Tuesday, November 30, 2010
ఆరబోతకు అర్హత ఉండాలి
ఆరబోతకు అర్హత ఉండాలి
పాత్ర స్వభావాన్ని బట్టి డ్రెస్ ఉంటుంది. నవీనభావాలు కలిగిన అమ్మాయి పాత్ర వేసి.. పరికిణీలో కనిపిస్తే ఏం బావుంటుంది చెప్పండి? అసభ్యం.. అశ్లీలత లాంటివి చూసే కళ్లపై ఆధారపడి ఉంటుంది. నాకు అందంగా కనిపించింది మీకు అశ్లీలంగా కనిపించొచ్చు. మీకు అశ్లీలంగా అనిపించింది నాకు అందంగా కనిపించొచ్చు’’ అంటూ లాజిక్కులు లాగుతున్నారు విమలారామన్. ఇంతకీ ఈ విశ్లేషణకు కారణం ఏమిటి అనుకుంటున్నారా?... అవసరాన్ని బట్టి అందాల ప్రదర్శన చేస్తూ... దానికి ‘గ్లామర్’ అని పేరు పెట్టి కెరీర్ లాగించేస్తోన్న నేటి నాయికల గురించి ఆమె వద్ద ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె చెబుతూ-‘‘నా దృష్టిలో అందాల ఆరబోతకు కూడా ఓ అర్హత కావాలి. ఆకర్షణీయమైన శరీరాకృతి, అబ్బురపరచే అందం ఉంటే ఏ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేసినా ఎబ్బెట్టుగా ఉండదు’’ అని తన మనసులోని మాటను ఆవిష్కరించారు విమలారామన్. ఏనాడూ తాను ఇబ్బంది కలిగించే రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేయలేదని, కథకు, సన్నివేశానికి అవసరం అనిపిస్తే అప్పుడు తప్పదని, పైగా అది నటిగా తన కర్తవ్యమని ఆ వెంటనే మాట మార్చేశారు ఈ మలయాళ మందారం.
Monday, November 29, 2010
వాళ్లను చూస్తే అసూయ కలిగింది
వాళ్లను చూస్తే అసూయ కలిగింది
పస్తుతం దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న నాయిక అనుష్క. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్నారామె. ఓ వైపు సినిమాలు, మరో వైపు సేవాకార్యక్రమాలు..! ఇదీ అనుష్క లైఫ్ స్టైల్. ఈ విషయంలో మీకు స్ఫూర్తి ఎవరు..? అని అనుష్కను అడిగితే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తీ నాకు స్ఫూర్తిప్రదాతే అని సమాధానమిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘దేవుడు ఇంద్రధనుస్సులాంటి జీవితం ఇచ్చాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని లైఫ్ ఇది. అలా దేవుడిచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే... మనంత స్వార్థపరులు ప్రపంచంలో మరొకరు ఉండరని నా అభిప్రాయం. ఈ అభిప్రాయం నాకు కలగడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఈ మధ్య ఓ వికలాంగుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ పిల్లల్ని చూస్తే బాధ అనిపించింది. కానీ ఆ బాధ కాసేపే. కొంతసేపు వాళ్లతో గడిపిన తర్వాత వాళ్లను చూస్తే ఈర్ష్య కలిగింది. వాళ్లందరూ మాకంటే చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం వారితో కాసేపు గడిపాక కానీ అర్థంకాలేదు. దేవుడు ఒకటి తీసుకుంటే... అంతకు పదంతలు శక్తిని ఇస్తాడని చిన్నప్పుడు అమ్మ చెప్పేది. వాళ్లను చూసిన తర్వాత అది నిజం అనిపించింది. ఆ క్షణమే వారికోసం ఏదైనా చేయాలన్న భావన మొదలైంది. అందుకే... సినిమాలతో పాటు... అలాంటి వారి సేవ కూడా నా జీవితంలో ఓ భాగంలా చేసుకున్నాను’’ అని చెప్పారు అనుష్క.
స్నేహ నడుముపై గిల్లిన ఆకతాయి
స్నేహ నడుముపై గిల్లిన ఆకతాయి
అందాల తారామణులు బయటకు వస్తే కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి ఇబ్బందే స్నేహకు గురువారం ఎదురైంది. తమిళనాడులోని ఈరోడ్ పెరుందురై ప్రాంతంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది అందాల తార స్నేహ. కార్యక్రమం జరుగుతుండగా అమ్మడిని చూసేందుకు అభిమానులు తోసుకుంటూ ఎగబడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఆకతాయి స్నేహ నడుముపై ఉన్న మెత్తటి శరీరాన్ని గిల్లాడు. దీంతో చిర్రెత్తిన స్నేహ సివంగిలా మారింది. సదరు ఆకతాయి చేయిపట్టుకుని ఏం ఒళ్లెలా ఉంది..? అంటూ ఎగెరెగిరిపడింది. అయితే కేవలం నడుము గిల్లిన అతడికి స్నేహ తన చేయి పట్టుకోవడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్నాడు. స్నేహ మాత్రం అతడు కనబడినంత వరకూ తిడుతూనే వెళ్లింది
Friday, November 26, 2010
కుర్రాళ్లతో క్రేజీ భామ
కుర్రాళ్లతో క్రేజీ భామ
ఏమాయ చేసావె’ చిత్రంలో హోమ్లీ లుక్‌తో కనిపించి కురక్రారు మనసంతా దోచుకున్న సమంత ఇటీవల విడుదలైన ‘బృందావనం’లో హాట్ హాట్‌గా కనిపించి యువతకు మరింత దగ్గరయ్యారు. ఈ రెండు చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు సమంత. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే సమంత నటించిన తమిళ చిత్రం ‘బానా కాత్తాడి’ని తెలుగులోకి ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత శ్రీనివాస్ దామెర.‘హృదయం’ ఫేం మురళి తనయుడు అధర్వ ఈ చిత్రంలో కథానాయకుడు. బద్రి వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారు మెచ్చే అంశాలున్నాయి. పరిస్థితులు ప్రేమికుల మధ్య అపార్థాలకు కారణం అయినా స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి వుండదు అనేది ఈ చిత్రం ఇతివృత్తం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి.
700 ప్రింట్లు... 1000 థియేటర్లలో 'ఆరెంజ్'
700 ప్రింట్లు... 1000 థియేటర్లలో 'ఆరెంజ్'
రామ్‌చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగేంద్రబాబు నిర్మించిన 'ఆరెంజ్' చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. 700 ప్రింట్లు, 1000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు.జెనీలియా, షాజన్ పదంసీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ లవర్‌బోయ్‌గా, న్యూలుక్‌తో కనిపించి అభిమానులను అలరిస్తారని ఆయన తెలిపారు.
Thursday, November 25, 2010
అండర్‌వేర్ లేకుండా దర్శనమిచ్చిన యానా గుప్తా
అండర్‌వేర్ లేకుండా దర్శనమిచ్చిన యానా గుప్తా ఐటమ్ గాళ్ యానా గుప్తా మరో సంచలనం సృష్టించింది. ఇటీవల ఆ ఛారిటీ ఈవెంట్‌కు హాజరైన యానా తొడలు కనబడే వరకు నల్లటి దుస్తులను ధరించి వచ్చింది. ఈవెంట్‌లో పాల్గనేందుకు వచ్చిన ఆమె అక్కడ ఓ కుర్చీలో ఆశీనురాలైంది. దీంతో నల్లగౌను కాస్తా తొడలను దాటి మరింత పైపైకి వెళ్లిపోయింది. అంతే..! కెమేరాలన్నీ ఆమె వ్యక్తిగత భాగంపై టపటపలాడటం మొదలుపెట్టాయి. ఈ విషయాన్ని గమనించిన యానాగుప్తా తను ప్యాంటీ ధరించలేదనీ, ఫోటోలు తీయవద్దని చెప్పినట్లు భోగట్టా. అయినా వినని కెమేరాలు అన్ని కోణాల్లో తీసేందుకు తెగ ఎగబడ్డాయట. వాటి ధాటిని తట్టుకోలేని యానా కాళ్లను క్రాస్‌గా పెట్టి ఆ భాగాన్ని కనబడకుండా చేద్దామని చూసినా ఆ ప్రయత్నాన్ని సైతం కెమేరాలు బంధించాయట. అండర్‌వేర్ లేకుండా రావడం ఎందుకూ...? అలా కాళ్లను అటూ ఇటూ తిప్పుతూ ఆ భాగాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం ఎందుకూ...? అని అక్కడ కొందరు యానాపై మండిపడ్డారట. అంతేకాదు ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు కనీసం లోదుస్తులతో రావాలన్న ఇంగితం కూడా లేదా అని మరికొందరు యానాకు బుద్ధి చెప్పారట. |
బాబాల బాగోతం
బాబాల బాగోతం
భక్తుల బలహీనతలను సొమ్ముచేసుకునే దొంగ బాబాల చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘బాబాల బాగోతం’. పి.సి.రెడ్డి దర్శకత్వంలో సందె దేవదానం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది సందేశాత్మక చిత్రం. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా సినిమా ఉంటుంది.
షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. భరత్‌బాబు, ఐశ్వర్య, డా.శివప్రసాద్, సత్యప్రకాష్, అశోక్‌కుమార్, ఆనంద్‌రాజ్, ప్రత్యేకపాత్రలో పి.సత్యారెడ్డి, రమ్యశ్రీ, శ్వేత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డాక్టర్ శ్రీకాంత్, కెమెరా: కొంకణాల శ్రీనివాసరెడ్డి, నిర్మాణం: దేవశ్రీ ప్రొడక్షన్స్.
షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. భరత్‌బాబు, ఐశ్వర్య, డా.శివప్రసాద్, సత్యప్రకాష్, అశోక్‌కుమార్, ఆనంద్‌రాజ్, ప్రత్యేకపాత్రలో పి.సత్యారెడ్డి, రమ్యశ్రీ, శ్వేత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డాక్టర్ శ్రీకాంత్, కెమెరా: కొంకణాల శ్రీనివాసరెడ్డి, నిర్మాణం: దేవశ్రీ ప్రొడక్షన్స్.
Wednesday, November 24, 2010
అన్నీ తెలుసుకునే ఇక్కడికొచ్చాను
అన్నీ తెలుసుకునే ఇక్కడికొచ్చాను
‘‘బికినీలు ధరించడం, పెదవిని పెదవితో కలపడం... ఇవన్నీ ప్రస్తుత యువతరానికి సహజం. అలాంటప్పుడు అవి సినిమాల్లో హీరోయిన్లు చేస్తే తప్పేంటి...?’’ అని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ భామ తాప్సీ. తన తొలి చిత్రమైన ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా చక్కని స్టార్‌డమ్‌ని, గ్లామర్ డాల్ ఇమేజ్‌ను తాప్సీ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌పోజింగ్ అనే అంశం గురించి పస్తావన వచ్చినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా తాప్సీ మాట్లాడుతూ- ‘‘సినిమా అనేదే గ్లామరు ఫీల్డ్. ఇక్కడ ఒక స్టేజ్‌కి రావాలంటే... మడికట్టుకొని కూర్చుంటే సరిపోదు. పాత్రోచితంగా, సందర్భానుసారంగా ఎక్స్‌పోజ్ చేయాలి. సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకొని... గొప్ప నటీమణులుగా కీర్తిని ఆర్జించిన తారల్లో... ఎక్కువ శాతం మంది ఎక్స్‌పోజింగ్ చేసినవారే. నేను వారికంటే గొప్పదాన్ని కాదు. పీజీ చేసి నేను ఈ రంగంలోకి వచ్చాను. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు.సినిమా రంగలోని లోటుపాట్ల గురించి పూర్తిగా తెలుసుకొని ఈ రంగంలోకి వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నటికైనా... పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చిపెట్టేది గ్లామరే. స్థిరత్వం ఏర్పడిన తర్వాత నటన పరంగా ఎన్ని ప్రయోగాలు చేసినా చెల్లుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు తాప్సీ. ఇదిగాక మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న ‘వస్తాడు నా రాజు’ చిత్రంలో కూడా ఆమే నాయిక. తమిళంలో రెండు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారామె.
ముద్దుకు ససేమిరా అన్నా...
ముద్దుకు ససేమిరా అన్నా...
ముద్దు సన్నివేశాలు సాధారణమైపోతున్న ఈ రోజుల్లో అలాంటి సన్నివేశాల్లో నటించనని నటి రియా అంటున్నారు. నూతన నటుడు జితీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం తలకోణం. ఇందులోఅతనికి జంటగా నటి రియా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సముద్ర కని శిష్యుడు కె.పద్మరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ఆయన తెలుపుతూ మంత్రి కుమార్తె రియా కళాశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళుతుందన్నారు. మరో కళాశాలలో చదువుతున్న హీరో జితేష్ తమబృందంతో తలకోన చేరుకుంటాడని తెలిపారు. అయితే అక్కడ వారిని అంతర్జాతీయ తీవ్రవాదులుకిడ్నాప్ చేస్తారన్నారు. జైలులో బంధీగా ఉన్న తమ సహచరుల్ని విడుదల చేస్తేనే మంత్రి కుమార్తెనుప్రాణాలతో విడిచిపెడుతామని హెచ్చరిస్తారు. అదే సమయంలో మంత్రి కుమార్తె రియాను మరోముఠాకు చెందిన వారు కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్‌తో పాటు వారి బృందాన్ని ఎలా కాపాడాడు? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా మొలకెత్తింది? వారిప్రేమ సఫలం అయిందా? అనేది కథ అని తెలిపారు. ఒక సందర్భంలో హీరో హీరోయిన్లు లిప్‌లాక్ సన్నివేశం చోటు చేసుకుంటుందన్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి హీరోయిన్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. సన్నివేశం ప్రాముఖ్యతను వివరించగా చివరికి ముద్దుకు అంగీకరించిందని తెలిపారు.అయితే ఇలాంటి సన్నివేశం చిత్రంలో మరోసారి కూడా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు.Tuesday, November 23, 2010
మా పెళ్లి కూడా చేసేశారు
మా పెళ్లి కూడా చేసేశారు
స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటో ఆ చిత్రంలో నటించిన దేవ్ పటేల్‌తో ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారన్నది తాజా వార్త. ఈ విషయం గురించి ఫ్రీదా స్పందిస్తూ - ‘‘కొంతమందికి పనీ పాటా ఉండదనుకుంటా. ఫ్రీదా పింటా, దేవ్ ఫలానా రెస్టారెంట్‌కు వెళ్లారు.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు.. చేతిలో చెయ్యేసుకుని పార్కుల్లో తిరిగారని ప్రచారం చేస్తారు. అదే నోటితో ఇద్దరూ గొడవపడ్డారట, విడిపోయారట అని అంటారు. ఇప్పుడేమో మా పెళ్లి కూడా చేసేశారు. చూద్దాం.. ఇంకెన్ని వార్తలు వస్తాయో’’ అన్నారు. పెళ్లయిందా? లేదా? అనే విషయానికి మాత్రం సమాధానం చెప్పకుండా దాటేశారు.
'శ్రీరామరాజ్యం'మొదలయ్యింది
'శ్రీరామరాజ్యం'మొదలయ్యింది
శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటిస్తోన్న 'శ్రీరామరాజ్యం' చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకుడు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు.ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో 'శ్రీరామరాజ్యం' లోగోపై కథానాయకుడు బాలకృష్ణ క్లాప్‌నివ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ. రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ "బాపు, రమణ అనగానే 'సీతాకల్యాణం' చిత్రం జ్ఞాపకమొస్తుంది. ఎన్టీఆర్ పౌరాణిక బ్రహ్మ.ఆయన తర్వాత అలాంటి పాత్రలు చేయగలిగేది బాలకృష్ణే. 'శ్రీరామరాజ్యం' ఆయనకు మరచిపోలేని సినిమా అవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇప్పటివరకు అందరు పెద్ద హీరోలతో పనిచేశా. ఎన్టీఆర్, బాలకృష్ణగార్లతో చేయలేదు. ఇప్పుడు బాలకృష్ణతో చేయడం సంతోషంగా ఉంది.బాపు దర్శకత్వంలో లక్ష్మణుడి పాత్రను చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. ఈ చిత్రం కాకతాళీయంగా రూపుదాల్చిందని నిర్మాత సాయిబాబా తెలిపారు. "భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా 'లవకుశ' స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాం'' అని ఆయనన్నారు
Monday, November 22, 2010
రోజుకి ఐదు ఆటలకు సై
రోజుకి ఐదు ఆటలకు సై గాంధీజీ హంతకుడు పేరును చివర్న తగిలించుకుని సినీ పరిశ్రమను ఆకర్షించిన బాలీవుడ్ సెక్సీ బాంబ్ ముగ్ధా గాడ్సే. ఇపుడీ భామ ఓ అలవాటుకు బానిసగా మారిపోయిందట. పొద్దస్తమానం వాటితో ఎంజాయ్ చేయలేకుండా ఉండలేకపోతోందట. కనీసం ఐదు ఆటలైనా వేస్తేనే ఓకే అంటోందట. ఇంతకీ ఏమిటా ఆటలు.. ఎందుకంత ఇష్టం అని ఆరా తీస్తే.. ఓ విషయం బయటపడిందట. ముగ్ధా గాడ్సేకు సినిమాల పిచ్చి మరీ ఎక్కువట. అందువల్లనో ఏమోగానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా సినిమాలపై సినిమాలను వీక్షిస్తూనే ఉంటుందట. ఈ చిత్రాల్లో హాలీవుడ్‌తో సహా బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలు చిత్రాలున్నాయట. అన్నట్లు రామ్ చరణ్ తేజ మగధీర చిత్రాన్ని అదేపనిగా పదిసార్లూ చూసిందట. ఈ సిన్మా చూసిన దగ్గర్నుంచి తను కూడా మిత్రవింద పాత్రలాంటి అద్భుతమైన పాత్ర దొరికితే నటించడానికి తాను రెడీ అని టాలీవుడ్ సినీపరిశ్రమకు చెపుతోంది. మరి ముగ్ధా గాడ్సేను అలా చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా...? |
అతను మసాజ్ చేస్తుంటే గాల్లో తేలిపోయాను
అతను మసాజ్ చేస్తుంటే గాల్లో తేలిపోయాను
‘‘నా పాదాలకు ఉపశమనం లభించేట్లుగా అడపా దడపా బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ‘ఫుట్ మసాజ్’ చేయించుకుంటాను. కానీ ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఇమ్రాన్‌ఖాన్ ముందు బ్యూటిషియన్లు బలాదూర్’’ అంటున్నారు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే. ఇమ్రాన్‌ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం ‘బ్రేక్ కే బాద్’. ఈ నెలాఖరున చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో దీపికా పాదాలకు ఇమ్రాన్ మసాజ్ చేసే సన్నివేశం ఒకటుంది.
ఆ సీన్ చిత్రీకరణ చాలా సరదాగా జరిగిందని ఈ బ్యూటీ అంటున్నారు. ఇమ్రాన్ తన పాదాలు పట్టుకోగానే దీపికాకు నవ్వొచ్చేసిందట. గిలిగింతలు పెట్టినట్లు అనిపించిందని ఆమె అంటున్నారు. ఈ సీన్ గురించి దీపికా చెబుతూ - ‘‘చిత్రదర్శకుడు ధనీష్ అస్లామ్ ఈ సన్నివేశం గురించి చెప్పగానే నాకు భలే నవ్వొచ్చింది. నా కాళ్లు పట్టుకుంటావా? అని ఇమ్రాన్‌ని ఏడిపించాను. తను కూల్‌గా నవ్వేశాడు. సీన్ తీసేటప్పుడు అది షూటింగ్ అని మర్చిపోయాడో ఏమో.. నిజంగానే నా పాదాలకు మసాజ్ చేశాడు. నాకైతే గాల్లో తేలిపోయినట్లు అనిపించింది. నేను కూడా అది షూటింగ్ అని మర్చిపోయి మసాజ్‌ను హాయిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. మేం అలా ఇన్‌వాల్వ్ కావటమే మా దర్శకుడికి కావాలి. సీన్ బాగా వచ్చిందని తెగ పొగిడేశారు. నిజం చెబితే నమ్మరు. నేను ఎంతోమంది బ్యుటిషియన్ల దగ్గర ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. కానీ ఇమ్రాన్ చేసినంత బాగా ఎవరూ చేయలేదు’’ అంటున్నారు.
Sunday, November 21, 2010
గోపిచంద్ కొత్త చిత్రం 'వాంటెడ్'
గోపిచంద్ కొత్త చిత్రం 'వాంటెడ్'
గోపీచంద్ హీరోగా రచయిత బి.వి.ఎస్.రవిని దర్శకునిగా పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ అధినేత వెనిగెళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'వాంటెడ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీక్షాసేథ్ చిత్రకథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'గోపీచంద్‌తో 'శౌర్యం' తర్వాత మేం తీస్తున్న సినిమా ఇది. సినిమా చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో హీరోకి హీరోయిన్ వాంటెడ్. హీరోయిన్‌కి విలన్ వాంటెడ్. విలన్‌కి హీరో వాంటెడ్. అందుకే ఈ సినిమాకి 'వాంటెడ్' అని పేరు పెట్టాం. మూడు పాటలు మినహా చిత్రం పూర్తయింది' అన్నారు. దర్శకుడు రవి మాట్లాడుతూ 'లవ్, ఫ్యామిలీ,యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. గోపీచంద్ కేరెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. మాస్‌తో పాటు యూత్ కూడా లవ్ చేసే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దాం. ఆయన తల్లితండ్రులుగా చంద్రమోహన్, జయసుధ నటిస్తున్నారు. వీరిపై చిత్రీకరించిన ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుంది' అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి మాట్లాడుతూ 'డబ్బింగ్ పూర్తయింది. మిగిలిన మూడు పాటలను ఈ నెల 23 నుంచి ఇటలీ, దుబాయ్‌ల్లో చిత్రీకరిస్తాం' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, బెనర్జీ, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, షఫీ, సుబ్బరాజు, అంజాద్‌ఖాన్, దువ్వాసి, రావి కొండలరావు, రాధాకుమారి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్.
ఏవండీ.. సినిమా చూపిస్తా... వచ్చి చూడండి!
ఏవండీ.. సినిమా చూపిస్తా... వచ్చి చూడండి!
హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన "గుజారిష్" చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో హృతిక్‌తో శృతిమించిన శృంగార సన్నివేశాలలో ఐష్ నటించిందని గత వారం నుంచీ బాలీవుడ్ సీనీజనం ఒకటే వాయిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒక దశలో దర్శకుడితో అటువంటి సన్నివేశాలేమైనా ఉంటే దయచేసి తొలగించండి అని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా శుక్రవారం సినిమా విడుదల కావడంతో ఆ చిత్రాన్ని తనతోపాటు చూడాల్సిందిగా ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ను కోరినట్లు సమాచారం. భార్యకోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతాడన్న పేరున్న అభిషేక్, ఐష్ అడిగిందే తడవుగా తన "ప్లేయర్స్" చిత్రం షూటింగ్ వాయిదా వేసుకుని గోవా నుంచి ఫ్లైట్ ఎక్కి ముంబయిలో వాలిపోయాడట. భర్త రాగానే మిగిలిన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి సినిమా చూపించిందట ఐష్.
Saturday, November 20, 2010
కె. రాఘవేంద్ర రావు నా డాళింగ్
కె. రాఘవేంద్ర రావు నా డాళింగ్
సినిమా హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు డాళింగ్‌లేనని నటి, ఎంఎల్ఏ జయసుధ కితాబిచ్చింది. మంగళవారం రాత్రి ఓ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరైంది. వేదికపై రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. అయితే ఆయన మౌనమునిలా మాట్లాడలేదు. "సెట్‌లో కూడా అలానే ఉంటారు. తీసే సన్నివేశం కెమెరామెన్‌తోపాటు నటీనటులకు చెపుతారు. ఆయనలో పట్టుదల, కసి ఉన్నా... వాటిని చిత్రానికే వాడుతారు. హీరోయిన్లకు ఆయనంటే ఒకరకమైన అభిప్రాయముంటుంది" అని చెప్పింది జయసుధ.
పవన్‌కళ్యాణ్‌తో విష్ణువర్థన్
పవన్‌కళ్యాణ్‌తో విష్ణువర్థన్
సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకునే పవన్‌కళ్యాణ్ ఈ సారి తన పంథా మార్చారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జయంత్, సింగీతం శ్రీనివాసరావుల దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో... సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ కలిసి నిర్మించనున్నారు. 2011 ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించబోతున్నారు. పవన్‌కళ్యాణ్ చిత్రానికి యువన్ స్వరాలు అందించడం ఇదే ప్రథమం అవుతుంది. గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండటం విశేషం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టయిలిష్‌గా ఉంటూనే, అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, రచన: రాహుల్ కోడా, సంభాషణలు: క్రిష్, కళ: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, నిర్మాతలు: నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విష్ణువర్థన్.
Friday, November 19, 2010
అరుంధతిగా ఐశ్వర్యరాయ్?
అరుంధతిగా ఐశ్వర్యరాయ్?
తెలుగునాట సంచలన విజయం సాధించిన ‘అరుంధతి’ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో కూడా అనువాదమైన సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరుంధతి’గా నటించిన అనుష్క ఆ చిత్రం సాధించిన విజయంతో ఎంత పాపులారిటీ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు గ్లామరస్ పాత్రలకే పరిమితమైన అనుష్కలోని నటనా పటిమను చాటి చెప్పిన చిత్రం ఇది. కాగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో త్రీడీ ఫార్మాట్‌లో రీమేక్ చేస్తున్నారని సమాచారం. ఈ రీమేక్‌లో ‘అరుంధతి’ గా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించనున్నారని తెలిసింది.జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో మొదటగా టైటిల్ రోల్‌కు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినాకైఫ్‌ల పేర్లు పరిశీలించారట. కానీ, మహారాణి గెటప్‌లో అరుంధతిగా ఐశ్వర్యరాయే నప్పుతుందని ఆమెను ఎంపిక చేసుకున్నారని సమాచారమ్. ‘అరుంధతి’ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా ప్రమోట్ అయిన అనుష్క తరహాలోనే ఐశ్వర్య రాయ్‌కు కూడా ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మరపురాని మూవీగా నిలుస్తుందని భావించొచ్చు.
మేం వేశ్యలం కాదు
మేం వేశ్యలం కాదు
‘‘నేను మాట్లాడే మాటలు ఘాటుగా ఉండొచ్చు. వాస్తవాలెప్పుడూ అలానే ఉంటాయి. ఫలానా హీరోతో మీరు ప్రేమలో పడ్డారట? ’’ అని పాత్రికేయులు అడిగినప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ ఫీలింగ్ కలుగుతుంది నాకు’’ అంటున్నారు దియా మీర్జా. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ ముంబయ్‌లో సెటిలయ్యారు. పదేళ్ల కెరీర్‌లో ఆమె దాదాపు 35 సినిమాలు చేశారు. కానీ దియా ఖాతాలో విజయాలు తక్కువ. పెపైచ్చు.. అర్షద్ వార్సీతో ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్తలు ఒకటి.ఈ వార్తలకే దియా మీర్జా పై విధంగా స్పందించారు. ఆ విషయమై మరింత వివరంగా చెబుతూ - ‘‘సినిమా ఫీల్డ్ అంటే గ్లామర్ కాబట్టి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేయక తప్పదు. అంత మాత్రాన వాళ్లు మనుషులు కాదని, మనసు ఉండదని అనుకుంటే పొరబాటే. మేం ఒక హీరోతో కలిసి సినిమా చేస్తే ఆ హీరోతో మాకేదో ఉందని అంటగట్టేస్తారు. ఒకవేళ హీరో కాకపోతే దర్శకుడితోనో, నిర్మాతతోనో ఎఫైర్ ఉందంటూ కథలు సృష్టిస్తారు. ఒక్కో సినిమా చేస్తున్నప్పుడు ఒక్కొక్కరితో ప్రేమలో పడటం తప్ప మాకు వేరే పనీ, పాటా ఉండదా? అయినా ఊరికినే మనుషులను మార్చడానికి మేమేం వేశ్యలు కాదు. ఇలా అంటున్నానని మరోలా అనుకోమాకండి. మా గురించి లేని పోని వార్తలు సృష్టించి ప్రచారం చేసినప్పుడు, మా కుటుంబ సభ్యులు బాధపడతారు. వినోదం కోసం ఏ కొంతమందో చేసే ఇలాంటి ప్రచారాల వల్ల మా తల్లిదండ్రులు, బంధువులు బాధపడతారు. అందుకే ఏదైనా వార్త ప్రచారం చేయాలనుకున్నప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి. ఆవేశంతో, బాధతో మేం వేశ్యలం కాదు అన్నాను. ఎవరినీ బాధపెట్టాలని అలా అనలేదు. ఎవరి వృత్తి వారిది కాబట్టి ఏ వృత్తి చేసేవారైనా నాకు గౌరవమే’’ అన్నారు.
Thursday, November 18, 2010
‘మగధీర’తో పోలిక లేని ‘ఆరెంజ్’
‘మగధీర’తో పోలిక లేని ‘ఆరెంజ్’
‘‘ప్రేమ మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అలాగే నాక్కూడా ఒక అభిప్రాయం ఉంది. ఒక విజన్ ఉంది. అదే ఈ సినిమాలో చూపించాను. ఇది ఎలాంటి సినిమా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. చరణ్ కెరీర్‌లో ఇది నిలిచిపోయే సినిమా అవుతుంది’’ అన్నారు దర్శకుడు భాస్కర్. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆరెంజ్’.కె.నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భాస్కర్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘మగధీర’ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ కథ సిద్ధం చేశాను. చరణ్ సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేశారు. ‘ఈ కథలో కరెక్షన్స్ అంటూ ఏమీ లేవు.. నిర్భయంగా ప్రొసీడ్ అయిపోవచ్చు..’ అని ప్రోత్సహించారు నాగబాబు. వీరందరి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ‘ఆరెంజ్’ను ఇంతబాగా తీయగలిగాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకున్న కథ ఇది. ‘మగధీర’కు ఏ మాత్రం పోలికలేని విధంగా, పూర్తి కాంట్రాస్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. అమ్మాయిలందరూ తమకు తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో జెనీలియా పాత్ర ఉంటుంది. ‘బొమ్మరిల్లు’ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతకు మించిన పేరును ఇందులోని పాత్ర జెనీలియాకు తెచ్చిపెడుతుంది. యూత్‌ని ఓ కొత్తలోకంలో తీసుకెళ్లే అందమైన ప్రేమకథ ఇది’’ అని చెప్పారు .
ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రారంభం
ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రారంభం
'అదుర్స్', 'బృందావనం' చిత్రాల విజయానందంలో ఉన్న ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కిక్' ఫేమ్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ నెం.2 బుధవారం ఉదయం సంస్థ కార్యాలయంలో జరిగింది. ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, వి.వి.వినాయక్ స్విచ్ ఆన్ చేశారు.దేవుని పటాలపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ "ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రం తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. ఎన్టీఆర్‌కు కచ్చితంగా సరిపోయే సబ్జెక్ట్ ఇది. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుంచి ఏకధాటిగా షెడ్యూల్ చేస్తాం. మా సంస్థకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది'' అని అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ "నవంబర్ 16కి తారక్ హీరో అయి పదేళ్ళు పూర్తయింది.17న ఈ చిత్రం ప్రారంభంతో మరో దశాబ్దానికి నటుడిగా శ్రీకారం చుట్టాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. తారక్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్‌లో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది. ఎన్టీఆర్ సరసన తమన్నా నటించనుంది. మరో నాయిక ఎంపిక జరుగుతోంది. ఈ సంస్థలో ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని అన్నారు.కిక్ శ్యామ్, ప్రకాష్‌రాజ్, ఆశిష్ విద్యార్థి, అలీ,జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారు మంచి, వెంకట్ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: చంద్రబోస్, సహ నిర్మాత: బి.బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.
హాట్ హీరోయిన్ కు రోజుకు రూ. 10 లక్షలు
హాట్ హీరోయిన్ కు రోజుకు రూ. 10 లక్షలు
ఇలియానా అంటే దక్షిణాది సినీ పరిశ్రమలో రాను రాను క్రేజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం ఇలియానా సినిమా అంటే కుర్రకారు ఎగబడి చూడటమేనన్నది వేరే చెప్పనక్కర లేదు. టాలీవుడ్‌లో తన హవా సాగిస్తున్న ఈ బక్క నడుము చిన్నది ఇపుడు శాండల్‌వుడ్‌లోనూ కాలు పెట్టింది. హీరోయిన్‌గా కాదు.. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్‌గా. అయితే ఆ పాటలో పాల్గొన్నందుకు ఇలియానాకు భారీగానే పారితోషికం ముట్టిందని టాలీవుడ్ సినీవర్గాలు చెపుతున్నాయి.అత్యంత సెక్సీగా ఐటమ్‌సాంగ్‌లో తన నాభీ నృత్యాన్ని ప్రదర్శించినందుకు గాను సదరు చిత్ర నిర్మాత ఇలియానాకు రూ. 30 లక్షలు పారితోషికంగా ఇచ్చాడట. కాగా ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణకు కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే పట్టిందట. కనుక ఇలియానా రెమ్యునరేషన్ రోజుకు రూ. 10 లక్షలన్నమాట.
Wednesday, November 17, 2010
డిసెంబర్‌లో 'మిరపకాయ్'
డిసెంబర్‌లో 'మిరపకాయ్'
రవితేజ కథానాయకుడిగా; రిచా గంగోపాధ్యాయ్, దీక్ష నాయికలుగా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేశ్ పుప్పాల నిర్మిస్తోన్న 'మిరపకాయ్' చిత్రం యూరప్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. హరీశ్ శంకర్ ఎస్. దర్శకుడు. సినిమా ప్రోగ్రెస్ గురించి నిర్మాత రమేశ్ తెలియజేస్తూ "బ్యాంకాక్‌లో పన్నెండు రోజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరించిన క్లైమాక్స్ చాలా గొప్పగా వచ్చింది.ఈ నెల మూడు నుంచి పద్నాలుగు రోజులపాటు యూరప్‌లోని జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాగ్ దేశాల్లో చిత్రీకరిస్తున్నాం. రవితేజ, రిచాలపై రెండు పాటల్నీ, రవితేజ, దీక్షపై ఓ పాటనీ రాజు సుందరం నృత్య దర్శకత్వంలో తీస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం అయిపోతుంది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా అందర్నీ వినోదింపజేసే మాస్ రోల్‌ని రవితేజ పోషిస్తున్నారు.డిసెంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించాం'' అని చెప్పారు. ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్, నాగబాబు, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సుప్రీత్, రావు రమేశ్ తారాగణమైన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, విక్రమ్ సిరి, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి,, సంగీతం: తమన్ ఎస్., ఛాయాగ్రహణం: రాంప్రసాద్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్ శంకర్ ఎస్.
సెన్సార్‌వారి మెడపై కత్తి పెట్టా
సెన్సార్‌వారి మెడపై కత్తి పెట్టా
‘‘సెన్సార్‌వాళ్లను తప్పుకొని మీ ‘రక్త చరిత్ర’ ఎలా బయటకొచ్చింది...? అని విలేకరులు అడిడితే...‘‘సెన్సార్‌వారి మెడపై కత్తి పెట్టా... దాంతో వదిలేశారు’’ అని తాపీగా సమాధానం చెప్పారు వర్మ. ఇలాంటి చిత్రమైన ప్రశ్నలతో, విచిత్రమైన సమాధానాలతో గమ్మత్తుగా రామ్‌గోపాల్‌వర్మ ‘రక్త చరిత్ర-2’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌గోపాల్‌వర్మ ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో సూర్యకు అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ-‘‘ఇందులో హీరోలు, విలన్లూ ఉండరని, కథను బట్టే పాత్రలన్నీ నడుచుకుంటూ ఉంటాయనీ ‘రక్త చరిత్ర’ మొదలైన నాటి నుంచీ చెబుతూనే ఉన్నాను. నా మాటలోని వాస్తవం ‘రక్తచరిత్ర-2’ చూస్తే అందరికీ అవగతం అవుతుంది. ఈ ద్వితీయ భాగం సూర్య నేపథ్యంలో సాగుతుందని తెలిసిందే. నేను ఈ పాత్రకు సూర్యను ఎంపిక చేయడానికి కారణం ఆయనలోని నటనా పటిమే. కళ్లతోనే భావాలు పలికించగల ప్రతిభ సూర్యకు సొంతం. కారాగారంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్లతో పలికించిన భావాలు దర్శకుడిగా నేనే మరిచిపోలేకపోయాను. ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ సినిమాలో నటించారాయన. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘కథను నడిపించే రెండు ముఖ్యమైన పాత్రల్లో నా పాత్ర కూడా ఒకటి. అంతే కానీ ఇందులో నేను, వివేక్ కథానాయకులం కాదు... ప్రతినాయకులం అంతకన్నా కాదు.
ఎన్నో ఏళ్ల నుంచి రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించాలని కలలు కన్నాను. ఆ కల ఇన్నాళ్లకు రక్తచరిత్ర ద్వారా నెరవేరింది. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’’ అని సూర్య చెప్పారు. ఇంకా మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్, మధుర శ్రీధర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించాలని కలలు కన్నాను. ఆ కల ఇన్నాళ్లకు రక్తచరిత్ర ద్వారా నెరవేరింది. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’’ అని సూర్య చెప్పారు. ఇంకా మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్, మధుర శ్రీధర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tuesday, November 16, 2010
మహేష్‌తో అనుష్క ‘వేట’
మహేష్‌తో అనుష్క ‘వేట’
ఇటీవల విడుదలైన ‘మహేష్ ఖలేజా’ చిత్రాన్ని చూశారా... ఆ చిత్రంలో జంటగా నటించిన అల్లూరి సీతారామరాజు, సుభాషిణిల జంట ఎలా వుంది..! వారిద్దరి మధ్య నడిచిన సన్నివేశాలు మిమ్ములను నాన్‌స్టాప్‌గా నవ్వించాయి కదూ..? ఆ చిత్రంలో సీతారామరాజు, సుభాషిణిలుగా నటించిన మహేష్‌బాబు, అనుష్క జంట త్వరలో మరో చిత్రంలో కూడా కలిసి నటించనున్నారని సమాచారమ్. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్న మహేష్ త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ‘వేట’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క కథానాయికగా ఎంపికయ్యారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయకుడు మాధవన్‌తో పాటు నాయిక సమీరారెడ్డి కూడా కీలక పాత్రలను పోషించనున్నారట. ఇంకో విషయం ఏమంటే- ఈ చిత్రంలో తెలుగులో మహేష్ చేస్తున్న పాత్రను తమిళంలో ఆర్య చేస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్‌తో వెంటనే మరో చిత్రం చేసే అవకాశం రావటం పట్ల స్వీటీ (అనుష్క ముద్దుపేరు) ఆనందంగా వున్నారని సమాచారమ్.
"బెజవాడ రౌడీలు"గా రామ్‌చరణ్ - అల్లు అర్జున్...?
"బెజవాడ రౌడీలు"గా రామ్‌చరణ్ - అల్లు అర్జున్...?
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నటించబోతున్న 150వ చిత్రానికి డైరెక్షన్ చేయాలని ఉబలాటపడిన రామ్‌గోపాల్ వర్మ ఆ కోరిక నెరవేరదని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చిరు కుమారుడు రామ్‌చరణ్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తను ఎంతో కాలంగా కష్టపడి పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్న "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో తీస్తే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు భోగట్టా. ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇంకోటి చోటుచేసుకున్నదట. అదేంటయా... అంటే, బెజవాడ రౌడీల్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఉండాలి కనుక రామ్‌చరణ్ ప్రత్యర్థిగా అల్లు అర్జున్‌ను నటింపజేస్తే చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.
Monday, November 15, 2010
హీరోలను పట్టించుకోను
హీరోలను పట్టించుకోను
'సినిమాకు సంతకం చేసే ముందు నేను ఆలోచించేది కథ గురించే. కథ బాగుండి అందులో నా పాత్ర నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తాను'' అని అంటోంది మలయాళ ముద్దుగుమ్మ అసిన్.బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకుని తిరిగి చెన్నై చేరుకున్న ఈ కేరళ కుట్టి తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. "కథ, నా పాత్ర తర్వాత నేను ఆరా తీసేది దర్శకుడు గురించి. నేను నటిస్తున్న సినిమాలో హీరో ఎవరన్న విషయం మీద నేనెప్పుడూ ఆసక్తి చూపను.ఎవరైనా చెబితే వింటానే తప్ప ఆ వివరాలను పట్టించుకోను'' అని తెగేసి చెప్పేసిందీ సుందరి. అన్నట్టు ఎరుపు, నలుపు రంగులంటే ఈ బ్యూటీకి ప్రాణమట. "అమ్మా నాన్న నా రోల్ మోడల్స్. అమ్మకు ఎరుపు అంటే ఇష్టం. నాన్నకు నలుపంటే ఇష్టం. అందుకే నాకు ఆ రెండురంగులంటే ప్రాణం'' అని వివరించింది అసిన్.
ఒకే ఒక్క కారణంతో అతన్నుంచి విడిపోయా
ఒకే ఒక్క కారణంతో అతన్నుంచి విడిపోయా
‘‘మగాడి కళ్లు... కంట కనబడిన ప్రతి అమ్మాయి వైపు వెళితే.. అతన్ని ప్రేమిస్తున్న అమ్మాయికి ఒళ్లు మండుద్ది. రణబీర్ కపూర్ విషయంలో నాకలానే ఉండేది’’ అంటున్నారు క్యూట్ గాళ్ దీపికా పదుకొనే. ‘బచ్‌నా ఏ హసీనో’ చిత్రంలో కలిసి నటించినప్పుడు రణబీర్, దీపికా మధ్య ప్రేమ చిగురించింది. దేహాలు వేరైనా మనసు మాత్రం ఒకటేనని, నువ్వెక్కడుంటే నేనక్కడుంటానని... ఇలా ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు ఈ ప్రేమికులు. అంతగా ప్రేమించిన రణబీర్ నుంచి ఎందుకు దూరమయ్యారు? అనే ప్రశ్నను దీపికా పదుకొనే ముందుంచితే - ‘‘రణబీర్‌కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని నా ఫీలింగ్. అతన్ని దగ్గరగా గమనించడం మొదలుపెట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నాను. ఏ అమ్మాయితో పడితే ఆ ఆమ్మాయితో మాటలు కలిపేసేవాడు. దాంతో నేను అభద్రతాభావానికి గురయ్యాను. అతనికి దూరంగా ఉన్నప్పుడు.. ‘ఇప్పుడు రణబీర్ ఏం చేస్తున్నాడో? ఏ అమ్మాయితో తిరుగుతున్నాడో?’ అనే ఫీలింగ్ కలిగేది. ప్రతిసారీ ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటూ చెక్ చేయలేను కదా. ఒకవేళ అతనితో కలిసి ఉంటే జీవితాంతం నేను అనుమానంతో సతమతమవ్వాల్సి వచ్చేది. రణబీర్ ప్రవర్తన సరిగ్గా ఉంటే నేనెందుకు అనుమానిస్తాను? నా కళ్ల ముందే అతను వేరే అమ్మాయిలతో క్లోజ్‌గా ఉండేవాడు. ప్రేయసికి నమ్మకం చేకూర్చలేని మగాడూ ఒక మగాడేనా? అనిపించింది. అతన్నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం ఇదే’’ అన్నారు. రణబీర్ నుంచి విడిపోయిన తర్వాత అతని గురించి ఆలోచించడం మానేశానని, పగ, ప్రతీకారాల్లాంటివేమీ లేవని కూడా ఆమె స్పష్టం చేశారు.
Saturday, November 13, 2010
అమ్మో..ఆగలేను!
అమ్మో..ఆగలేను!
ఒక్కొక్కరికీ ఒక్కో బలహీనత ఉంటుంది. స్నేహకు పండుగలే వీక్‌నెస్. "పండుగల రోజు అమ్మ పది రకాలకు తగ్గకుండా వండేస్తుంది. అందులో నెయ్యి, తీపి దట్టంగా ఉంటుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టాక తినకుండా ఉండలేం. తీరా కాస్త నోట్లో వేసుకున్నాక ప్లేట్లకు ప్లేట్లు తినేయాలనిపిస్తుంది.అదీ నా బలహీనత. అయినా పండుగలు రోజూ రావు కదా. అందుకే పండుగలకు మాత్రం డైటింగ్‌కు టాటా చెప్పేస్తాను. కడుపు పట్టకున్నా ఏదో ఒకటి లాగించేస్తుంటాను. పండుగలప్పుడు కూడా డైటింగ్ చేసేవాళ్ళను చూస్తే పాపమనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చింది స్నేహ.
‘వేడి’ పుట్టించనున్న బిర్యానీ భామ
‘వేడి’ పుట్టించనున్న బిర్యానీ భామ
కొన్ని పాత్రలు చేయటానికి గట్స్ వుండాలి. ఎటువంటి పాత్రనైనా నేను చేయగలను అనుకున్న వారే ఛాలెంజ్ పాత్రలు చేయటానికి సిద్ధంగా వుంటారు. అందులోనూ కథానాయికలు ఈ విషయంలో పర్టిక్యులర్‌గా వుంటారు. కొంతమంది నాయికలు నేను ఈ పాత్రలే చేస్తాను అని గిరీ గీసుకొని కూర్చుంటే, మరికొంత మంది అభినయానికి ఆస్కారమున్న ఎటువంటి పాత్రలను చేయడానికైనా సిద్ధంగా వుంటారు. ఆ రకంగా ఇటీవల ‘వేదం’ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈ కోవలోనే ‘ఆవకాయ్ బిర్యానీ’ ఫేం బిందుమాధవి కూడా చేరనున్నారు. త్వరలో ఆమె ఓ తమిళ చిత్రంలో వేశ్య పాత్రలో నటించనున్నారని సమాచారమ్. ‘ఆవకాయ్ బిర్యానీ’ తర్వాత బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు చిత్రాల్లో నటించినా బిందు కెరీర్‌కు బ్రేక్ రాలేదు. దాంతో పూర్తి అభినయానికి ఆస్కారమున్న పాత్రను చేయాలనుకున్న ఆమె వేశ్య పాత్రను పోషించటానికి అంగీకరించారని తెలిసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా, ఆయన శిష్యురాలు అంజన దర్శకత్వంలో ‘వెప్పం’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. వెప్పం అంటే ‘వేడి’ అని అర్థం. ఇందులో బిందుమాధవిని నాయికగా ఎంపిక చేసుకున్నారట. ఈ చిత్రంలో ఆమె వ్యభిచారిగా కనిపిస్తారని చెన్నయ్ సమాచారం. అయితే ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ పాత్ర వుంటుందని దర్శకురాలు అంజనా చెబుతున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే ఆశతో వున్నారట బిందుమాధవి.
Friday, November 12, 2010
కథలో "ఖలేజా" ఉంటే మేమిద్దరం రెడీ అంటున్న ప్రిన్స్, పులి
కథలో "ఖలేజా" ఉంటే మేమిద్దరం రెడీ అంటున్న ప్రిన్స్, పులి
మల్టీస్టారర్ చిత్రాల సీజన్ మళ్లీ మొదలుకానున్నది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు కలిసి నటించేందుకు తమ సంసిద్ధతను తెలియజేసినట్లు భోగట్టా. కథాబలం ఉంటే ఇద్దరూ కలిసి నటించేందుకు సిద్ధమని చెప్పారు.వీరిద్దరి అంగీకారం తెలియజేయడంతో ఓ అరడజను రచయితలు కథలతో వారి ముందు వాలేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ ఫిలిమ్ నగర్ వార్త. ఈ కథలలో ఏ ఒక్కటి నచ్చినా పవన్ కల్యాణ్ - మహేశ్ బాబు చిత్రం తెరపైకి రావడం ఖాయం.మరోవైపు యువరత్న బాలకృష్ణ తన అన్న కుమారుడు కల్యాణ్ రామ్‌తో కలిసి నటించేందుకు రెడీ అన్నట్లు సమాచారం. మొత్తమ్మీద 2011 నుంచి మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులు చూడవచ్చన్నమాట.
ప్రేమ కావాలి
ప్రేమ కావాలి
డైలాగ్ కింగ్‌గా అందరి చేత ప్రశంసలు అందుకుంటూ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్నారు సాయికుమార్. ఇప్పుడాయన తనయుడు ‘ఆది’ హీరోగా పరిచయమవుతూ ‘ప్రేమ కావాలి’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఇషా చావ్లా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన విజయభాస్కర్ ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో తెరకెక్కిస్తూ విజయంపై ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్నారు.
Thursday, November 11, 2010
రణబీర్‌కు కండోమ్ ప్యాక్‌ను గిఫ్ట్‌గా ఇస్తా..!
రణబీర్‌కు కండోమ్ ప్యాక్‌ను గిఫ్ట్‌గా ఇస్తా..!
రణబీర్ కపూర్‌కి హ్యాండ్ ఇచ్చి కొత్తగా లిక్కర్ కింగ్ కుమారుడు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో చెట్టపట్టాల్ వేసుక తిరుగుతున్న దీపిక పదుకునే బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడంలో ఆరితేరిపోయిందంటున్నారు. అంతేకాదండోయ్.. మాజీప్రియులను వెక్కిరించడం వంటి చేష్టలు కూడా చేస్తోంది. తాజాగా రణబీర్ కపూర్ కత్రినాకైఫ్‌తో స్నేహం చేయడంపై తన గుస్సాను వ్యక్తం చేసింది. పనిలోపనిగా అతగాడికి ఓ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉందని అందట. ఆ గిఫ్ట్ ఏమిటో కాస్త చెప్పవూ... అనడిగితే.. ఇంకేముందీ.. అతగాడికి ఓ పెద్దసైజు కండోమ్ ప్యాకెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు బోల్డ్‌గా చెప్పిందట ఈ చొట్టబుగ్గల బ్యూటీ. ఈ మాట రణబీర్ చెవిలో పడితే ఏం చేస్తాడో చూడాలి.
15న రక్తచరిత్ర-2 పాటలు
15న రక్తచరిత్ర-2 పాటలు
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రక్తచరిత్ర’ పార్ట్ 1 ఇటీవల విడుదలైంది. కాగా, ఈ నెలలో రెండో భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూర్య, వివేక్ ఒబెరాయ్, శతృఘ్న సిన్హా, ప్రియమణి తదితరుల కాంబినేషన్‌లో యదార్థ గాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాలను రూపొందించారు. పార్ట్-1 చూసిన ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను విడుదల చేశారు. ఈనెల 15న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘పార్ట్ 1 కన్నా 2 మరింత విజయం సొంతం చేసుకుంటుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు.
Wednesday, November 10, 2010
త్రిష చేయి పట్టుకున్న ఆ కుర్రాడెవరు?
త్రిష చేయి పట్టుకున్న ఆ కుర్రాడెవరు?
ఆ రోజు.. మద్రాసు బీచ్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్తోంది త్రిష. ఆమె పయనం ఎక్కడికో ఆమెకే తెలియదు. రోడ్డు చాలా ప్రశాంతంగా వుంది. మనసు కూడా ఎంతో హాయిగా పులకించిపోతోంది. ఆ సమయంలో సడన్‌గా వెనుక నుంచి ఓ వ్యక్తి సైకిల్ మీద వచ్చి, త్రిష చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ చేయిని ఆమె ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా ఊఁహూఁ... కుదరలేదు. ఆ తర్వాత ఏం జరిగింది...? అనే కదా మీ సందేహం. ఇదేదో త్రిష నటించిన సినిమాలోని సన్నివేశం అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఇది సినిమాలోని సన్నివేశం కాదు. అలా అని రియల్‌లైఫ్‌లోని సంఘటన కూడా కాదు. తరచుగా నిద్రలో త్రిషకు వచ్చే ‘కల’ అట ఇది. సైకిల్ మీద వచ్చిన వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమెకు మెలకువ వస్తోందట. అతని ముఖం ఎలా వుంటుందో చూడాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పటి వరకు ఆ కలలో ఆ యువకుడి ముఖం ఎప్పుడూ కనిపించలేదట.ఇటీవల ఓ సందర్భంలో ఈ ఆసక్తికరమైన కల గురించి చెప్పుకొచ్చిన త్రిష... తనకు మరికొన్ని కోరికలు కూడా వున్నాయని చెప్పారు. ‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సరదాగా షికారు కెళ్ళాలన్నది నా చిరకాల వాంఛ, అలాగే రజనీకాంత్, కమల్‌హాసన్‌ల సరసన నటించాలనే కోరికలో ప్రస్తుతం కమల్ సార్‌తో నటిస్తున్నందున ఓ కోరిక తీరింది. ఇక రజనీకాంత్‌తో నటించాలనే కోరికతో పాటు చెన్నయ్‌లో వున్న ‘కూవమ్’ కాలువలో (ప్రస్తుతం అది మురికికాలువ) ఈత కొట్టాలని (ఆ కాలువ శుభ్రం చేసిన తర్వాతనే సుమా) వుంది. అంతేకాదు... అవకాశం వుంటే మళ్ళీ నా చిన్న నాటి రోజులతో పాటు, కాలేజీ రోజులు కూడా తిరిగిరావాలని వుంది’’ అంటూ చెప్పుకొచ్చారు ఆమె. త్రిష కోరుకుంటున్న ఈ చిత్ర విచిత్రమైన కోరికలు ఎప్పుడు తీరతాయో.. వేచి చూడాలి. మనం కాదు లెండి... త్రిషనే.
హీరోయిన్ వేటలో విశాల్
హీరోయిన్ వేటలో విశాల్
పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ కథానాయకుడు విశాల్ గత కొద్ది రోజులుగా తన తాజా చిత్రానికి హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో బిజీగా వున్నారు. తెలుగులో గోపీచంద్ హీరోగా రూపొందిన ‘శౌర్యం’ తమిళంలో రీమేక్ అవుతోంది. అందులో నటిస్తున్న తన సరసన ఓ క్రేజీ హీరోయిన్‌ను నటింపజేయాలని, ఆ పనిని తనే స్వయంగా పూనుకొని ఆ వేటలో వున్నాడు విశాల్. ఇందుకోసం త్రిషను సంప్రదించగా డేట్స్ సమస్యతో ఆ ఆఫర్‌ని ఆమె సున్నితంగా తిరస్కరించనట్లుగా తెలిసింది. విశాల్‌తో నటించటానికి త్రిష తిరస్కరించడం ఇది రెండోసారి. సరే, ఇక హన్సిక దగ్గరైనా తన అదృష్టం పరీక్షించుకుందామని వెళ్ళిన ఈ యువ కథానాయకుడికి అక్కడ కూడా కూడా త్రిష చెప్పిన రీజనే ఎదురైందట. ఇక లాభం లేదనుకొని తెలుగు ‘శౌర్యం’లో నటించిన అనుష్కనైనా తన సరసన నటిస్తుందేమోనని కొండంత ఆశతో వెళ్ళిన విశాల్ ప్రయత్నం. ప్చ్... మరోసారి విఫలమైంది. ఆల్రెడీ తెలుగులో చేసిన పాత్రను తమిళంలో తిరిగి చేయడం ఇష్టలేక ఆమె కాదన్నారని సమాచారమ్. దాంతో మళ్లీ వేటలో పడిన విశాల్ జాబితాలో తమన్నా, కాజల్, సమంతా వున్నారట. ఈ ముగ్గురిలో ఒకరైనా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోతారా అని విశాల్ ఆశగా వున్నారట.
Tuesday, November 9, 2010
లిప్ లాక్’ సీన్స్ లో ఎందుకు ఆక్ట్ చెయ్యకూడదు?
లిప్ లాక్’ సీన్స్ లో ఎందుకు ఆక్ట్ చెయ్యకూడదు?
హాట్ గాళ్ బిపాసా బసు ‘సింగులార్టీ’ అనే హాలీవుడ్ చిత్రంలో డ్రీమ్ బోయ్ జోష్ హార్ట్‌నెట్ సరసన నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బిపాసా, జోష్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. ‘లిప్ లాక్’ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. మీరలాంటి సన్నివేశాల్లో నటిస్తారా? అనే ప్రశ్నను బిపాసా ముందించితే - ‘‘ఎందుకు యాక్ట్ చేయకూడదు? హిందీలో నా ప్రియుడు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్‌లతో ముద్దు సన్నివేశాల్లో నటించాగా. హాలీవుడ్ సినిమా కాబట్టి ఇంకాస్త రెచ్చిపోవాల్సి ఉంటుంది. ఇది ప్రేమకథా చిత్రం. ప్రేమికులు ముద్దులు పెట్టుకోరా ఏంటి?’’ అని నిర్భయంగా అంటున్నారు.
నాకెరీర్‌లో అతి పెద్ద విజయం'బృందావనం'
నాకెరీర్‌లో అతి పెద్ద విజయం'బృందావనం'
'బృందావనం' చిత్రం తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయమని హీరో ఎన్టీఆర్ అన్నారు. క్లాస్ సినిమాలు చెయ్యలేరా, లవర్‌బాయ్ పాత్రలు చెయ్యలేరా.. అన్న అభిమానుల కోరికని ఈ సినిమాతో తీర్చానన్నారు. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో 'బృందావనం' చిత్రం ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్ చేతుల మీదుగా ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికని ఎన్టీఆర్ అందుకున్నారు.వినాయక్ మాట్లాడుతూ "అతి శక్తిమంతమైన నందమూరి తారకరామారావు అనే పేరుని మోస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కృష్ణుడిలా మారాడు. కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తూ హీరోగా మరింత ఎత్తుకు ఎదగాలి. ఎన్టీఆర్ ఎనర్జీకి నేనూ, రాజమౌళి కలిసి ఓ సినిమాకి పనిచేస్తే కరెక్టుగా ఉంటుంది'' అని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ "ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్ పాత్రకంటే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి పాత్ర ఎక్కువ. టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కీ ఈ సినిమా విజయంలో భాగముంది. వినాయక్, నేను, తారక్‌తో పాటు బాలయ్య కూడా తోడైతే ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది'' అన్నారు.చివరగా అభిమానుల్ని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ "మీరు లేకపోతే మేం లేం. మా కుటుంబం లేదు. నా కెరీర్‌లో 'బృందావనం' బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. కోట, ప్రకాశ్‌రాజ్ వంటి గొప్ప నటులతో చేయడం సంతోషంగా ఉంది. చెప్పినదానికంటే సినిమాని బాగా తీశాడు వంశీ. ఈ సినిమాతో తమన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. రాజమౌళి, వినాయక్ నాతో సినిమాలు చేయొద్దు. ఇప్పటికే వాళ్లు నాతో చెరో మూడు సినిమాలు చేశారు. వాళ్లు చెయ్యాల్సింది బాలయ్యతో'' అని వాళ్లచేత చేస్తామనిపించారు.
Wednesday, November 3, 2010
జగపతిబాబు చేస్తున్న'చట్టం'
జగపతిబాబు చేస్తున్న'చట్టం'
జగపతిబాబు కథానాయకుడిగా విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'చట్టం.. నీ అబ్బ సొత్తా?' చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో మంగళవారం ప్రారంభమైంది. పి.ఎ. అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. జగపతిబాబుపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు క్లాప్‌నివ్వగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి నిర్మాత, దర్శకుడు బి.వి. రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ "జయాపజయాలకు ఒకే విధంగా స్పందించే మనస్తత్వం వల్లే నట్టి కుమార్ ఈ స్థాయికి చేరుకున్నాడు. తన గురువైన కోడి రామకృష్ణని మించిన స్థాయికి అరుణ్‌ప్రసాద్ ఈ సినిమాతో ఎదగాలని కోరుకుంటున్నా. చేసిన ప్రతి పాత్రకూ ప్రాణంపోసే జగపతిబాబుకు ఇది మరో మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు.
ఎక్కడైనా భర్తకానీ...
ఎక్కడైనా భర్తకానీ...
అమీర్‌ఖాన్ నటించిన ‘ధోబీ ఘాట్’ చిత్రం అతనికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో మనకు తెలిసిందే. ఆ చిత్రంలో అతను ‘పెయింటర్’గా నటించాడు. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత ఎవరో గుర్తుంది కదా..? ‘కిరణ్‌రావ్’. ఆమె అమీర్‌ఖాన్‌కి సతీమణి. ఇప్పుడెందుకు ఈ సినిమా గురించి చెప్పుకోవడం అనే సందేహం రావొచ్చు. ‘ధోబీఘాట్’కి అమీర్‌ని సెలక్ట్ చేసేముందు కిరణ్‌రావు అతనికి స్క్రీన్ టెస్ట్ నిర్వహించారట. ఆ కేరక్టర్‌లో ఆయన సూట్ అవుతారో లేదో పరీక్షించి, ఆతర్వాతనే ఆ సినిమా చేయాలనుకున్నారట ఆమె. కొత్తవాళ్లకు టెస్ట్ పెట్టినట్టు ఆమె అమీర్‌ఖాన్‌కి టెస్ట్ పెట్టారనమాట. దీనినే సినీ పరిభాషలో ‘ఆడిషన్’ అంటారు. ఆలిండియాలో ‘సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న ఒక హీరోని పట్టుకుని ఓ కొత్త ఆర్టిస్టు మాదిరి టెస్ట్ పెట్టడమంటే మనకు వింతగానే అన్పిస్తుంది.అందులోనూ భర్తగారిని భర్యామణి పరీక్షలో నిలపడం! ఆమె అలా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే ఆ సినిమాలోని కేరక్టరుకు అమీర్‌కు అంతగా పేరొచ్చింది. 2010 టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది.
Tuesday, November 2, 2010
దమ్ము కొట్టడం తెలియదు
దమ్ము కొట్టడం తెలియదు
అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే అనే మాట హాటెస్ట్ తార నీతూ చంద్ర వ్యవహారాన్ని గమనిస్తే నిజమేననిపిస్తుంది. అసలు సంగతేంటంటే... ఇటీవల నీతూచంద్ర ఓ తమిళ సినిమా షూటింగ్‌లో భాగంగా దమ్ము కొట్టాల్సిన సీనులో నటించాల్సి వచ్చింది. దర్శకుడు నీతూకు బ్రాండెడ్ సిగార్ ఇచ్చి గట్టిగా ఓ దమ్ము లాగి వదలమన్నాడు. నీతూ దర్శకుడు మాట విని... అబ్బెబ్బే.. నాకసలు అటువంటి అలావాటే లేదు. సిగరెట్‌ను నేను ముట్టుకుని ఎరుగను. నో.. నో.. నేను చేయలేని అందట. అయితే సన్నివేశం డిమాండ్ మేరకు దమ్ముకొట్టాల్సిందేనని దర్శకుడు పట్టబట్టడంతో ఏమీ చేయలేని నీతూచంద్ర సిగరెట్‌ను తీసుకుని పొగ గుప్పుగుప్పును వదలడం మొదలుపెట్టిందట. దర్శకుడు అడక్కపోయినా సన్నివేశం బాగా రావడానికి మరిన్ని షాట్లు తీసుకోమని 30 సిగరెట్లను వరుసబెట్టి ఊదిపారేసిందట.
ఆమె దెయ్యమై తిరుగుతోందట
ఆమె దెయ్యమై తిరుగుతోందట
నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నప్పుడు షూటింగ్ పనిమీద వస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. నా పుట్టింటికి వెళుతున్నాననే భావించాను. వినడానికి అతిశయోక్తిగా అనిపించొచ్చుకానీ ఇది నిజం. ఈ రోజు ఈ రేంజ్‌లో ఉన్నానంటే కారణం తెలుగు ప్రేక్షకులే. ‘బొమ్మరిల్లు’ నాటి నుంచీ నన్ను వారి సొంత అమ్మాయిలా భావిస్తున్నారు. అందుకే వారికి సదా రుణపడి ఉంటాను’’ అని జెనీలియా అన్నారు. ప్రస్తుతం జెనీలియా ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఇటీవల ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. ఆ విశేషాలను తెలుపుతూ జెనీలియా పై విధంగా స్పందించారు. ఆమె ‘ఆరెంజ్’ అనుభవాలను తెలుపుతూ-‘‘ఆస్ట్రేలియాలోని ఓ స్టార్ హోటల్లో మా బస ఏర్పాటు చేశారు నిర్మాత నాగబాబుగారు. ఆ హోటల్ చూడగానే స్వర్గధామం అనిపించింది. ఎన్నాళ్ళైనా అక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్. తీరా రూమ్‌కెళ్లి చూడగానే గుండె గుభేల్‌మంది. ఎక్కడ చూసినా.. దెయ్యాలను, భూతాలను గుర్తుచేసే పెయింటింగ్స్. ఇక వాటిని చూస్తూ నిద్ర ఏం పడుతుంది చెప్పండి? నాకసలే దెయ్యాలంటే భయం. దీనికి తోడు ఒక షాకింగ్ న్యూస్. ఓ ఏడాది క్రితం అదే హోటల్లో ఓ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందట. అంతేకాదు ఆ అమ్మాయి దెయ్యమై ఆ హోటల్ చుట్టూనే తిరుగుతోందని, అప్పుడప్పుడు ఆ అమ్మాయి నవ్వులు, ఏడ్పులు రాత్రుళ్లు వినబడుతుంటాయని తెలిసింది. ఇక నిద్రపోతే ఒట్టు. నిజంగానే రాత్రులు ఏవో ఏడుపులు వినిపించేవి. ఈ భూత్ బంగ్లా నుంచి ఎప్పుడు బయట పడతాన్రా బాబూ.. అని గంటలు లెక్కపెట్టుకున్నాను. ఏదైతేనేం.. షూటింగ్ పూర్తి చేసుకొని బయట పడ్డాను. నా లైఫ్‌లో నిజంగా మరచిపోలేని భయంకరమైన రాత్రులు ఆ హోటల్లోనే గడిపాను. అలా ‘ఆరెంజ్’ నా జీవితంలో మరపురాని అనుభూతిని నింపింది’’ అని తనదైన శైలిలో గలగలా నవ్వేశారు అందాల హాసిని.
Monday, November 1, 2010
ఓ రేంజ్ సాహసాలతో ఆరెంజ్
ఓ రేంజ్ సాహసాలతో ఆరెంజ్
తొలి సినిమా ‘చిరుత’. మలి సినిమా ‘మగధీర’. రాబోతున్న మూడవ సినిమా ‘ఆరెంజ్’. మూడూ మూడు రకాల కాన్సెప్ట్స్. దేనితో దేన్నీ పోల్చడానికి లేదు. దటీజ్ రామ్ చరణ్. కథలను, పాత్రలను ఎంచుకోవడంలోనే నటుల ప్రజ్ఞ బయట పడేది. ‘మగధీర’ లాంటి సంచలనం తర్వాత ‘ఆరెంజ్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ చేయాలన్న ఆలోచనే చరణ్‌లోని అభిరుచికి నిదర్శనం. ‘ఆరెంజ్’ చిత్రంలో చరణ్ సరసన జెనీలియా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సాజన్ పదమ్‌సీ కూడా మరో నాయికగా నటిస్తున్నారు. ప్రేమకథలను హృద్యంగా తెరకెక్కించే ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత కె.నాగబాబు మాట్లాడుతూ- ‘‘పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రేమకోసం ఎంతటి సాహసానికైనా తెగించే డైనమిక్ ప్రేమికుడుగా ఇందులో చరణ్ కనిపిస్తాడు. ఈ పాత్రలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి. ఊహించని రీతిలో ఆ పాత్ర గమనం సాగుతుంది. ఇందులో చరణ్ 14వేల ఎత్తునుంచి స్కై డైవ్ చేశాడు. ఈ సాహసం ఈ చిత్రానికే హైలైట్. చరణ్ నటన, స్టైల్, కథ, కథనం ఇవన్నీ ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇది చక్కని ఫీల్ గుడ్ మూవీ. మా సంస్థకు, చరణ్‌కు, భాస్కర్‌కు ఈ చిత్రం ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుందని నమ్మకంతో చెప్పగలను. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
నా మాజీభర్తపై నాకేం కోపంలేదు.
నా మాజీభర్తపై నాకేం కోపంలేదు.
"7/జి బృందావన్ కాలనీ" చిత్రంతో కుర్రకారు గుండెల్ని పిండేసిన సోనియా అగర్వాల్ ఆ సమయంలో ధనుష్ సోదరుడు... దర్శకుడు అయిన సెల్వరాఘవన్ గుండెను కొల్లగొట్టింది. ఆ విషయాన్ని రాఘవన్ సోనియా వద్ద ఓపెన్ చేసేసరికి అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన సంవత్సరంలోపే రాఘవన్ ఆండ్రియా అనే హీరోయిన్‌ను చూసి చొంగ కార్చుకోవడం, ఆమెతో రాత్రి పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టాడు. దీంతో కోపమొచ్చిన సోనియా ఆండ్రియాను పట్టుకుని ఎడాపెడా వాయించినట్లు ఆమధ్య వార్తలు షికారు చేశాయి.ఇంత జరిగినా రాఘవన్ మనసు ఆండ్రియావైపే పరుగులు తీస్తోందని తెలుసుకున్న సోనియా అతడికి విడాకులిచ్చేసింది. తన జీవితం... మాజీభర్త గురించి ఇటీవల హైదరాబాద్‌లో కనబడినప్పుడు అడిగితే... పాస్ట్ ఈజ్ పాస్ట్. రాఘవన్ ఇప్పుడు నా భర్త కాదు... జస్ట్ ఫ్రెండ్. కనబడితే హాయ్ అంటాను.... షేక్ హ్యాండ్ కూడా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది సోనియా అగర్వాల్.
Subscribe to:
Posts (Atom)