప్రియాంక, షారుక్ ఒకరినొకరు పొగుడుకున్నారు. ఆ ఆనందంలో ‘మేమిద్దరం కలిసి చాలా రాత్రులు గడిపాం’ అనేశారు షారుక్. దాంతో ప్రియాంక పెదవులపై చిరునవ్వు మాయమయ్యింది. షారుక్ మాటలకు ‘షాక్’ తిని పిచ్చి చూపులు చూస్తూ ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశారామె. దాంతో తను మాట్లాడిన మాటేంటో కింగ్ ఖాన్‌కి అర్థమైంది. వెంటనే సర్దుకుంటూ... ‘ఐమీన్.. ఈ చిత్రదర్శకుడు విశాల్ భరద్వాజ్ ప్రమోషన్ కోసం బెర్లిన్‌లో ఉన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు మేం రాత్రిపూట తీరికగా సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. ఆ విషయాన్నే చెప్పా’ అనడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీన్‌ని వీక్షించిన వాళ్ళంతా ఆమె తాజా ప్రియుడు షాహిద్ కపూర్ కూడా ఊపిరి పీల్చుకుని వుంటాడులే అని జోకేసుకుంటున్నారు.

Thursday, February 10, 2011

అతనే నా డ్రీమ్‌బాయ్

అతనే నా డ్రీమ్‌బాయ్


యుక్తవయసు వచ్చిన ప్రతి అమ్మాయి, అబ్బాయికి కొన్ని కోరికలుంటాయి. మంచి జాబ్‌తో పాటు మంచి వ్యక్తితో తన వివాహం జరగాలనేది ఆ కోరికల్లో ప్రధానంగా చోటుచేసుకునే అంశాలు. సినిమా తారలు విషయంలో.. వారుసినిమాల్లో నటిస్తుంటారు కాబట్టి మొదటి అంశానికి తావు వుండదు. ఇక రెండో అంశానికొస్తే- అందరు అమ్మాయిల్లాగే వారికీ ‘లైఫ్ పార్టనర్’ గురించి కలలు వుంటాయి. వేదం, మిరపకాయ్, వాంటెడ్ చిత్రాలతో కురక్రారును బాగా ఆకట్టుకుంటున్న దీక్షాసేథ్‌ని ఆ విషయమై అడిగినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘కాబోయేవాడి గురించి నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే లేవు. బాగా చదువుకుని ఉండి, సింపుల్‌గా బిహేవ్ చేసే వ్యక్తి అయితే చాలు. అతనే నా డ్రీమ్ బాయ్ అని చెబుతాను’’. ఇటీవల హైదరాబాదులోని మాదాపూర్‌లో ఏర్పాటైన ఓ కబాబ్ సెంటర్ ప్రారంభానికి హాజరైన సందర్భంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీక్షా ఆ విషయాన్ని తెలిపారు. కబాబ్స్ అంటే మీకు ఇష్టమా? అని అడిగినప్పుడు... కబాబ్‌ని కొరికితిని మరీ, ‘‘ఆస్ట్రేలియన్స్ కబాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆ టేస్టే వేరు. నాకు ఇష్టమైన అలాంటి ఔట్‌లెట్‌ని నా చేతులమీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారామె. వెజ్, నాన్‌వెజ్‌లలో వెజ్ చాలా ఆరోగ్యకరమని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు . దీక్షాసేథ్ బర్త్‌డే - ఈ నెల 14. అదేరోజు ‘ప్రేమికుల దినం’ కావడం విశేషం. తను హీరోయిన్ అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇదని, ఆ రోజు ముంబైలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మధ్య జరుపుకుంటానని ఆమె చెప్పారు. విక్రమ్, ప్రభాస్, మనోజ్ హీరోలుగా రూపొందే చిత్రాల్లో దీక్షాసేథ్ నటించనున్నట్లు తెలిసింది.

నా నగ్న రూపాన్ని హుస్సేన్ చిత్రిస్తారా...?

నా నగ్న రూపాన్ని హుస్సేన్ చిత్రిస్తారా...?


విద్యాబాలన్ ఊ... అంటే ఆమె నగ్న చిత్రాన్ని గీస్తానంటున్నాడట ప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్. అపురూప సౌందర్యాలను కలిగిన స్త్రీలు బహు అరుదుగా ఉంటారని, అటువంటి అందాలను తాను విద్యాబాలన్‌లో చూశానని హుస్సేన్ అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు... తన మస్తిష్కంలో వెలుగుచూసిన కోరికను బాలీవుడ్ ప్రౌఢ సుందరి విద్యాబాలన్‌కు సందేశం ఇచ్చాడట. విద్య ఒప్పుకుంటే ఆమె నగ్న సౌందర్యాన్ని తన కుంచెతో అత్యంత రమణీయంగా చిత్రిస్తానని చెప్పాడట.

Tuesday, February 8, 2011

గాయని సునీత ఎఫైర్..?

గాయని సునీత ఎఫైర్..?!


గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఈటీవీలో పాటలకు యాంకర్‌గా పలు పాత్రలు పోషించిన సునీత... నిజజీవితంలో విడాకులకోసం అభ్యర్థిస్తోందని తెలిసింది. ఎస్‌.పి. బాలు ప్రోత్సాహంతో సింగర్‌గా ఎదిగిన ఆమెకు గతంలో గాయనిగా నంది అవార్డు కూడా దక్కింది. ఓ టీవీ ఛానల్‌లో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఉండే కిరణ్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని సమాచారం. దీనికి కారణం... గత కొంతకాలం ఆమె వి.ఎన్‌. ఆదిత్య అనే దర్శకునితో సన్నిహితంగా ఉండడమేనని ఫిలిమ్ నగర్ చెవులు కొరుక్కుంటోంది. విషయం బయటపడడంతో బెడిసికొట్టిందని ఫిలింనగర్‌ కథనం. ప్రస్తుతం విడాకులు కోరుకుంటుందని సమాచారం. కానీ.. ఇటువంటి సంబంధాలతో సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆడవారికి బ్యాడ్‌నేమ్‌ వస్తుందనీ, సాధ్యమైనంతవరకు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సినీ విమర్శకులు చెబుతున్నారు.

నాకూ ఓ లవరుంది"- కృష్ణుడు

నాకూ ఓ లవరుంది"- కృష్ణుడు


శ్రీ శివపార్వతీ కంబైన్స్ పతాకంపై,మాస్టర్ హేమ చంద్రా రెడ్డి, బేబీ హేమశ్రీ సమర్పణలో, కృష్ణుడు హీరోగా, రితిక హీరోయిన్ గా, కె.రామ్ వెంకీని దర్శకుడిగా పరిచయం చేస్తూ,కె.సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం"నాకూ ఓ లవరుంది".ఈ చిత్ర దర్శకుడు కె.రామ్ వెంకీ గతంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడుగా పనిచేసిన అనుభవం ఉంది.ఈ చిత్రానికి గతంలో "ఆనంద్,గోదావరి, చందమామ" వంటి చక్కని చిత్రాలకు సంగీతం అందించిన కె.యమ్.రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.ప్రముఖ మాటల,పాటల రచయిత లక్ష్మీ భూపాల్ ఈ చిత్రంలో మూడు చక్కని పాటలు వ్రాశారు.ఈ చిత్రాన్ని వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రారంభస్తారు.

Monday, February 7, 2011

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే


శ్రీరామదాసు"లో నటించిన స్నేహకు మళ్ళీ అటువంటి పాత్రలు లభించలేదు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తను ఎలాంటి రూల్స్‌ పెట్టుకున్నదో అలాంటివే ఇప్పటికీ కంటెన్యూ చేస్తున్నట్లు చెప్పింది. మంచి పాత్ర లభిస్తే ఎటువంటి సినిమాలైనా చేస్తానని మరీ చెబుతుంది. ఆ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనని కొన్ని చిత్రాల్లో చేసినా ఫలించలేదు. అందుకే ఆమెకు ఓ విషయం అర్థమయిందట. ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర వహిస్తుందన్నదే తను నమ్మిన సిద్ధాంతం అంటోంది. ప్రతిభ ఉన్నా అది కలిసిరాకపోతే ఓడిపోతామని తెలుసుకున్నానని అంటోంది పూర్ స్నేహ. తాజాగా తమిళ, తెలుగులో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో పోలీసు అధికారిణిగా చేస్తుంది. పాపం చిత్రం విడుదల మాత్రం రోజులను నెట్టుకుంటూ వెళుతూ బాగా ఆలస్యం అవుతోంది. 

విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక..?!!

విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక..?!! 


రోజాపూలు చిత్రంలో రోజారేకుల్లాంటి సోయగాలతో అలరించి, ఖుషీలో నిమ్మపండు అందాలతో చిత్తు చేసిన సెక్సీ హీరోయిన్ భూమిక తన భర్తతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ ఫిలిమ్ న్యూస్. విశ్వసనీయ సమాచారం ప్రకారం... భూమిక భర్త భరత్ ఠాకూర్ ఆమెను పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయేట్లు చేశాడట. అంతేనా... అంటే.. ఇంకా చాలావుంది అంటున్నారు సినీజనం. ఇటీవల కాలంలో భరత్ ఠాకూర్ ఓ అత్యున్నత కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో అక్రమ సంబంధం నెరపుతున్నాడనీ గుసగుసలు బయలుదేరాయి. ఈ విషయం ఆనాటో ఈనోటా చివరికి భూమిక చెవికి చేరిందట. దాంతో భూమిక తోకతొక్కిన తాచుపాములో బుసలుకొడుతోందట. అవన్నీ వట్టి అబద్ధాలే అని భర్త భరత్ చెపుతున్నప్పటికీ వినే దశలో ఆమె లేదట. పైగా ఇటీవల తనకు పరిచయం లేని సినీ నిర్మాణ రంగంలోకి దింపి తకిట తకిట సినిమా తీసి సుమారు 15 కోట్ల రూపాయల దాకా భారీ నష్టం రావడానికి మూలకారకుడు భరతేనని ఆమె కుటుంబ సభ్యులు నమ్ముతున్నారట. దీంతో అతడికి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

Saturday, February 5, 2011

అందుకే నన్ను అబ్బాయిలా చూస్తారు

అందుకే నన్ను అబ్బాయిలా చూస్తారు


తెలుగు హీరోలు ఇగోయిస్ట్‌లని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువ అని నాతో చాలామంది అన్నారు. ‘కాంచనమాల కేబుల్ టి.వి.’ సినిమా ఒప్పుకున్నప్పటి సంగతి ఇది. కానీ వారు అన్నట్లుగా ఇక్కడి పరిస్థితి లేదు. టాలీవుడ్‌లో అందరూ స్నేహంగా ఉంటారు’’ అన్నారు లక్ష్మీరాయ్. ఈ అందాల తార ‘కాంచనమాల..’లో నటించి దాదాపు ఆరేళ్లయ్యింది. ఈ ఆరేళ్లల్లో అనువాద చిత్రాల ద్వారా లక్ష్మీరాయ్ తెలుగు తెరపై కనిపించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో చాలాకాలం తర్వాత స్ట్రయిట్ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉందని ఈ అందాల తార అంటున్నారు. గ్లామర్ రోల్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ సందర్భంలో లక్ష్మీరాయ్‌ని అడిగితే - ‘‘గ్లామరస్ హీరోయిన్లను చూడ్డానికే యూత్ సినిమాలకు వస్తారన్నది నా అభిప్రాయం. అందుకే గ్లామర్‌గా కనిపించి వాళ్ల మనసులను గెల్చుకోవాలనుకుంటాను. సెక్సీగా కనిపించడానికి ఇష్టపడతాను కానీ వల్గార్టీకి మాత్రం దూరంగా ఉంటాను’’ అన్నారు. మీ పేరంట్స్ మీకెలాంటి సపోర్ట్‌నిస్తున్నారు? అనే ప్రశ్నను లక్ష్మీరాయ్ ముందుంచితే - ‘‘ఫస్టఫాల్ మా అమ్మా నాన్న ప్రోత్సాహం లేకపోయుంటే నేనీ స్థాయికి వచ్చేదాన్ని కాను. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయాను గానీ తమిళ్, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేశాను. మలయాళంలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు చేస్తున్నాను. మా అమ్మా నాన్నకి మేం మొత్తం ముగ్గురు అమ్మాయిలం. నేనే చిన్నదాన్ని. అందుకని నన్ను చాలా గారాబంగా పెంచారు. నా స్టిస్టర్స్‌తో నేనెప్పుడూ గొడవ పడుతుంటాను. మా గొడవతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. మా నాన్నకి మగపిల్లలంటే ఇష్టం. కానీ మేం ముగ్గురం ఆడపిల్లలు కావడంతో.. నన్ను అబ్బాయిలా ట్రీట్ చేస్తారు. నాన్న నన్ను ముద్దుగా ‘కృష్ణా’ అని పిలుస్తారు’’ అని చెప్పారు.

ప్రేమించేందుకు తీరిక లేదు

ప్రేమించేందుకు తీరిక లేదు


ప్రేమించని వాళ్లను వేస్ట్ లిస్ట్‌లో వేసేస్తారని, అయితే ప్రేమించేందుకు తనకు తీరిక లేదని నటి కాజల్ అగర్వాల్ అంటోంది. ప్రేమ గురించి చాలా అనుభవం గడించినట్లు పెద్ద ఉపోద్ఘాతమే చెబుతోంది ఈ ఉత్తరాది భామ. తొలుత కోలీవుడ్‌లో ప్రవేశించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రకాశిస్తున్న కాజల్ మాట్లాడుతూ పాఠశాల దశలో చదువు గురించి విచారిస్తారని, యవ్వన దశలో ఎవరిని ప్రేమిస్తున్నావ్ అని అడుగుతారని అంటోంది.ముఖ్యంగా యువకులు ప్రేమించాలని తాపత్రయపడతారని చెబుతోంది. అయితే ప్రేమకు తాను చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని అంటోంది. అలాగని దానికోసం తొందరపడనని చెబుతోంది. ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటి స్తూ బిజీగా ఉన్నానని చెబుతున్న కాజల్ ప్రేమకు వయసుతో పని లేదని తెలిపింది. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించిందని, కొందరు మోహాన్ని ప్రేమగా భావించి తప్పుదారి పడుతున్నారని ప్రేమతత్వాన్ని వళ్లిస్తోంది.

Friday, February 4, 2011

అది ప్రభు నిర్ణయమే:నయనతార

అది ప్రభు నిర్ణయమే:నయనతార


నేటి తరం కథానాయికలకు పౌరాణిక చిత్రాల్లో నటించే అవకాశం అరుదుగానే లభిస్తుంది. నయనతార ఇప్పుడు సీతాదేవిగా తెర మీదకు రాబోతోంది. బాపు రూపొందించే 'శ్రీరామరాజ్యం'లో నయన్‌ నటిస్తోంది. కథానాయికగా అదే ఆమె ఆఖరి చిత్రం. అందుకే కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదు. ప్రభుదేవాని నయన్‌ ఈ యేడాదే వివాహం చేసుకొనే అవకాశాలున్నాయి. పెళ్లయ్యాక నటనకు స్వస్తి చెప్పబోతోంది నయన్‌. ఈ నిర్ణయం ఎవరిదని అడిగితే ''పెళ్లయ్యాక నటించవద్దని ప్రభు చెప్పారు. ఆయన చెప్పాక నేను ఆలోచించాను. అది సరైన నిర్ణయమే అనిపించింద''ని ఈ కేరళ కుట్టి చెబుతోంది. నయన్‌ నటించిన 'బాడీగార్డ్‌' అనే మలయాళ చిత్రం అన్ని భాషల దర్శకనిర్మాతల్నీ ఆకట్టుకొంది. తమిళంలో రీమేక్‌ చేసేటప్పుడు కూడా ఆమెనే కథానాయికగా నటించమని అడిగారు. అంగీకరించలేదు. వివాహానంతరం సినిమాలోని మరే విభాగంలోకీ ప్రవేశించే ఆలోచన లేదనీ, గృహిణిగానే ఉంటాననీ ఆమె చెబుతోంది

నసీరుద్దీన్‌షాతో విద్యాబాలన్ రొమాన్స్

నసీరుద్దీన్‌షాతో విద్యాబాలన్ రొమాన్స్ 


బాలీవుడ్ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ ఉన్నట్లుండి హాట్ సీన్లలో నటించడం మొదలుపెట్టింది. హోమ్లీ పాత్రలు వేస్తే ఆట్టే సినిమాల్లో కొనసాగలేమని అనుకుందో ఏమోగానీ ఎడాపెడా లిప్ లాక్ కిస్సులు ఇచ్చేస్తోంది. అదీ కుర్రహీరోలతోనైతే ఫర్లేదు. నడివయసున్న నసీరుద్దీన్‌షాకు ఇవ్వడమే ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఇష్కియా చిత్రంలో ఈ ప్రౌఢసుందరి తన పెదవులతో బిగించి వేడి వేడి ముద్దులు ఇచ్చే సన్నివేశంలో నటించింది. ఈ ముద్దువల్లనో లేదంటే సినిమా కథలో పట్టువల్లనో ఆ సినిమా హిట్ అయింది. తాజాగా సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ది డర్టీ పిక్చర్"లోనూ నసీరుద్దీన్ పెదవులను చుంబించడానికి రెడీ అయిపోయిందట విద్య. అదేమని అడిగితే... సన్నివేశం డిమాండ్ చేస్తున్నప్పుడు మూతి బిగించి ఎలా కూచుంటాం అని ప్రశ్నిస్తోందట. 

Thursday, February 3, 2011

బికినీలో చూడొచ్చు

బికినీలో చూడొచ్చు


అసిన్ బికినీలో కన్పిస్తే ఎలా వుంటుంది..? అసిన్ బికినీ ధరించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్న హాట్ టాపిక్స్‌ల్లో ఇది ఒకటి. ‘‘ ఛాన్సే లేదు. బికినీ నా శరీరానికి నప్పదు. అది వేసుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. బికినీలో అందాల ప్రదర్శన చేయను’’ అని ఒకప్పుడు చాలా సార్లు బికినీపై అయిష్టాన్ని ప్రదర్శించిన ఈ తార... ఇప్పుడు మాటమార్చారని సమాచారమ్. అసిన్ బికినీలో కనిపించకపోయినా, బికినీలో ఈ ముద్దుగుమ్మ ఎలా వుంటుందనే విషయమై ఇటీవల ఓ మార్ఫింగ్ ఫొటోని ఔత్సాహికులు ఇంటర్నెట్‌లో రూపొందించారు. ఈ విషయంలో కూడా ఆ ఫొటో తనది కాదనీ, తాను బికినీలో కన్పించే ప్రస్తకే లేదని ఈ మధ్యనే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఈ తార. ఇప్పుడేమో ఆల్ట్రా స్టైలిష్‌గా వుండేలా, స్విమ్మింగ్ పూల్‌లో సన్నివేశమంటూ చేయాల్సి వస్తే.. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చారు అసిన్. అప్పటి వరకు బికినీ విషయంలో ఆమె పెట్టుకున్న నిబంధనల్ని కాస్త సడలించి, తాను బికినీకి రెడీ అనే సందేశాన్ని బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు ఈ మాటలతో పంపారు. అసిన్. సో. త్వరలోనే ప్రేక్షకులు అసిన్‌ను బికినీలో చూడబోతున్నారని అనుకోవచ్చు. ఆమెను తొలిసారిగా బికినీలో చూపించే దర్శక, నిర్మాతలు ఎవరో కూడా వేచి చూడాలి.

షాహిద్‌ని నేనే పిలిచాను

షాహిద్‌ని నేనే పిలిచాను


ఔను.. షాహిద్ మా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఏంటట?’’ అని ఒకింత నిర్లక్ష్యంగా, కూల్‌గా అంటున్నారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఐటి అధికారులు ప్రియాంక ఇంటి బజర్ నొక్కినప్పుడు షాహిద్ కపూరే తలుపులు తెరిసాడనే వార్తలు వచ్చాయి. ‘7 ఖూన్ మాఫ్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకొచ్చినప్పుడు ఈ విషయం గురించి విలేకరులు ప్రియాంకను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రియాంక పై విధంగా స్పందించారు. కానీ ఇన్‌కమ్ టాక్స్ అధికారులు వచ్చిన తర్వాతే తను మా ఇంటికొచ్చాడని చెబుతూ - ‘‘ఐటి ఆఫీసర్స్ మా ఇంటికొచ్చినప్పుడు మా అమ్మా నాన్న లేరు. దాంతో షాహిద్‌కు ఫోన్ చేశాను. మా ఇంటి దగ్గర్లోనే తన ఇల్లూ ఉంది. తను 3 నిమిషాల్లో వచ్చాడు’’ అన్నారు ప్రియాంక.

Wednesday, February 2, 2011

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్

త్రిష కోరిక తీర్చిన సింగపూర్ ఎయిర్‌లైన్స్


మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటా’’ అని ఫ్లయిట్ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ‘కాక్‌పిట్’లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా నడుపుతున్నారో చూడాలన్నదే త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలాగైనా తీర్చుకోవాలని త్రిష పంతం పట్టారు. విమానం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొఫైల్‌ను ఎయిర్ హోస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం సాగుతోంది. కానీ ఒక్క పైలట్ కూడా త్రిష కోరికను మన్నించలేదట. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. అయినా పట్టు వదలకుండా త్రిష ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి, తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొఫైల్ పంపించారట. ఈసారి కూడా ‘నో’ అనే సమాధానమే వస్తుందని ఫిక్స్ అయ్యారట. కానీ పైలట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిలాషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాదు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అట. చెన్నయ్ నుంచి హాంగ్‌కాంగ్‌కి వెళ్లే విమానంలోనే త్రిష తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా ఒకటి. ‘‘పవన్ కళ్యాణ్ సరసన నటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన రాక్ చేస్తున్నారు’’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు త్రిష. ఇంత స్లిమ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని అడిగితే - ‘‘నేను యోగా చేస్తానన్న విషయం తెలిసిందే. అలాగే ఆహార నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తా. షూటింగ్స్ లేనప్పుడు టెన్నిస్ ఆడతాను. ఈ ఆట కేలరీలను సునాయాసంగా కరిగించేస్తుంది. అందుకే వీలు కుదిరినప్పుడట్టా టెన్నిస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా’’ అన్నారు.

అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది: స్నేహా ఉల్లాల్‌

అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది: స్నేహా ఉల్లాల్‌ 


ఒకప్పటి సినిమా హీరోయిన్లు నాభీ కిందికి చీర కట్టి నటించాలంటే తెగ సిగ్గు పడేవారు. అయితే నేటి ట్రెండ్‌లో సిగ్గు అంటే ఏమిటి...? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాలం అలా మారింది. తాజాగా స్నేహా ఉల్లాల్‌ హైదరాబాద్‌ వచ్చింది. తన గురించి ప్రశ్నలు సంధించమని విలేకరుల్ని అడిగింది. కొత్తగా వచ్చిన విలేకరిని అడగమని పక్కవారు ప్రోత్సహించినా అతడు ఏమీలేదని.. కాస్త తలదించుకున్నాడు. దీంతో.. సిగ్గా.. అంటూ అతన్ని ఉత్సాహపర్చింది. అడగడానికి సిగ్గెందుకు... చెప్పడానికి నాకు లేనప్పుడు అని తెలుగులోనే మాట్లాడింది...అక్కడ పెయిన్‌తో బాధగా ఉంది...హిందీలో 'లక్కీ' చిత్రంలో నటించి టాలీవుడ్‌కు వచ్చిన స్నేహా ఉల్లాల్‌... ప్రస్తుతం తను సినిమాలు చేయడం లేదని చెప్పింది. కన్నడలో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపింది. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం చేశాక బ్యాక్‌ పెయిన్‌ ఎక్కువయిందంది. దాంతో డాక్టర్లు ఏడాదిపాటు రెస్ట్‌ తీసుకోమన్నారు. అది తగ్గింది అనుకుంటుండగా... బాలకృష్ణ 'సింహా'లో నటించా. ఆ తర్వాత మళ్ళీ పెయిన్‌ ఎక్కువయింది. డాక్టర్లు మళ్లీ చేయవద్దన్నారు. కొంతకాలం రెస్ట్‌ తీసుకుని ఆ తర్వాత అవకాశాలు వస్తే చేస్తానని అంది. 

Tuesday, February 1, 2011

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా 


ఈ వారం రోజుల్లో ఇలియానా రెండు సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత పని ఎందుకు జరిగింది అనుకుంటున్నారా?... ఆ విషయానికే వస్తున్నాం.. వారం రోజుల క్రితం ఈ గోవా బ్యూటీ ‘మై సిస్టర్స్ కీపర్’ అనే ఇంగ్లిష్ సినిమా చూశారట. ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఇలియానా కళ్లు చెమర్చేలా చేశాయి. నటీనటుల నటన, కథ ఈ గోవా బ్యూటీని అంతగా కదిలించాయట. ఇది జరిగిన నాలుగు రోజులకు మళ్లీ ఇలియానా కళ్లు వర్షించాయి. ఈసారి వేరే సినిమా వలన కాదు.. తను చేసిన ‘నేను నా రాక్షసి’ కోసం ఇలియానా ఏడ్చారు. ఈ ఏడుపుకి కారణం సదరు సినిమా షూటింగ్ పూర్తవ్వడమే. రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి సీన్ తీయడం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ ‘పేకప్’ చెప్పగానే... ఇలియానా చాలా బాధపడ్డారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘పోకిరి తర్వాత మళ్లీ పూరీతో చేసిన చిత్రం ఇది. ఆయనతో రెండో సినిమా చేయడం అనేది నా కల. ఈ చిత్రంలో పూరి నాకు మంచి పాత్ర ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక, రానా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను సెట్లో ఉంటే చాలా సందడిగా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడే పూర్తయ్యిందా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ యూనిట్‌తో నా ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా సాగింది. అందుకే ఈ చిత్రం నాకు చాలా చాలా ప్రత్యేకం. ‘నేను నా రాక్షసి’ విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. పూరి, నా కాంబినేషన్‌లో రూపొందిన ‘పోకిరి’ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ మా కాంబినేషనలో మరో సక్సెస్ చవి చూడబోతున్నాం’’ అన్నారు.

నవనీత్‌ కౌర్‌ పెళ్లి

నవనీత్‌ కౌర్‌ పెళ్లి



'శీను వాసంతి లక్ష్మి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ నవనీత్‌ కౌర్‌. ఈమె బుధవారం పెళ్లి చేసుకోబోతోంది. మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గ శాసనసభ్యుడు రవి రాణా ఆమె కాబోయే భర్త. అమరావతి పట్టణంలో జరిగే సామూహిక వివాహాల్లో నవనీత్‌ - రాణా దంపతులవుతారు. అక్కడ 2834 జంటలు ఒకేచోట పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ భారీ వేడుక ప్రపంచ రికార్డుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదవుతుందని తెలిసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, సంజయ్‌దత్‌లతోపాటు యోగా గురు బాబా రామ్‌దేవ్‌ కూడా హాజరవుతారు. నవనీత్‌ కౌర్‌ తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. పెళ్లయిన తరవాత నవనీత్‌ సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని కాబోయే భర్త రవి రాణా తెలిపారు.